Breaking News
  • తమిళనాడులో కొత్తగా మరో 3,680 కేసులు.. 64 మరణాలు..
  • బాలీవుడ్‌ నటుడు సుశాంత్ సింగ్ రాజ్​పుత్​ ఆత్మహత్యపై సీబీఐ చేత విచారణ జరిపించాలని బీజేపీ ఎంపీ, మాజీ కేంద్రమంత్రి సుబ్రహ్మణియన్ స్వామి డిమాండ్​ చేశారు.
  • సీఎంజగన్‌ మాట్లాడుతూ.. ఆగస్టు 9న ఆదివాసీ దినోత్సవం సంద‌ర్భంగా పట్టాల పంపిణీ చేయనున్నట్లు వివ‌రించారు. అందుకు సంబంధించిన క్లెయిమ్‌లను పరిశీలించి గిరిజనులకు ల‌బ్ది చేకూర్చాల‌ని అధికారులను ఆదేశించారు.
  • దేశ భద్రత నేపథ్యంలో టిక్‌టాక్‌ సహా 59 చైనా యాప్‌లను కేంద్ర ప్రభుత్వం నిషేధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఎలక్ట్రానిక్స్ అండ్‌ ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఈ యాప్‌లకు సంబంధించిన‌ కంపెనీలకు నోటీసులు పంపారు.
  • ఈఎస్ఐ స్కాం కేసు మరో మలుపు తిరిగింది. మందుల కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి పితాని సత్యనారాయణ మాజీ వ్యక్తిగత కార్యదర్శి మురిళీని ఏసీబీ అధికారులు శుక్రవారం అరెస్ట్ చేశారు.
  • కరోనా కట్టడిలో ముందు వరుసలో ఉన్న రాష్ట్రాలు సైతం వైరస్ విస్తరిస్తోంది. తాజాగా కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్‌ యడ్యూరప్ప హోం క్వారంటైన్ లో వెళ్లారు. ఇకపై కొద్ది రోజుల పాటు ఇంటి నుంచే పనిచేయనున్నట్లు 77 ఏళ్ల యడ్యూరప్ప తెలిపారు .
  • ఏపీలోని పింఛ‌న్ దారుల‌కు గుడ్‌న్యూస్ చెప్పింది జ‌గ‌న్ స‌ర్కార్‌. ఆగ‌ష్టు 1వ తేదీ నుంచి వారికి ఇచ్చే పెన్ష‌న్ మొత్తం పెర‌గ‌నుంది. ప్ర‌స్తుతం పెన్ష‌న్ దారుల‌కు నెల‌కు రూ.2,250 పింఛ‌ను వ‌స్తుంది. వ‌చ్చే నెల నుంచి 2 వేల 500 రూపాయ‌లు అంద‌నుంది.

లాక్‌డౌన్‌ రైటా.. రాంగా..!

Rajinikanth TV9 Big News Big Debate Latest Episode, లాక్‌డౌన్‌ రైటా.. రాంగా..!

– విఫలమేనంటున్న రాహుల్‌
– 23లక్షల కేసులు తగ్గించామంటున్న ప్రభుత్వం
– ఏది నిజం.. మరేంటి ఫ్యూచర్‌
– ఎగ్జిట్‌ ప్లాన్‌ ఏముంది?

లాక్‌డౌన్‌ విఫలమైందా? 21 రోజులు ఎవరికి వారు ఇంట్లో ఉంటే కంట్రోల్‌ అవుతుందన్నారు. 70 రోజులైనా తగ్గలేదు. పైగా లక్షా 50వేలకు చేరువ అవుతున్నాయి కేసులు. 4వేల మందికి పైగా మృత్యువాత పడ్డారు. ముంబయి నగరంలో పరిస్థితులు మరో న్యూయార్క్‌ను తలపిస్తున్నాయి. తమిళనాడు, గుజరాత్‌లోనూ వాతావరణం ఆందోళనకరంగా మారింది. దేశంలో కరోనా అదుపుతప్పుతుందా? కట్టడిలో ప్రభుత్వం విఫలమైందా? లాక్‌డౌన్‌ వల్ల ఇప్పటికంటే అతిపెద్ద ముప్పు నుంచి బయటపడ్డామా? ఏది నిజం?

