Breaking News
  • పెళ్లికి రెడీ అంటున్న రానా. తన తండ్రి, బాబాయి వెంకటేష్ తో ఫోటో షేర్ చేసిన రానా. ఈరోజు రమానాయుడు స్టూడియో లో రానా మిహికల వివాహం. పెద్దల అంగీకారంతో రానా మిహికల ప్రేమ వివాహం. కారోనా నిబంధనల నేపధ్యంలో కుటుంబ సభ్యుల మధ్య జరిగిన నిశ్చితార్థం. పెళ్లికి వధూవరుల కుటుంబ సభ్యులు 35 మంది మాత్రమే హాజరు కానున్నారు. VR కీట్స్ ద్వారా దగ్గరి బంధువులకు పెళ్ళి చూసేందుకు ఏర్పాటు. వధువు మిహిక ఇంట నిన్న జరిగిన మెహింది కార్యక్రమం. సంప్రదాయం ప్రకారం నిన్న రానాని పెళ్ళికొడుకుని చేసిన కుటుంబసభ్యులు. కోవిడ్ టెస్టులు చేపించుకున్న వధూవరుల కుటుంబ సభ్యులు.
  • కడపజిల్లాలో విషాదం. నాన్న చనిపోయాడని బాధతో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న అక్క చెల్లెళ్లు. కమలాపురం మండలం యార్రగుడిపాడు గ్రాంమం వద్ద ఘటన. డి. శ్వేత 26 వివాహిత, డి .సాయి 20 ప్రొద్దుటూరు ఇంజనీరింగ్ చదువుచున్నది. వీరి తండ్రి ప్రొద్దుటూరు వై ఎం ఆర్ కాలనీలోని బాబురెడ్డి, ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్.. నిన్నటిఆయన అనారోగ్యంతో మరణించారు. నాన్న మృతదేహం హాస్పిటల్లో లో ఉండగా ఆ బాధ తట్టుకోలేక తిప్పలూరు రాణి పేట మధ్యగల రైల్వే ట్రాక్ పైన ఉదయం 6 గంటలకు ముందు ట్రైన్ కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు.
  • ఢిల్లీ నుంచి బయలుదేరిన రెండు ప్రత్యేక విమానాలు. విమానాల్లో ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ సీఈవో, ఎయిరిండియా సిఎండి, DGCA దర్యాప్తు బృందం, ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో అధికారులు. ముంబై నుంచి మరో విమానంలో విచారణకు సహకరించే ఇతర అధికారుల బృందం.
  • అనంతపురం కన్సెప్ట్ సిటీ కన్సల్టెంట్ గా CBRE సౌత్ ఆసియా ప్రైవేట్ లిమిటెడ్ . భవిష్యత్ వ్యాపార అవసరాల కోసం రాష్ట్రం లో 3 కాన్సెప్ట్ సిటీలు ప్లాన్ చేసిన సర్కార్ . అనంతపురం కాన్సెప్ట్ సిటీకి కాన్సెప్టువల్ ప్లాన్, ఫీజబిలిటి రిపోర్ట్, బిజినెస్ స్ట్రాటజీ, ఫైనాన్సియల్ మోడల్ ప్రణాళిక సిద్దం చేసి అమలు చేయనున్న CBRE. ఇందుకోసం దాదాపు 85 లక్షల రూపాయలకు పరిపాలన అనుమతులు మంజూరు.
  • తమిళనాడు లో ఘోర రోడ్డు ప్రమాదం. కోయిఅంబత్తూర్ లోని ఆనకట్ట రహదారిలో చెట్టుని డీ కొట్టిన కారు . కారులో ప్రయాణిస్తున్న యువకులలో నలుగురు మృతి , ఒకరి పరిస్థితి విషమం . కారు అతివేగం గా నడపడం ప్రమాదానికి కారణం . ఫ్రెండ్స్ పుట్టినరోజు వేడుకలు వెళ్లివస్తుండగా జరిగిన ఘటన.
  • తెలంగాణ కరోనా కేసుల అప్డేట్స్: తెలంగాణ లో కరోనా టెస్టింగ్స్ : 5,90,306. ఈ ఒక్కరోజే టెస్టింగ్స్: 23,322. రాష్ట్రంలో ఈరోజు పాజిటివ్ కేసులు : 2256. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం కరోనా కేసులు : 77,513. జిహెచ్ఎంసి లో ఈరోజు కేసులు: 464. జిహెచ్ఎంసి లో మొత్తం కరోనా కేసులు సంఖ్య : 42 189. కరోనా తో ఈరోజు మరణాలు : 14. ఇప్పటి వరకూ మరణాలు మొత్తం : 615. చికిత్స పొందుతున్న కేసులు : 22,568. ఈరోజు ఆసుపత్రి నుంచి డిశ్చార్చి అయిన వారు: 1091. ఇప్పటి వరకూ డిశ్చార్జి అయిన సంఖ్య: 54,330.
  • అర్ధరాత్రి సమయంలో మరోసారి కడప సెంట్రల్ జైలుకు చేరుకున్న జేసీ ప్రభాకర్ రెడ్డి.. సీఐ దేవేందర్ ను దురుసుగా మాట్లాడిన వ్యవహారంలో 14 రోజుల పాటు రిమాండ్ విధించిన గుత్తి కోర్టు.. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు తోపాటు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు.. పోలీస్ బందోబస్తు మధ్య కడప సెంట్రల్ జైలుకు వచ్చిన జేసీ ప్రభాకర్ రెడ్ది..
  • కేరళలో జరిగిన ప్లేన్ యాక్సిడెంట్ గురించి విని షాక్ కి గురయ్యాను. మృతుల కుటుంబీకులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నాను. గాయపడ్డవారు త్వరగా కోరుకోవాలని ప్రార్థిస్తున్నాను. - అల్లు అర్జున్ ట్వీట్.

