Big News Big Debate: ఏపీ కేపిటల్ కహాని

Big News Big Debate, Big News Big Debate: ఏపీ కేపిటల్ కహాని

కేంద్ర మాట ఒక్కటేనా? మరి పార్టీ మాటేంటి?
అఫడవిట్‌లో ఏముంది?
జగన్‌కు లైన్ క్లియర్‌ అయినట్టేనా?

Big News Big Debate: ఎన్నిసార్లు అడిగినా మాది ఒకటేమాట అంటోంది కేంద్రం. కేపిటలా? కేపిటల్సా రాష్ట్రాలదే నిర్ణయమంటోంది. రాజధానులపై తమ పాత్ర ఉండదని ఇదివరకే స్పష్టం చేసింది కేంద్రం. మళ్లీ అడిషనల్‌ అఫిడవిట్‌లో క్లారిటీ ఇచ్చింది. చట్టంలో కేపిటల్‌ అని ఉంటే.. ఒకటే అని ఎందుకు అనుకుంటారంటోంది. దీంతో TDP లేవనెత్తిన చట్టంలోని అంశాలకు క్లారిటీ వచ్చినట్టేనని YCP అంటోంది. విపక్షాలు మాత్రం ఇంకా తమ లాజిక్కులు తమకున్నాయంటున్నాయి. దేశంలో రిఫరెండం లేదు కాబట్టే నిపుణుల అభిప్రాయాలతో రాజధానిపై నిర్ణయం తీసుకున్నామన్నారు జగన్‌. కేవలం 10వేల మంది రైతులు వ్యతిరేకిస్తున్నారని నిర్ణయం మార్చుకోలేమన్నారు. చెన్నై, హైదరాబాద్‌ రెండుసార్లు నష్టపోయిన ఏపీ మూడోసారి కోల్పోవడానికి సిద్దంగా లేదన్నారు.
అమరావతిపై ముచ్చటగా మూడో అఫిడవిట్‌ దాఖలు చేసింది కేంద్ర హోంశాఖ. రాజధాని అంశమే తమ పరిధిలో ఉండదని మరోసారి తేల్చి చెప్పింది. విభజన చట్టం ప్రకారం ఒక రాజధానే కచ్చితంగా ఉండాలని ఎక్కడా లేదని క్లారిటీ ఇచ్చింది. కేంద్రం పాత్రపై పిటిషనర్‌ దోనే సాంబశివరావువి అపోహలేనని స్పష్టం చేసింద సెంటర్‌. కేవలం మౌలిక సదుపాయాల ఏర్పాటుకు సాయం చేయాలని మాత్రమే విభజన చట్టంలో ఉందన్నారు. మరోవైపు హైదరాబాద్‌ పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా ఉన్నా… విభజన చట్టం అమలులోకి వచ్చిన ఏడాదిలోనే అమరావతి రాజధాని అని రాష్ట్రం నోటిఫై చేసిందని పేర్కొన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 3 ప్రకారం రాజధానిపై కేంద్రం జోక్యం ఉండదన్నారు. మరోవైపు హైకోర్టు ఉన్నంత మాత్రాన అమరావతినే రాజధాని అని చెప్పలేమని అఫిడవిట్‌లో పేర్కొనడం విశేషం. హైకోర్టు రాజధానిలోనే ఉండాలన్న నిబంధన కూడా ఏదీ లేదని తేల్చి చెప్పింది.
అంతకుముందు ఆగస్టు రెండోవారంలోనూ అఫిడవిట్‌ దాఖలు చేసింది కేంద్రం. రాష్ట్ర రాజధాని నిర్ణయంలో తమకు ఎలాంటి పాత్ర ఉండదని అందులోనే స్పష్టంచేసింది. విభజన సమయంలో రాష్ట్రాలకు ఇచ్చిన హామీలు అమలుపైనా స్పష్టత ఇచ్చింది. రాజధాని నిర్మాణం కోసం 2వేల 500 కోట్లు ఇచ్చామంది. అయితే రాజధానులా? రాజధానా అన్నది రాష్ట్రాలే నిర్ణయించుకుంటాయంది. పాతకాలం నాటి చట్టాలను గుర్తుచేస్తూ మరీ కేంద్రం అఫడవిట్‌ దాఖలు చేసింది.

