ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలకు కారణం ఎవరూ..?

ఓవైపు తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె.. మరోవైపు ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు.. 28 రోజులు గడుస్తున్నా.. తెలంగాణ గడ్డ మీద ప్రగతిచక్రానికి గ్నీన్‌సిగ్నల్ పడని పరిస్థితి నెలకొంది. అటు- చర్చలు జరపాలన్న హైకోర్టు, లెక్కలపై ఆర్టీసీ యాజమాన్యానికి చీవాట్లు పెట్టింది. ఇదిలా ఉంటే.. ఇప్పటికే 16 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. ఇటువంటి పరిస్థితుల్లోనే ఆర్టీసీలో వాటాదారు అయిన కేంద్రప్రభుత్వం- సమ్మెపై స్పందించాలంటూ సీపీఎం డిమాండ్‌ చేస్తోంది. ఇప్పటికీ సంక్లిష్టంగా కనిపిస్తున్న ఆర్టీసీ సమస్యకు.. పరిష్కారం ఇంకెన్నడు […]

ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలకు కారణం ఎవరూ..?
Follow us

| Edited By:

Updated on: Nov 01, 2019 | 9:54 PM

ఓవైపు తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె.. మరోవైపు ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు.. 28 రోజులు గడుస్తున్నా.. తెలంగాణ గడ్డ మీద ప్రగతిచక్రానికి గ్నీన్‌సిగ్నల్ పడని పరిస్థితి నెలకొంది. అటు- చర్చలు జరపాలన్న హైకోర్టు, లెక్కలపై ఆర్టీసీ యాజమాన్యానికి చీవాట్లు పెట్టింది. ఇదిలా ఉంటే.. ఇప్పటికే 16 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. ఇటువంటి పరిస్థితుల్లోనే ఆర్టీసీలో వాటాదారు అయిన కేంద్రప్రభుత్వం- సమ్మెపై స్పందించాలంటూ సీపీఎం డిమాండ్‌ చేస్తోంది. ఇప్పటికీ సంక్లిష్టంగా కనిపిస్తున్న ఆర్టీసీ సమస్యకు.. పరిష్కారం ఇంకెన్నడు అన్నదే ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. ఆర్టీసీ ఆర్థిక స్థితిగతులపై ఆ సంస్థ ఇన్‌చార్జ్‌ ఎండీ సునీల్‌శర్మ సమర్పించిన వివరాలపై హైకోర్టు సీరియస్‌ అయింది. ముఖ్యంగా జీహెచ్ఎంసీ నుంచి రూ. 1786 కోట్లు రావాలనీ, కానీ ఆ సంస్థ మాత్రం నిధులు చెల్లించలేమని చెప్పిందన్నది ఆర్టీసీ నివేదిక. జీహెచ్ఎంసీ చట్టం ప్రకారం ఆ సంస్థ నిధులు ఇవ్వలేమని చెప్పినందున- వాటిని బకాయిలుగా పరిగణించలేమని ఆర్టీసీ ఎండీ చెప్పారు. ఇక సమ్మె నేపథ్యంలో కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడటంపై వివిధ పార్టీల నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం మొండి వైఖరిని వదులుకొని చర్చలు జరపాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇంతకు ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలకు కారణం ఎవరూ? అనే అంశంపై టీవీ9 బిగ్ న్యూస్ బిగ్ డిబేట్ వేదికగా వివిధ పార్టీల నేతలతో ఇవాళ చర్చ కొనసాగింది. ఈ డిబేట్‌లో వివిధ పార్టీల నేతలు.. వారి వారి అభిప్రాయాలు తెలియజేశారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ దిగువ వీడియోలో చూడండి.