అనుకున్నదే అయింది… 9కోట్ల మంది ప్రమాదంలో ఉన్నారా?

ఇండియాలో పరిస్థితి చేజారిపోతోందా? కరోనాను నియంత్రించడం అసాధ్యమా? మహారాష్ట్ర, ఢిల్లీ, తమిళనాడులో అదుపు తప్పింది. తెలుగురాష్ట్రాల్లో వందల సంఖ్యలో కేసులొస్తున్నాయి. మొత్తానికి ఇండియా ప్రపంచంలో ఆరో ప్లేస్‌లో ఉంది.
Big News Big Debate On 09062020, అనుకున్నదే అయింది… 9కోట్ల మంది ప్రమాదంలో ఉన్నారా?

కరోనా కట్టడి అసాధ్యమా?
సహజీవనానికి సిద్దమవ్వాల్సిందేనా?
టెస్టులు చేయకుండా కేసులు తక్కువ చూపిస్తే ప్రయోజనమేంటి?

ఇండియాలో పరిస్థితి చేజారిపోతోందా? కరోనాను నియంత్రించడం అసాధ్యమా? మహారాష్ట్ర, ఢిల్లీ, తమిళనాడులో అదుపు తప్పింది. తెలుగురాష్ట్రాల్లో వందల సంఖ్యలో కేసులొస్తున్నాయి. మొత్తానికి ఇండియా ప్రపంచంలో ఆరో ప్లేస్‌లో ఉంది. చూస్తుంటే టాప్‌5 చేరుకోవడానికి ఇంకెన్నో గంటలు పట్టదు. మొదట్లో దీనికి లాక్‌డౌనే మందు అని అన్నీ దేశాలు భావించాయి. కానీ నెలల పాటు లాక్‌డౌన్‌ను పొడిగించుకుంటూ పోయినా… వైరస్‌ ఏమాత్రం కంట్రోల్‌లోకి రాలేదు.

