వంశీ వైసీపీలో చేరడానికి రాజీనామా అవసరం లేదా?

ఏపీలో రాజకీయాలు హైటెన్షన్‌కు చేరాయి. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయికి చేరింది. వల్లభనేని వంశీ టీడీపీకి గుడ్ బై చెప్పి.. అధికార వైసీపీకి జై కొట్టడమే కాకుండా.. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు టీడీపీ పార్టీ కథ ముగిసినట్లేనని.. 2029 నాటికి ఒక చరిత్రలా మిగిలిపోతుందంటూ వంశీ జోస్యం చెప్పారు. ప్రస్తుతం ఆపరేషన్‌ ఆకర్ష్‌ కొనసాగుతున్న వేళ, అధికారపార్టీ నాయకుల చేస్తున్న కామెంట్స్‌ చర్చనీయాంశంగా మారాయి. ఇసుక- […]

వంశీ వైసీపీలో చేరడానికి రాజీనామా అవసరం లేదా?
Follow us

| Edited By:

Updated on: Nov 15, 2019 | 10:31 PM

ఏపీలో రాజకీయాలు హైటెన్షన్‌కు చేరాయి. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయికి చేరింది. వల్లభనేని వంశీ టీడీపీకి గుడ్ బై చెప్పి.. అధికార వైసీపీకి జై కొట్టడమే కాకుండా.. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు టీడీపీ పార్టీ కథ ముగిసినట్లేనని.. 2029 నాటికి ఒక చరిత్రలా మిగిలిపోతుందంటూ వంశీ జోస్యం చెప్పారు. ప్రస్తుతం ఆపరేషన్‌ ఆకర్ష్‌ కొనసాగుతున్న వేళ, అధికారపార్టీ నాయకుల చేస్తున్న కామెంట్స్‌ చర్చనీయాంశంగా మారాయి. ఇసుక- ఇంగ్లీష్‌ అంటూ విపక్షం శివాలెత్తిపోతుంటే, అసలు ప్రతిపక్షమే లేదంటూ వైసీపీ చెబుతోంది. రాష్ట్రంలో ఉన్న మూడు విపక్ష పార్టీలు బలంగా లేవని అధికారపార్టీ కొట్టిపారేస్తోంది. ప్రతిపక్షమే లేదన్న వైసీపీ నేతల మాటల్లోని ఆంతర్యం ఏంటన్నదానిపై టీవీ9 మేనేజింగ్ డైరక్టర్ రజినీకాంత్ ఆధ్వర్యంలో బిగ్‌న్యూస్- బిగ్ డిబేట్‌లో చర్చకొనసాగింది. ఈ చర్చలో అధికార పార్టీ వైసీపీ నుంచి రవిచంద్ర, టీడీపీ నుంచి బండారు సత్యనారాయణ, బీజేపీ నుంచి విష్ణువర్ధన్ రెడ్డి పాల్గొన్నారు.

గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ టీడీపీకి రాజీనామా చేస్తూ.. వైసీపీలో చేరబోతున్నట్లు ప్రకటించడంపై టీడీపీ,వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. అయితే వంశీ వైసీపీలో చేరడానికి రాజీనామా అవసరం ఉందా..? లేదా..? అన్నదానిపై ఆసక్తికర చర్చ జరిగింది. పార్టీలో ఎవరు చేరినా వారు వారి ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసిన తర్వాతే వారిని పార్టీలో చేర్చుకుంటామని గతంలో సీఎం జగన్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం గన్నవరం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న వంశీ.. వైసీపీలో చేరబోతున్నట్లు ప్రకటించారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో వంశీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినా.. స్పీకర్‌కు ఫిర్యాదు చేసే విషయంలో టీడీపీ వెనుకడుగు వేస్తుందని వైసీపీ నేత రవిచంద్ర ఆరోపించారు. వంశీ రాజీనామా చేసినా..  ఆమోదం పొందాలంటే టీడీపీ ఫిర్యాదు చేయాలని.. అలా టీడీపీ చేస్తే.. మరో ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా పార్టీ మారితే.. టీడీపీకి ఉన్న ప్రతిపక్ష హోదా కూడా కోల్పోతుందని.. ఈ పరిస్థితుల్లో టీడీపీ వంశీ ఎమ్మెల్యే పదవిపై వేటు వేయమని స్పీకర్‌ను కోరే సాహసం చేయదంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు రవిచంద్ర. దీనిపై టీడీపీ ఎలా రియాక్ట్ అయ్యిందో.. ఈ డిబేట్‌లో చూడండి.

ఎన్నికల వేళ తెరపైకి కృష్ణాజలాల వివాదం.. మాజీ మంత్రి కీలక వ్యాఖ్య
ఎన్నికల వేళ తెరపైకి కృష్ణాజలాల వివాదం.. మాజీ మంత్రి కీలక వ్యాఖ్య
గుడ్డులోని పచ్చసొన తింటే శరీరంలో కొవ్వు పెరుగుతుందా..?
గుడ్డులోని పచ్చసొన తింటే శరీరంలో కొవ్వు పెరుగుతుందా..?
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
ఐపీఎల్ నుంచి ఐదుగురు నిషేధం.. హిట్ లిస్టులో అగ్రస్థానం ఆయనదే?
ఐపీఎల్ నుంచి ఐదుగురు నిషేధం.. హిట్ లిస్టులో అగ్రస్థానం ఆయనదే?
మీరు నిద్రలో మాట్లాడుతున్నారా? దానికి కారణం ఇదేనట..!!
మీరు నిద్రలో మాట్లాడుతున్నారా? దానికి కారణం ఇదేనట..!!
జక్కన్న హుకుం.! అందుకే ప్రత్యేక శిక్షన తీసుకుంటున్న మహేష్ బాబు..
జక్కన్న హుకుం.! అందుకే ప్రత్యేక శిక్షన తీసుకుంటున్న మహేష్ బాబు..
'షూటింగ్‌లో ప్రమాదం, బ్రెయిన్ డ్యామేజ్‌..' హీరోయిన్ ఎమోషనల్.
'షూటింగ్‌లో ప్రమాదం, బ్రెయిన్ డ్యామేజ్‌..' హీరోయిన్ ఎమోషనల్.
రూ. 12వేలకే సామ్‌సంగ్‌ 5జీ ఫోన్‌.. ఫీచర్స్ కూడా సూపర్
రూ. 12వేలకే సామ్‌సంగ్‌ 5జీ ఫోన్‌.. ఫీచర్స్ కూడా సూపర్
యంగ్ హీరోకు విలన్‌గా మంచు మనోజ్‌.! ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్.
యంగ్ హీరోకు విలన్‌గా మంచు మనోజ్‌.! ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్.
IPL 2024: ధోనికే ఇచ్చిపడేసిన టీమిండియా ప్లేయర్..
IPL 2024: ధోనికే ఇచ్చిపడేసిన టీమిండియా ప్లేయర్..