Rajinikanth TV9 Big News Big Debate Latest Episode, లాక్‌డౌన్‌ రైటా.. రాంగా..! Rajinikanth TV9 Big News Big Debate Latest Episode, లాక్‌డౌన్‌ రైటా.. రాంగా..! Rajinikanth TV9 Big News Big Debate Latest Episode, లాక్‌డౌన్‌ రైటా.. రాంగా..! Rajinikanth TV9 Big News Big Debate Latest Episode, లాక్‌డౌన్‌ రైటా.. రాంగా..!

ఇండియాలో కరోనా వేగంగా వ్యాపిస్తోంది. జనవరి 30 ఫస్ట్‌ కేస్‌ రిపోర్ట్‌ అయింది. సరిగ్గా 3నెలల 3వారాల 5రోజుల తర్వాత అంటే 26 మే నాటికి లక్షా 45 వేల 380 మందికి సోకినట్టు మినిస్ట్రీ ఆఫ్‌ హెల్త్‌ అండ్‌ ఫ్యామిలీ వెల్ఫేర్‌ ప్రకటించింది. 4వేల 167 మంది చనిపోయారు. దేశంలో మరణాల రేటు గ్లోబల్‌తో పోల్చుకుంటే తక్కువే అయినా.. కేసుల విషయంలో మాత్రం ఆసియాలో నాలుగో స్థానం ఆక్రమించింది. వాల్డ్‌ వైడ్‌గా టాప్‌ టెన్‌ కంట్రీస్‌లో ఒకటిగా నిలిచింది. ఇది ఆందోళన కలిగించే అంశమే. ఖచ్చితంగా భవిష్యత్తు ప్రమాదఘంటికలు మోగుతున్నట్టే. నాలుగు దశల్లో అనుసరించిన లాక్‌డౌన్‌ వల్ల కూడా ప్రభుత్వం పెద్దగా ఫలితాలు రాబట్టలేకపోయిదన్న చర్చ జరగుతోంది. మార్చి 25న లాక్‌డౌన్‌ ప్రకటించినప్పుడు కేసులు 606 ఉన్నాయి. స్ట్రిక్ట్‌ ఆంక్షలున్నాయి. అయినా ఏ దశలోనూ కేసులు తగ్గలేదు. 6056 కేసుల నుంచి… ఇప్పుడు లక్షా 45వేల కేసులకు పెరిగింది. ఇది రానున్నర మూడు నెలల్లో ఏ స్థాయిలో ఉంటుందన్నది చూడాలి. దీనికి పరిష్కారం చూపాల్సిన అవసరం ఉంది. లేదంటే భారత్‌ వంటి దేశంలో తలెత్తే సంక్షోభం ఊహించలేనివిధంగా ఉంటుంది. ఇందుకు ముంబై పెద్ద ఉదాహరణ. ఇతర నగరాల్లో స్లమ్‌లకు కరోనా తాకితే ఆపడం ఎవరి సాధ్యం కాదు.

