Breaking News
  • హైదరాబాద్: జర్నలిస్టులందరికీ హెల్త్‌ కార్డులు అందించాలి, అన్ని ఆస్పత్రుల్లో సేవలు అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి, ఈనెల 20 నుంచి 25 వరకు రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు, ఎమ్మెల్యేలకు టీయూడబ్ల్యూజే వినతి పత్రాలు-టీయూడబ్ల్యూజే ప్రధాన కార్యదర్శి విరాహత్‌ అలీ.
  • ఆసియాలోనే లైఫ్‌ సైన్సెస్‌కు ప్రధాన కేంద్రంగా హైదరాబాద్‌ మారింది. ప్రపంచ వ్యాక్సిన్‌ ఉత్పత్తిలో మూడో వంతు హైదరాబాద్‌ సరఫరా చేస్తోంది. జాతీయ ఫార్మా ఉత్పత్తిలో హైదరాబాద్‌ వాటా 35శాతం-మంత్రి కేటీఆర్‌.
  • యాదాద్రి: గుండాల మండలం సుద్దాల దగ్గర ప్రమాదం, కారు, బైక్‌ ఢీకొని ఇద్దరు మృతి, ఒకరికి తీవ్రగాయాలు.
  • విజయవాడ: ఎమ్మార్వో వనజాక్షిపై టూటౌన్ పీఎస్‌లో ఫిర్యాదు, తమను కులం పేరుతో దూషించిందని ఫిర్యాదు చేసిన మహిళా రైతులు.
  • మహబూబాబాద్: పోడు భూముల ఆక్రమణదారులకు కలెక్టర్‌ హెచ్చరిక. 10 ఎకరాలకు మించి పోడు భూములు ఆక్రమించిన 119 మంది. ఆక్రమణదారుల్లో ప్రభుత్వ ఉద్యోగులు, నేతలు, కుల సంఘాల నేతలు. భూములు వెంటనే తిరిగి అప్పగించాలని కలెక్టర్ ఆదేశం. లేదంటే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరిక.
  • ప్రాణం తీసిన సెల్ఫీ. కృష్ణాజిల్లా: నూజివీడులో విషాదం. సూరంపల్లి కాలువ దగ్గర సెల్ఫీ దిగేందుకు యువకుడు యత్నం. ప్రమాదవశాత్తు కాలువలో పడి యువకుడు మృతి. బీటెక్‌ ఫైనల్‌ ఇయర్‌ చదువుతున్న పవన్‌.

‘రైతు భరోసా’ లో కులం చిచ్చు…! బిగ్ న్యూస్-బిగ్ డిబేట్

Big News Big Debate 15102019, ‘రైతు భరోసా’ లో కులం చిచ్చు…! బిగ్ న్యూస్-బిగ్ డిబేట్

ఆంధ్రప్రదేశ్‌లోరైతుభరోసా-పీఎం కిసాన్‌ పథకం అమల్లోకి వచ్చింది. నెల్లూరు జిల్లా… కాకుటూరులో సీఎం వైఎస్‌ జగన్‌ ఈ పథకాన్ని ప్రారంభించారు. విక్రమసింహపురి విశ్వవిద్యాలయ ప్రాంగణంలో సీఎం జగన్… పథకాన్ని ప్రారంభించి… కౌలు రైతులకు రైతు భరోసా పథకం కార్డులు ఇవ్వడంతో పాటూ… రైతులకు రైతు భరోసా పథకం కింద వ్యవసాయ పెట్టుబడి సాయంగా చెక్కులు ఇచ్చారు. ఈ రైతు భరోసా పథకానికి రూ.5,510 కోట్లను విడుదల చేస్తూ ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి కె.సత్యనారాయణ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ స్కీం ద్వారా… ఏపీలో 50 లక్షల మంది రైతులకు ప్రయోజనం కలుగుతుందని ప్రభుత్వం తెలిపింది. 3 లక్షల మంది కౌలు రైతులకు కూడా మేలు జరుగుతుందని వివరించింది.

జగన్‌ సర్కార్‌ ప్రవేశపెట్టిన ఈ స్కీం  ఏపీ పాలిటిక్స్‌లో కొత్త చర్చను లేవనెత్తింది. పథకాన్ని ముందే తెచ్చి, చెప్పినదానికంటే ఐదేళ్లలో ఎక్కువగా డబ్బులు కేటాయిస్తున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. కానీ ప్రతిపక్షం మాత్రం- ఐదేళ్లలో రైతులకు 10వేల కోట్ల రూపాయల ద్రోహం జరిగినట్లు వాదిస్తోంది. కౌలు రైతులకు దేశంలోకెల్లా ఇంతసాయం చేస్తున్నది తామేనంటూ జగన్‌ చెబుతుంటే, కౌలురైతుల విషయంలో కూడా కులాలు ఎందుకని టీడీపీ ప్రశ్నిస్తోంది. అగ్రవర్ణ కౌలు రైతులపై ఏపీ ప్రభుత్వం వివక్ష చూపుతుందంటూ టీడీపీతో పాటు కాంగ్రెస్ కూడా ఆరోపిస్తుంది. ప్రతిపక్షాల విమర్శలపై ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఈ విషయంపై టీవీ9 మేనేజింగ్ ఎడిటర్ రజనీకాంత్ ఆధ్వర్యంలో బిగ్ న్యూస్ – బిగ్ డిబేట్ వేదికగా కీలక చర్చ జరిగింది. ఈ డిష్కసన్‌లో ఏపీ ప్రభుత్వం తరుపున ఎమ్మెల్యే పార్థసారథి, టీడీపీ తరుపున ఆలపాటి రాజా, కాంగ్రెస్ తరుపున తులసీ రెడ్డి, బిజేపీ తరుపున విష్టువర్థన్ రెడ్డి పాల్గొన్నారు. ఆ డిటేల్స్ దిగువ వీడియోలో…!