Breaking News
  • విజయవాడ: ఢిల్లీ అల్లర్ల బాధితుల కోసం సీపీఎం విరాళాల సేకరణ. మార్చి 2, 3 తేదీల్లో విరాళాలు సేకరించాలని పార్టీ శాఖలకు పిలుపు. సహృదయులైన దాతలు ఆదుకోవాలని కోరుతున్నాం-సీపీఎం ఏపీ కార్యదర్శి మధు.
  • చెన్నై: వేలూరు డిప్యూటీ కలెక్టర్‌ దినకరన్‌ అరెస్ట్‌. అవినీతి ఆరోపణలతో అరెస్ట్‌ చేసిన ఏసీబీ అధికారులు. ఏసీబీ తనిఖీల్లో భారీగా నగదు లభ్యం. తిరువన్నామలైకి చెందిన రంజిత్‌ కుమార్‌ భూముల విక్రయంలో ఆరోపణలు. ఏసీబీ సోదాల్లో ఇప్పటి వరకు రూ.76 లక్షల నగదు లభ్యం.
  • తెలంగాణ అసెంబ్లీ సమావేశాల షెడ్యూల్‌ ఖరారు. మార్చి 6 నుంచి తెలంగాణ అసెంబ్లీ, కౌన్సిల్‌ సమావేశాలు. మార్చి 8న బడ్జెట్‌ ప్రవేశపెట్టే అవకాశం.
  • నోరు తెరిస్తే 14 ఏళ్లు సీఎంగా చేశా అంటారు. మమ్మల్నే అడ్డుకుంటారా అంటూ పోలీసులపై చిందులేయడం.. మీ మానసిక దౌర్భల్యాన్ని బయటపెడుతోంది. మీరు జీతాలిచ్చే హెరిటేజ్‌ స్టాఫ్‌ కూడా మాటలు పడరు.
  • ఢిల్లీలో 14 విమానాల దారి మళ్లింపు. వాతావరణం అనుకూలించక విమానాల దారి మళ్లింపు. లక్నో, అహ్మదాబాద్‌, జైపూర్‌ ఎయిర్‌పోర్టులకు మళ్లించిన అధికారులు.

అప్పు చేసి తప్పు చేస్తే కేసు ఎందుకు పెట్టరు? బిగ్ న్యూస్ బిగ్ డిబేట్‌లో బీజేపీ నేత

Big News Big Debate : TDP vs YCP on AP Economy - Rajinikanth TV9, అప్పు చేసి తప్పు చేస్తే కేసు ఎందుకు పెట్టరు? బిగ్ న్యూస్ బిగ్ డిబేట్‌లో బీజేపీ నేత

ఏపీ ఆర్థికపరిస్థితిపై టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య మాటల యుద్ధం తారా స్థాయికి చేరింది. టీవీ9 బిగ్ న్యూస్- బిగ్ డిబేట్ వేధికగా జరిగిన చర్చా కార్యక్రమంలో బీజేపీ నేత రఘురామ్ వైసీపీ, టీడీపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఇరు పార్టీలు ప్రజల్ని మోసం చేస్తున్నాయని. రాష్ట్రానికి చేసిన అప్పుల విషయంలో ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారని.. కానీ నిజాలు ఎంటో ప్రజలకు వివరించడం లేదని మండిపడ్డారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై చంద్రబాబు ఆరోపణలు చేశారని.. ఆ తర్వాత చంద్రబాబుపై వైసీపీ ఆరోపణలు చేసిందని.. కానీ ఇరు పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు.. నిజంగా అప్పు చేసి తప్పు చేస్తే వారిపై కేసులు ఎందుకు నమోదు చేయడం లేదని ప్రశ్నించారు. బిగ్ న్యూస్ బిగ్ డిబేట్ వేదికలో వైసీపీ నుంచి ఈద రాజశేఖర్, టీడీపీ నుంచి మాల్యాద్రిలు పాల్గొన్నారు.

ఇవాళ ఉదయం టీడీపీని టార్గెట్ చేస్తూ.. ఏపీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబు చేసిన అప్పులతో.. రాష్ట్రానికి అప్పులు తీసుకురాలేని పరిస్థితిని తెచ్చారని మండిపడ్డారు. గత ఐదేళ్లలో మాజీ సీఎం చంద్రబాబు ప్రభుత్వం చేసిన అప్పుల తప్పుల్ని.. మూడు నెలల్లోనే ఎలా సరిదితద్దుతామంటూ ప్రశ్నించారు. రూ. 38వేల కోట్లు సప్లిమెంటరీ గ్రాంట్లు, 40వేల కోట్ల పెండింగ్‌ బిల్స్‌, 65 వేల కోట్ల చెల్లించాల్సిన అప్పులు ఇచ్చి వెళ్లారని విమర్శింంచారు. ఎన్నికలకు ముందు ఆర్నెల్లలో కాంట్రాక్టర్లకు 7వేల కోట్లకు పైగా బిల్లులు చెల్లించారని విమర్శించారు. టీడీపీ హయాంలో డిస్కమ్‌లకు 14,857 కోట్ల రూపాయల నిధులు పెండింగ్‌లో పెట్టారని అన్నారు. టీడీపీ హయాంలో ఐదేళ్లలో కనీసం 165 శాతం పెరగాల్సిన తలసరి ఆదాయం, కేవలం 70 శాతమే పెరిగిందని విమర్శించారు.

ఇక టీడీపీ నేతలే ఎన్నికల ముందు అప్పు పుట్టదని ప్రచారంలో యనమల అన్నారని డిబేట్‌లో వైసీపీ నేత ఆరోపించారు. దీన్ని బట్టి చూస్తే చంద్రబాబు ఆర్థిక వ్యవస్థ ఎలా ఉందో అర్థమవుతుందని ఈద రాజశేఖర్ అన్నారు. ప్రస్తుతం చంద్రబాబు చేసిన అప్పులకు అప్పు కూడా పుట్టకుండా పరిపాలించి వెళ్లారంటూ ఆరోపించారు. దీనిపై టీడీపీ నేత మాల్యాద్రి కౌంటర్ అటాక్ చేశారు. బుగ్గన రాజేంద్ర ఇచ్చిన శ్వేత పత్రంలోనే టీడీపీ అప్పుల రేషియో 2014 కంటే 2018-19లో తగ్గిందన్నారు. 2014లో టీడీపీ హయాంలో 28.25గా ఉన్న అప్పుల రేషియో.. 2018-19లో 28.12కు తగ్గిందని అన్నారు.

Related Tags