ఇన్ సైడర్ ట్రేడింగ్ “టీడీపీ”దా లేక “వైసీపీ”దా..?

మంగళవారం అసెంబ్లీలో సీఎం వైఎస్ జగన్ చేసిన మూడు రాజధానుల ప్రకటన.. ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ ఫార్ములాపై విశాఖ, కర్నూలులో హర్షం వ్యక్తమైతే, అమరావతి ప్రాంతంలో మాత్రం తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. రాజధానికి భూములిచ్చిన రైతులు ధర్నాలకు దిగారు. ప్రధాని శంకుస్థాపన చేసిన ఉద్దంరాయునిపాలెంలో ఆందోళన చేపట్టారు. మూడు రాజధానుల ప్రకటన వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ.. గురువారం రాజధాని బంద్‌కు పిలుపునిచ్చారు. రోడ్ల దిగ్బంధం, వంటావార్పులు చేపట్టాలని నిర్ణయించారు. వెలగపూడిలో రిలే నిరాహారదీక్షలు […]

ఇన్ సైడర్ ట్రేడింగ్ టీడీపీదా లేక వైసీపీదా..?
Follow us

| Edited By:

Updated on: Dec 18, 2019 | 10:54 PM

మంగళవారం అసెంబ్లీలో సీఎం వైఎస్ జగన్ చేసిన మూడు రాజధానుల ప్రకటన.. ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ ఫార్ములాపై విశాఖ, కర్నూలులో హర్షం వ్యక్తమైతే, అమరావతి ప్రాంతంలో మాత్రం తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. రాజధానికి భూములిచ్చిన రైతులు ధర్నాలకు దిగారు. ప్రధాని శంకుస్థాపన చేసిన ఉద్దంరాయునిపాలెంలో ఆందోళన చేపట్టారు. మూడు రాజధానుల ప్రకటన వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ.. గురువారం రాజధాని బంద్‌కు పిలుపునిచ్చారు. రోడ్ల దిగ్బంధం, వంటావార్పులు చేపట్టాలని నిర్ణయించారు. వెలగపూడిలో రిలే నిరాహారదీక్షలు చేపడతామంటున్నారు.

అటు ఈ ఫార్ములాను గట్టిగా వ్యతిరేకిస్తున్న టీడీపీ కొత్త వాదన తెరమీదకు తెచ్చింది. విశాఖ చుట్టుపక్కల వైసీపీ నేతలు ఆరువేల ఎకరాల భూములు కొనుగోలు చేశారని, ఆ పార్టీ ఆరోపిస్తోంది. సీబీఐ ఎంక్వైరీ వేస్తే అన్ని విషయాలు బయటకు వస్తాయని టీడీపీ వేస్తున్న బిగ్‌బాంబ్‌. టీడీపీతోపాటు జనసేన కూడా ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ అన్న ఆరోపణను అస్త్రంగా మలచుకున్నాయి. ఇక ఈ రాజధానుల అంశంపై కేంద్రానికి ఫిర్యాదు చేస్తానని టీడీపీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యానించడంతో.. బీజేపీ స్పందించింది. రాజధాని ఎక్కడ ఉండాలి.. ఎన్ని ఉండాలన్న దానిపై కేంద్రానికి సంబంధం లేదంటూ బీజేపీ అంటోంది.

మరోవైపు రాజధానికి లక్ష 9వేల కోట్లు ఎక్కడనుంచి తేవాలంటూ ప్రశ్నించి, సాగునీటి, మౌలికవసతుల ప్రాధాన్యాలను అసెంబ్లీలో జగన్‌ వివరించిన నేపథ్యంలో.. రాజధాని కోసం భూములిచ్చిన రైతుల పరిస్థితి ఏంటన్నది ఇప్పుడు కీలకంగా మారింది. ఈ క్రమంలో రైతులందరికీ న్యాయం చేస్తారని మంత్రి పేర్ని నాని తెలిపారు.

ప్రస్తుతం రాజధాని వ్యవహారమంతా ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ అంశం చుట్టూ తిరుగుతోంది. ఈ క్రమంలో వైసీపీ కొన్ని ఆధారాలను కూడా బయటపెట్టింది. ఈ నేపథ్యంలో అమరావతిలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిగిందంటూ వైసీపీ ఆరోపణలు చేస్తే.. తాజాగా టీడీపీ, జనసేనలు వైసీపీ చేస్తున్న ఆరోపణలను తిప్పికొడుతున్నాయి. విశాఖ చుట్టుపక్కల వైసీపీ నేతలు ఆరువేల ఎకరాల భూములు కొన్నారని, అందుకే అక్కడ ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌ అంటున్నారంటూ తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పిస్తున్నారు. రాజధాని చుట్టూ సాగుతున్న ఈ హాట్‌టాపిక్‌ మీద టీవీ9 మేనేజింగ్ ఎడిటర్ రజనీకాంత్ ఆధ్వర్యంలో జరిగిన బిగ్‌న్యూస్ బిగ్ డిబేట్‌లో.. ఇన్ సైడర్ ట్రేడింగ్ TDPదా.. YCPదా అన్నదానిపై టీడీపీ, వైసీపీ పార్టీల మధ్య తీవ్ర స్థాయిలో చర్చ జరిగింది. అదేంటో ఈ వీడియోలో చూడండి.