లిక్కర్‌కో లెక్క… ఇసుకకో లెక్కా..?: బిగ్ న్యూస్..బిగ్ డిబేట్

ఏపీలో ఇసుక.. రాజకీయ తుఫాన్‌గా మారింది. ఒకవైపు లాంగ్ మార్చ్‌లు, ఇసుక సత్యాగ్రహాలతో ప్రభుత్వం మీద విపక్షాలు దండెత్తాయి. డ్రెడ్జింగ్‌ ద్వారా ఇసుకను ఎందుకు తీయలేరని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తుంటే, లాంచీలు, ట్రాక్టర్లు కూడా వెళ్లే పరిస్థితి లేదని స్వయంగా సీఎం జగనే అంటున్నారు. గత ఐదేళ్లు ఇసుక మాఫియా నడిచిందని జగన్‌ విమర్శిస్తే, ఇప్పుడసలు పర్మిట్లే లేకుండా కొన్ని చోట్ల.. ఇంకొన్ని చోట్ల ఒక్క పర్మిట్‌ మీద 15 సార్లు ఇసుక తరలిస్తున్నారని చంద్రబాబు కౌంటర్‌ ఇస్తున్నారు. […]

లిక్కర్‌కో లెక్క... ఇసుకకో లెక్కా..?: బిగ్ న్యూస్..బిగ్ డిబేట్
Follow us

|

Updated on: Nov 05, 2019 | 12:43 AM

ఏపీలో ఇసుక.. రాజకీయ తుఫాన్‌గా మారింది. ఒకవైపు లాంగ్ మార్చ్‌లు, ఇసుక సత్యాగ్రహాలతో ప్రభుత్వం మీద విపక్షాలు దండెత్తాయి. డ్రెడ్జింగ్‌ ద్వారా ఇసుకను ఎందుకు తీయలేరని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తుంటే, లాంచీలు, ట్రాక్టర్లు కూడా వెళ్లే పరిస్థితి లేదని స్వయంగా సీఎం జగనే అంటున్నారు. గత ఐదేళ్లు ఇసుక మాఫియా నడిచిందని జగన్‌ విమర్శిస్తే, ఇప్పుడసలు పర్మిట్లే లేకుండా కొన్ని చోట్ల.. ఇంకొన్ని చోట్ల ఒక్క పర్మిట్‌ మీద 15 సార్లు ఇసుక తరలిస్తున్నారని చంద్రబాబు కౌంటర్‌ ఇస్తున్నారు. రాజకీయ విమర్శల నుంచి వ్యక్తిగత దూషణలుగా మారింది ఇసుక కొరత సృష్టించిన తుఫాను. ఇక ఇదే అంశాలపై  టీవీ9 బిగ్ న్యూస్ బిగ్ డిబేట్ వేదికగా టీవీ9 మేనేజింగ్ ఎడిటర్ రజనీకాంత్ ఆధ్వర్వంలో కీలక చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో ఏపీలో కొత్త లిక్కర్ పాలసీ వచ్చినప్పుడు లిక్కర్ షాపులు బ్యాన్ చెయ్యలేదు కదా?..కానీ కొత్త పాలసీ వస్తుందంటూ ఇసుకను ఎందుకు బ్యాన్ చేశారని రజనీకాంత్..అధికారపక్ష ఎమ్మెల్యే కొలుసు పార్థసారథిని సూటిగా ప్రశ్నించారు. దానికి ఎమ్మెల్యే ఇచ్చిన సమాధానం దిగువ వీడియోలో..