Breaking News
  • దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై మహిళా సంఘాల అభ్యంతరం. ఎన్‌కౌంటర్‌కు వ్యతిరేకంగా హైకోర్టుకు లేఖ రాసిన మహిళా సంఘాలు. కస్టడీలో ఉన్న నిందితులను ఎలా ఎన్‌కౌంటర్‌ చేస్తారని లేఖ. కోర్టులో కేసు నడుస్తుండగా చట్టాన్ని ఎలా చేతుల్లోకి తీసుకుంటారు. ఎన్‌కౌంటర్‌ చేసిన వారిపై చర్యలు తీసుకునేలా డీజీపీని ఆదేశించాలి. మృత దేహాలకు ఫోరెన్సిక్‌ నిపుణులతో పోస్టుమార్టం చేయించాలి. పోస్టుమార్టం వీడియో తీయించాలి-లేఖలో మహిళా సంఘాలు. హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ అందుబాటులో లేకపోవడంతో సోమవారం విచారిస్తామన్న హైకోర్టు.
  • కేంద్రీయ సైనిక్‌ బోర్డ్‌కు పవన్‌కల్యాణ్‌ విరాళం. కోటి రూపాయలు విరాళం ప్రకటించిన పవన్‌కల్యాణ్‌. స్వయంగా ఢిల్లీ వెళ్లి డీడీ అందిస్తా-పవన్‌కల్యాణ్‌.
  • ఎన్‌కౌంటర్లు సమస్యకు పరిష్కారం కాదు-ట్విట్టర్‌లో ఆర్జీవీ. సమాజంలో ఉద్రేకాలను తగ్గించేందుకు ఎన్‌కౌంటర్లు దోహదం చేయొచ్చు-ట్విట్టర్‌లో రామ్‌గోపాల్‌వర్మ.
  • తూ.గో: ఆంధ్రా పాలిటెక్నిక్‌ కాలేజ్‌లో విద్యార్థులపై దాడి. విద్యార్థులపై దాడి చేసిన బయటి వ్యక్తులు. ఇద్దరు విద్యార్థులకు గాయాలు పోలీసులకు ఫిర్యాదు, కేసు నమోదు.
  • గుంటూరు: పిడుగురాళ్ల సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ఏసీబీ తనిఖీలు. లెక్కలు చూపని రూ.56,700 స్వాధీనం, కేసు నమోదు.
  • ధరల నియంత్రణలో ప్రభుత్వం విఫలమైంది-చంద్రబాబు ట్వీట్‌. ఉల్లి ధరలతో జనం అల్లాడుతుంటే దేశమంతా ధరలు పెరిగాయని వైసీపీ మంత్రులు చెప్పడం హాస్యాస్పదం-ట్విట్టర్‌లో చంద్రబాబు. ఆరు నెలల్లోనే రాష్ట్రాన్ని దళారుల రాజ్యంగా మార్చారు. ఒక్క ఉల్లి మాత్రమే కాదు.. నిత్యావసరాల ధరలన్నీ చుక్కలనంటాయి. రూ.5 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి అన్నారు.. ఏమైంది. ఉల్లి కోస్తే వచ్చే కన్నీళ్లు.. ఉల్లిని కొంటున్నప్పుడే వస్తున్నాయి. ఉల్లి ధరల తడాఖా ఏంటో స్థానిక సంస్థల్లో మహిళలు చూపిస్తారు -ట్విట్టర్‌లో చంద్రబాబు
  • మహబూబ్‌నగర్‌: దిశ నిందితుల మృతదేహాలకు పోస్ట్‌మార్టం పూర్తి. రాత్రికి మహబూబ్‌నగర్‌ ప్రభుత్వాస్పత్రిలోనే నిందితుల మృతదేహాలు. రేపు మహబూబ్‌నగర్ ఆస్పత్రికి వెళ్లనున్న ఎన్‌హెచ్ఆర్సీ ప్రతినిధులు. ఎన్‌హెచ్‌ఆర్సీ ప్రతినిధుల బృందం పరిశీలించిన తర్వాతే నిందితుల మృతదేహాలకు అంత్యక్రియలు. మహబూబ్‌నగర్‌ ప్రభుత్వాస్పత్రి దగ్గర భారీగా పోలీస్‌ బందోబస్తు.

బ్రేకింగ్: చెన్నమనేనికి బిగ్ రిలీఫ్..హైకోర్టు ఏమన్నదంటే ?

big relief to chennamaneni, బ్రేకింగ్: చెన్నమనేనికి బిగ్ రిలీఫ్..హైకోర్టు ఏమన్నదంటే ?

కేంద్ర హోం శాఖ ఇచ్చిన షాక్ నుంచి ఇంకా తేరుకోని వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌కు హైదరాబాద్ హైకోర్టు పెద్ద ఊరటనిచ్చింది. రమేశ్ భారతదేశ పౌరసత్వాన్ని రద్దు చేసిన కేంద్ర హోం శాఖ ఉత్తర్వులపై హైదరాబాద్ హైకోర్టు స్టే విధించింది. ఈ మేరకు హోం శాఖ జారీ చేసిన ఉత్తర్వులపై నాలుగు వారాలపాటు స్టే ఇస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

తన భారతదేశ పౌరసత్వాన్ని రద్దు చేస్తూ హోం శాఖ జారీచేసిన ఉత్తర్వులను కొట్టేయాలని రమేశ్‌ తెలంగాణ హైకోర్టులో గురువారం పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. తన సిటిజెన్‌షిప్‌ను రద్దు చేస్తూ బుధవారం కేంద్ర హోంశాఖ జారీచేసిన ఉత్తర్వులు వన్ సైడెడ్‌గా వున్నాయని, అవి పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమని, 1955-సిటిజన్‌షిప్ యాక్ట్‌లోని సెక్షన్ 10(3) నిబంధనలను కేంద్ర హోం శాఖ అస్సలు పట్టించుకోలేదని రమేశ్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ప్రజా భద్రతకు ముప్పు వాటిల్లకపోతే పౌరసత్వాన్ని తిరస్కరించరాదని చెబుతున్న సెక్షన్ 10(3)ను కేంద్ర హోం శాఖ పరిగణనలోకి తీసుకోలేదని ఆయన తరపు న్యాయవాది చెప్పుకొచ్చారు. పుట్టుకతోనే తాను భారతీయుడినని రమేశ్ హైకోర్టుకు నివేదించారు.

అయితే ఈ మధ్యంతర ఉత్తర్వులపై తాను ఇంప్లీడ్ అవుతానని రమేశ్ చేతిలో పరాజయం పాలైన కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ చెబుతున్నారు. భారత పౌరసత్వాన్ని వదులుకుని, తిరిగి పొందేందుకు అవసరమైన విధివిధానాలను పూర్తి చేయకుండానే రమేశ్ పౌరసత్వం పొందాడడన్నది ఆది శ్రీనివాస్ వాదన. కనీసం ఒక సంవత్సరం పాటు భారతదేశంలో వున్న తర్వాతనే ఇక్కడి పౌరసత్వాన్ని పొందేందుకు వీలుండగా.. కేవలం 94 రోజుల పాటే రమేశ్ ఇండియాలో వున్నారని ఆది శ్రీనివాస్ ఆరోపణ. ఈ నేపథ్యంలో ఈ మధ్యంతర ఉత్తర్వులపై మరోసారి న్యాయపోరాటానికి దిగనున్నట్లు ఆది చెబుతున్నారు.