Big News Big Debate On 09062020, అనుకున్నదే అయింది… 9కోట్ల మంది ప్రమాదంలో ఉన్నారా?
ఎక్కడో చైనా, ఇటలీలో విస్తరిస్తుంటే భయంతో అప్రమత్తమయ్యాం. తీరా ఇండియాలో కరాళనృత్యం చేస్తుంటే చేతులెత్తేశామా? ప్రస్తుతం ఢిల్లీలో 30వేల కేసులున్నాయి.. ఈ నెలాఖరుకు లక్ష… జులై చివర్లో 5లక్షలకు చేరుతుందని ప్రభుత్వమే ప్రకటిస్తోంది. ఇక 88వేల పాజిటివ్‌ రిపోర్ట్‌ అయిన మహారాష్ట్రలో బీమారీ వ్యాప్తిని ఆపతరమా?. 76 రోజులు లాక్‌డౌన్‌ అమలుచేసినా సాధించిన ఫలితం ఏంటన్నది ఇప్పుడు చర్చగా మారింది. కరోనా తీవ్రతను పోస్ట్‌పోన్‌ చేశాం కానీ.. కట్టడి చేయలేకపోయమన్నదే నిజమవుతోంది. నెలరోజుల క్రితం కరోనాను భారత్‌ ధీటుగా ఎదుర్కొందని ప్రకటించిన ప్రపంచ ఆరోగ్య సంస్థే ఇప్పుడు కట్టడి చేయడం అసాధ్యమంటోంది. దక్షణాసియాలో ముఖ్యంలో ఇండియాలో భయానకంగా ఉంటుందని హెచ్చరిస్తోంది.
Big News Big Debate On 09062020, అనుకున్నదే అయింది… 9కోట్ల మంది ప్రమాదంలో ఉన్నారా?
660 కేసులుండగా ఫస్ట్‌ లాక్‌డౌన్‌ అమల్లోకి రాగా… రెండున్నర లక్షల కేసులున్నప్పుడు పూర్తిగా సడలింపులు ఇచ్చేసింది కేంద్రం. ప్రస్తుతం దేశంలో 2లక్షల 60వేల కేసులు నమోదుకాగా.. 7వేల 5వందల మంది బలయ్యారు. వాస్తవానికి ఈసంఖ్య ఇంకా ఎక్కువ ఉంటుందన్నది నిపుణులు వాదన. దేశంలో అత్యధికంగా కేసులు నమోదవుతున్న మహారాష్ట్రలో ప్రతీ పది లక్షల జనాభాకు… 4308 టెస్టులు మాత్రమే చేస్తున్నారు. అంటే టెస్టులు సంఖ్య పెంచితే అమెరికా పక్కన నిలబడినా ఆశ్చర్యపోనవసరం లేదంటున్నారు కొందరు.
Big News Big Debate On 09062020, అనుకున్నదే అయింది… 9కోట్ల మంది ప్రమాదంలో ఉన్నారా?
కేంద్రం మాత్రం ఇప్పటికీ కంట్రోల్‌లోనే ఉందంటోంది. అమెరికాలో మిలియన్‌లో 5వేల మందికి కరోనా ఉంటే… మనదగ్గర కేవలం 150 మాత్రమేనంటోంది నీతీఆయోగ్‌. మరణాలు రేటు 2.8శాతంగా చెబుతోంది. ఇదొక్కటే కాస్త ఊరటకలిగిస్తున్న అంశం.
Big News Big Debate On 09062020, అనుకున్నదే అయింది… 9కోట్ల మంది ప్రమాదంలో ఉన్నారా?
అటు తెలుగురాష్ట్రాల్లోనూ పరిస్థితి చేజారిపోతోంది. ఏపీలో 5వేలకు చేరువ అవుతోంది. మరణాల సంఖ్య కూడా వందకు దగ్గరగా ఉంది. ఇటు తెలంగాణలో కొత్తగా 4వేలకు చేరువలోనే ఉన్నాయి. మొత్తం మరణాలు 150 దగ్గరగా ఉంది. రోగులకు చికిత్స అందిస్తున్న వైద్యులకే కరోనా పాజిటివ్‌ రావడం ఆందోళన కలిగిస్తోంది. అటు తెలంగాణలో జరుగుతున్న టెస్టులు, ట్రీట్‌మెంట్‌పై కోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. గాంధీకి వెళితే తిరిగివస్తారన్న నమ్మకం పోతుందని కోర్టు… మృతదేహాలకు కూడా పరీక్షలు చేయాల్సిందేనని ఆదేశించింది. అంటే పరిస్థితి ఎంత ఆందోళనకరంగా ఉందో అర్ధమవుతోంది. కరోనా ఎక్కడో ఉందంటే భయపడిన దేశం… ఇప్పుడు మన పక్కకే వచ్చింది. నాయకులు చెప్పినట్టు మనం సహజీవనం స్థాయికి రావడానికి ఎంతోకాలం పట్టేట్టు లేదంటున్నాయి నివేదికలు. బిగ్‌ న్యూస్ బిగ్‌ డిబేట్‌లో ఏపీ అడిషనల్‌ చీప్‌ సెక్రటరీ స్పష్టత ఇచ్చారు… ప్రభుత్వాలు చేసేదేమీ లేదన్నారు. 25శాతం మాత్రమే బాధ్యత వహిస్తాయి. మిగిలినందంతా ఎవరికి వారు స్వీయ రక్షణ పాటించాల్సిందే అంటున్నారు.
Big News Big Debate On 09062020, అనుకున్నదే అయింది… 9కోట్ల మంది ప్రమాదంలో ఉన్నారా?
దీనికి ప్రస్తుతానికి మందు నిబ్బరమే అంటున్నారు. భయం లేకుండా జాగ్రత్తగా ఉంటే ఎలాంటి ప్రమాదం ఉండదని సూచిస్తున్నారు డాక్టర్‌ విష్ణున్‌రావు. బిగ్‌ న్యూస్‌ బిగ్‌ డిబేట్‌ లో పాల్గొన్న ఆయన… ఇతర వ్యాధులు ఉన్నవాళ్లే ఎక్కువ చనిపోతున్నారన్నారు. కరోనా ఎటాక్‌ అయితే… బాడాలో ఇమ్యూన్‌ పవర్‌ లేనివాళ్లకు.. ముఖ్యంగా వృద్దులకు ఇది ప్రమాదమంటున్నారు. దేశంలో 9 కోట్ల మంది మాత్రమే మరింత జాగ్రత్తగా ఉంటే సరిపోతుందన్నది ఆయన లెక్క. ఏది ఏమైనా ప్రభ/త్వాలు ఈ పరిస్థితుల్లో చేయగలిగింది ఏమీ లేదు… ప్రజలకు తమకు తాము స్వీయ క్వారంటైన్‌ పద్దులు అవలంభించడమే శ్రీరామరక్ష.

Related Tags