Rajinikanth TV9 Big News Big Debate Latest Episode, లాక్‌డౌన్‌ రైటా.. రాంగా..!
కరోనా కట్టడిలో మోదీ ప్రభుత్వం విఫలమైందన్నారు కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ. 21రోజులు ఇంట్లో ఉంటే తగ్గుతుందన్న ప్రభుత్వం.. 70 రోజులైనా కంట్రోల్‌ చేయలేక పోయిందని ఫైరయ్యారు. లాక్‌డౌన్‌ ఎగ్జిట్‌ ప్లాన్‌ కూడా సరిగ్గా లేదంటూ ఆరోపించారు. పేదలను ఆదుకోవడానికి ప్లాన్‌-B ఏం సిద్దం చేశారో చెప్పాలన్నారు రాహుల్‌. ప్రజలకు నేరుగా అకౌంట్లలో డబ్బులు వేసి ఉంటే.. ఆర్ధికంగానూ భారత్‌ తట్టుకుని నిలబడే పరిస్థితి ఉండేదని… ఇప్పుడు ఏమాత్రం ఛాన్స్‌ లేకుండా మోదీ నిర్ణయాలతో అస్తవ్యస్తంగా మారే ప్రమాదం ఉందంటున్నారు. రాష్ట్రాలకు స్వేచ్ఛ ఇవ్వకుండా… కేంద్రం తీసుకున్న ఏకపక్ష నిర్ణయాలతో భవిష్యత్తులో విపత్తు ముంచుకొస్తుందన్నారు. ముందునుంచి ఎగ్జిట్‌ ప్లాన్‌ గురించి హెచ్చరించినా పట్టించుకోకపోవడం వల్ల కేసులు సంఖ్య తీవ్రంగా ఉందన్నారు. కరోనా బాధితులు పెరుగుతుంటే… లాక్‌డౌన్‌ రిలాక్స్‌ ఇచ్చని ఏకైక దేశం మనదేనంటూ విమర్శలు గుప్పించారు. రాహుల్‌ వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది కేంద్ర. ప్రపంచమంతా భారత్‌ నమూనానే ఆదర్శంగా తీసుకుంటుంటే.. విమర్శల చేయడం అర్ధరహితమంటోంది BJP. అయితే రాజకీయంగా విమర్శలు ఎలా ఉన్నా… ఖచ్చితంగా ప్రజలు మాత్రం ఉపాధి పోయి ఇబ్బందుల్లో పడుతున్నారు. వారిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.
Rajinikanth TV9 Big News Big Debate Latest Episode, లాక్‌డౌన్‌ రైటా.. రాంగా..!
అటు రాజకీయ విమర్శలు ఎలా ఉన్నా… కొన్ని నివేదికలు ఆసక్తికరంగా ఉన్నాయి. లాక్‌డౌన్‌ లేకుంటే పరిస్థితి ఎలా ఉండేదన్న దానిపై బోస్టన్‌ కన్సల్టింగ్‌ గ్రూప్‌ ఈనెల 15వరకు ఒక అధ్యయనం చేసింది. లాక్‌డౌన్‌ లేకుంటే 36 లక్షల నుంచి 70లక్షల కేసులు పెరిగేవనీ… లక్షా 20వేల మంది నుంచి రెండు లక్షల 10వేల మంది చనిపోయి ఉండేవారనీ చెబుతోంది. పబ్లిక్‌ హెల్త్ ఫౌండేషన్‌ ఆఫ్‌ ఇండియా సర్వే ప్రకారం 78 వేల 83 మరణాలను నివారించ గలిగామంటోంది. ఇక మూడో అధ్యయనం మార్చి 25 నుంచి మే 15 వరకు చేపట్టారు. ఇందులో 23 లక్షల కేసులను నివారించగలిగామనీ, 68వేల మరణాలను అడ్డుకోగలిగామంటోంది. నీతీఆయోగ్‌ కూడా 14 నుంచి 29 లక్షల కేసులను నివారించగలిగినట్లు తేల్చింది. 53వేల 773 చావులను లాక్‌డౌన్‌ ఆపగలిగిందని అంటోంది నీతిఆయోగ్‌.

Rajinikanth TV9 Big News Big Debate Latest Episode, లాక్‌డౌన్‌ రైటా.. రాంగా..!
అలాగే లాక్‌డౌన్‌తో కరోనా వ్యాప్తి తగ్గిందనేది నిజం కావొచ్చు.. కానీ పెరుగుతున్న కేసులు భవిష్యత్తుపై భయాందోళనలు రేకెత్తిస్తున్నాయి. జూన్‌ నాటికి భారీగా పెరుగుతాయని అంచనా వేస్తోంది. 2లక్షల 80వేల నుంచి 3లక్షలకు పైగా కరోనా బాధితులు ఉంటాయని అంచనా. మరి దీనికి కేంద్రం ఎలాంటి పరిష్కారంతో వస్తుందో చూడాలి.

దీనిపై టీవీ9 మేనేజింగ్ ఎడిట‌ర్ ర‌జినీకాంత్ జ‌రిపిన విశ్లేష‌ణాత్మ‌క డిబేట్ దిగువ‌న చూడండి…

Related Tags