అఫడవిట్లో ఏముందంటే…

13వ షెడ్యూల్‌ లోని సెక్షన్‌ 6, సెక్షన్‌ 94(3) & (4)లో ప్రస్తావన
‘ఏ కేపిటల్‌ ఫర్‌ స్టేట్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్’
..అంటే ఏపీకి సింగిల్‌ కేపిటల్‌ సిటీ అని ఖచ్చితంగా చెప్పలేదు
ది జనరల్‌ క్లాజెస్‌ యాక్ట్‌ 1897 ప్రకారం
అన్ని చట్టాలు, మార్గదర్శకాల్లో ప్రత్యేకంగా చెప్పనంతవరకూ..
సింగిల్‌ వర్డ్‌ యూజ్‌ చేసినా.. ప్లూరల్‌కు ఇది వర్తిస్తుంది
కాబట్టి, పిటిషనర్‌ ఇంటర్‌ ప్రిటేషన్‌ పూర్తిగా లోప భూయిష్టం
సెక్షన్ 94 ప్రకారం కేపిటల్‌కు కేంద్రం సాయం చేస్తుంది
హైకోర్టు అమరావతిలో ఉండేలా రాష్ట్రపతి ఆర్డర్స్‌ వచ్చాయి
హైకోర్టు ఉందని అమరావతినే కేంద్రం కేపిటల్‌గా గుర్తించదు
2015 ఏప్రిల్‌23న అమరావతి కేపిటల్‌ సిటీగా రాష్ట్రం నోటిఫై చేసింది
సర్వే ఆఫ్‌ ఇండియా పొలిటికల్‌ మ్యాప్‌ లో అమరావతి

Big News Big Debate, Big News Big Debate: ఏపీ కేపిటల్ కహాని

అంతకుముందు అఫడవిట్‌లో
విభజన చట్టం సెక్షన్‌ 6 ప్రకారం
28-03-2014న శివరామకృష్ణన్‌ కమిటీ
30-08-2014న నివేదిక ఇచ్చిన కమిటీ
01-09-2014న ఏపీకి నివేదిక పంపిన హోంశాఖ
23-04-2015న కేపిటల్‌ సిటీగా అమరావతి నోటిఫై చేసిన ఏపీ
రాజధానిపై రాష్ట్రప్రభుత్వమే నిర్ణయం తీసుకుంది
ఇందులో కేంద్రానికి ఎలాంటి పాత్ర లేదు
31-7-2020న మూడు రాజధానులుగా రాష్ట్రం నోటిఫై చేసింది
దీనిపైనా ముందస్తుగా సమాచారం ఇవ్వలేదు
అమరావతి లెజిస్లేచర్‌ కేపిటల్‌
విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్‌ కేపిటల్‌
కర్నూలు జ్యడిషియల్‌ కేపిటల్‌

Big News Big Debate, Big News Big Debate: ఏపీ కేపిటల్ కహాని

జగన్‌ క్లారిటీ…
అటు ఏపీ సీఎం జగన్‌ చాలాకాలం తర్వాత అమరావతిపై జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు. కేవలం 29 గ్రామాల్లో ఉండే 10వేల మంది రైతులు మాత్రమే వ్యతిరేకిస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రజల సంపూర్ణ మద్దతు తమకుందన్నారు సీఎం. రిఫరెండం ఉండి ఉంటే జనాల్లోకి వెళ్లేవాళ్లమని.. లేదు కాబట్టే నిపుణుల అభిప్రాయాలతో వికేంద్రీకరణకు వెళ్లినట్టు చెప్పారు. 1990ల్లో మాదాపూర్‌ లో ఇన్‌ సైడ్‌ ట్రేడింగ్‌ జరిగింది.. ఇప్పుడు అమరావతిలోనూ అవే ప్రయత్నాలు జరిగాయన్నారు. విచారణలో బయటకు వస్తాయన్నారు. 15 నెలలుగా చంద్రబాబు అమరావతి ఒక్కటే ఎజెండాగా పనిచేస్తున్నారన్నారు. నగరాల అవసరం లేదని.. కేరళ తరహాలో జిల్లాలను అభివృద్ది చేయాలన్న ఉద్దేశాన్ని ఆయన వ్యక్తపరిచారు. ప్రతి జిల్లాలో సకల సదుపాయాలతో జనాలకు మెరుగైన పాలన అందించడానికి ప్రయత్నిస్తున్నట్టు తెలిపారు సీఎం జగన్‌. శివరామకృష్ణన్ కమిటీ నివేదికను తాము పాటిస్తున్నట్టు చెప్పిన జగన్‌, రాజధానికి 500 ఎకరాలు చాలన్నారు. 33వేల ఎకరాల్లో మెగా స్ట్రక్చర్ కట్టకలిగే భూమి ఎక్కడుందన్ని ప్రశ్నించారు సీఎం జగన్‌.
మొత్తానికి అటు కేంద్రం అఫిడవిట్‌, ఇటు జాతీయమీడియాకు సీఎం జగన్ ఇంటర్వ్యూ మరోసారి కేపిటల్‌ అంశాన్ని చర్చనీయాంశంగా మార్చాయి. మరి రాజధాని అంశంలో ఎవరి పంతం నెగ్గుతుందో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *