Breaking News
  • ఆదిలాబాద్‌: నేటి నుంచి నాగోబా జాతర. ఇంద్రవెళ్లి మండలం కేస్లాపూర్‌లో ప్రారంభంకానున్న జాతర. జాతరకు రానున్న తెలంగాణ, మహారాష్ట్ర, ఒడిశా.. మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల ఆదివాసీలు, గిరిజనులు.
  • అవినీతి సూచిలో భారత్‌కు 80వ స్థానం. ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతిపై వ్యాపారవర్గాలు నుంచి.. వివరాలు సేకరించిన ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్‌ సంస్థ. అవినీతి కట్టడిలో తొలిస్థానంలో నిలిచిన డెన్మార్క్‌, న్యూజిలాండ్‌.
  • వలసల నియంత్రణకు ట్రంప్‌ సర్కార్‌ మరో కీలక చర్య. అమెరికా వచ్చే విదేశీ గర్భిణులపై ఆంక్షలు విధింపు. కాన్పు కోసమే అమెరికా వచ్చేవారికి పర్యాటక వీసా నిరాకరణ.
  • రోహింగ్యాల ఊచకోతపై అంతర్జాతీయ న్యాయస్థానం సంచలన తీర్పు. మయన్మార్‌లో రోహింగ్యాల నరమేధం జరిగింది. సైన్యం అండతో రోహింగ్యాలను ఊచకోత కోశారన్న న్యాయస్థానం. రోహింగ్యాలను రక్షించడానికి వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశం.
  • కరోనా వైరస్‌కు కారణం పాములే. చైనా అధ్యయనంలో వెల్లడి. ఐదు నగరాలకు రాకపోకలన్నీ నిలిపివేసిన చైనా. వుహాన్‌, హుయాంగ్‌గాంగ్‌, ఎఝౌ, ఝిజియాంగ్‌.. ఖియాన్‌జింగ్‌ నగరాలపై రవాణా ఆంక్షలు విధింపు.

పోలవరంపై కొత్త పంచాయితీ.. పీపీఏ తప్పుచేసిందా..?

Big News Big Debate : Polavaram Controversy - Rajinikanth TV9, పోలవరంపై కొత్త పంచాయితీ.. పీపీఏ తప్పుచేసిందా..?

ఏపీ రాజకీయాల్లో పోలవరం ప్రాజెక్ట్ మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. గత ప్రభుత్వ హయాంలో వేలకోట్ల రూపాయల నిధులు దుర్వినియోగం, అవినీతి జరిగిందని అధికార వైసీపీ ఆరోపిస్తూ.. రివర్స్ టెండరింగ్ ప్రక్రియను వైసీపీ ప్రభుత్వం విజయవంతంగా పూర్తి చేసిన విషయం తెలిసిందే. అయితే ఇదిలా ఉంటే.. ప్రముఖ ఆర్ధిక రంగ నిపుణులు పెంటపాటి పుల్లారావు పోలవరం ప్రాజెక్ట్‌లో భారీ అవినీతి జరిగిందంటూ.. ఢిల్లీ హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన ఢిల్లీ హైకోర్టు.. ప్రాజెక్టులో అవినీతిపై విచారణ జరపాలని కేంద్రాన్ని ఆదేశించడం చర్చనీయాంశంగా మారింది. ఇదే అంశంపై టీవీ9 బిగ్ న్యూస్ బిగ్ డిబేట్‌లో సుదీర్ఘ చర్చ జరిగింది. ఈ చర్చలో టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి, వైసీపీ నేత రవిచంద్ర మధ్య తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసుకున్నారు. టీడీపీ హయాంలో భారీ అవకతవకలు జరిగాయని వైసీపీ నేత పట్టాభి ఆరోపించారు.

15 జూలై 2019 విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకి రాజ్యసభలో కేంద్ర జల శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షకావత్ స్పష్టంగా సమాధానం ఇచ్చారని పట్టాభి చెప్పారు. ప్రాజెక్ట‌లో ఎలాంటి అవకతవకలు జరగలేదని తేల్చిచెప్పారు. 2013 నూతన భూసేకరణ చట్టం వచ్చిన తర్వాత ఎస్టిమేట్స్ 16 వేల కోట్ల నుంచి 56వేల కోట్లకు పెరిగిన విషయం అందరికీ తెలిసిందేనని పట్టాభి అన్నారు. అంతేకాదు పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ (పీపీఏ) అనేక సందర్భాల్లో ఎలాంటి అవకతవకలు జరగలేదని తేల్చిచెప్పిందన్నారు. అయితే 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చాక 35 నెలల పాటు కేవలం రూ. 232 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందని వైసీపీ నేత రవిచంద్ర అన్నారు. అయితే పోలవంర ప్రాజెక్ట్ పెంపుకు పూర్తిగా టీడీపీనే కారణమని.. దీనికి ఏ ఒక్క అధికారి కూడా బాధ్యుడు కాదంటూ వైసీపీ నేత రవిచంద్ర ఆరోపించారు. అయితే పోలవరం ప్రాజెక్ట్ పెంపు విషయంలో అధికారులపై ఒత్తిడి తెచ్చి.. మంత్రి వర్గంతో ఆమోధించుకున్నారని ఆరోపించారు. హెడ్ వర్క్స్ పనిలో భాగంగా 2016 జనవరి 25న జీవో నంబర్ 13తో.. అప్పటి వరకు రూ. 4054 ఉన్న అంచనాను రూ. 6960 కోట్లకు గతంలో ఉన్న ట్రాన్స్ ట్రాయ్ కంపెనీకే మళ్లీ ఇచ్చారని ఆరోపించారు. ఇక లెఫ్ట్ కెనాల్‌లో హెడ్ వర్క్స్‌ 189 కిలోమీటర్ల ఉంటే 135 కిలో మీటర్లు వైఎస్ఆర్ సమయంలోనే పూర్తయ్యాయని.. దీనికి రూ.1954 కోట్లు ఉన్న అంచనాను రూ.3465 కోట్లకు పెంచి.. మంత్రి వర్గం ఆమోధించిందని ఆరోపించారు. అంతేకాదు.. డిసెంబర్ 2016లో జీవో నంబర్ 117ను విడుదల చేశారని.. అందులో రైట్ కెనాల్‌కు సంబంధించి 177 కిలో మీటర్లు ఉండగా.. ఇందులో 144.3 కిలో మీటర్లు వైఎస్ఆర్ హయాంలోనే పూర్తయ్యిందని.. దీనికి రూ.2240 కోట్ల అంచనాను రూ.4375 కోట్లు పెంచారని దీనికి మంత్రి వర్గం ఆమోదం తెలిపిందని అన్నారు. అంతేకాదు పీపీఏ అనుమతి లేకుండానే 2017 ఫిబ్రవరి 6వ తేదీన జీవో నంబర్.41 ద్వారా రూ.6000 కోట్ల నామినేటెడ్ వర్క్స్ ఇచ్చారని.. వీటికి పీపీఏ అప్రూవ్ లేదని ఆరోపించారు. పోలవరం ప్రాజెక్ట అథారిటీ అనుమతి లేనిదే ఒక్క పైసా కూడా ఎవ్వరికీ ఇవ్వలేమని.. పెంచిన అంచనాలను పీపీఏ కూడా అనుమతులిచ్చిందని తేల్చిచెప్పారు. 2018 జనవరి 11వ తేదీన అన్నింటికీ పీపీఏ అనుమతులు ఇచ్చిందని.. వైసీపీ చేసేవన్నీ ఆరోపణలేనని.. పట్టాభి స్పష్టం చేశారు.