భారత్ ముంగిట పెనుముప్పు ఉందా?

ఇండియాలో ఏరోజుకారోజు డే హయ్యస్ట్‌ కరోనా కేసులు రిపోర్ట్‌ అవుతున్నాయి. 24గంటల్లోనే 21వేలకు పైగా పాజిటివ్‌ వచ్చాయి. తెలుగురాష్ట్రాల్లోనూ కరోనా తీవ్రత రోజురోజుకు అధికమవుతోంది. లాక్‌డౌన్‌లో కంట్రోల్‌ అయిన కరోనా..

భారత్ ముంగిట పెనుముప్పు ఉందా?
Follow us

| Edited By:

Updated on: Jul 10, 2020 | 9:03 PM

– కరోనాపై కలవరపెడుతున్న నివేదికలు -ఆందోళన రేకెత్తిస్తున్న ఆరోగ్య సమస్యలు – మోదీ మాటల అంతరార్థం ఏంటి?

ఇండియాలో ఏరోజుకారోజు డే హయ్యస్ట్‌ కరోనా కేసులు రిపోర్ట్‌ అవుతున్నాయి. 24గంటల్లోనే 21వేలకు పైగా పాజిటివ్‌ వచ్చాయి. తెలుగురాష్ట్రాల్లోనూ కరోనా తీవ్రత రోజురోజుకు అధికమవుతోంది. లాక్‌డౌన్‌లో కంట్రోల్‌ అయిన కరోనా.. అన్‌లాక్‌లో వైరల్‌గా మారి విజృంభిస్తోంది. ఇది ఇప్పట్లో తగ్గేది కాదని… సుదీర్ఘ పోరాటం చేయాలంటూ ప్రధాని ఇప్పటికే సంకేతాలు ఇచ్చారు. ఓవైపు పెరుగుతున్న బాధితులు.. మరోవైపు వెలుగుచూస్తున్న కొత్తకొత్త విషయాలు ప్రజలకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. కొత్త కొత్త లక్షణాలు బయటపడుతున్నాయి. దీని వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలు కూడా పెరుగుతున్నాయి. బ్రీతింగ్‌ ప్రాబ్లమ్‌, హార్ట్‌ ఇష్యూస్‌ వస్తున్నాయని చెప్పారు. కొత్తగా న్యూరో డిజార్డర్స్‌ కూడా వస్తున్నాయని లండన్‌ యూనిర్శిటీ చెబుతోంది. ఇక ఫిబ్రవరిలో ఇండియాలో రోజుకు 2 నుంచి 3 లక్షల కొత్త కేసులు వస్తాయన్న నివేదికలు కలవరపెడుతున్నాయి. మరి వ్యాక్సిన్‌ హ్యూమన్‌ ట్రయల్స్‌ విజయవంతంగా పూర్తిచేసుకుని కరోనాను కట్టడి చేస్తుందా? అలా కాకుంటే కరోనా సృష్టించే భయోత్పాతం తట్టుకోవడం సాధ్యమవుతుందా?

ICMR లెక్కల ప్రకారం కరోనా కేసులు 793,802, మరణాలు 21, 604 నమోదయ్యాయి. 24గంటల్లోనే 26,506 , మరణాలు 475 ఉన్నాయి. జులై1 నుంచి 10 రోజుల్లోనే 2లక్షల కేసులు కొత్తగా వచ్చాయి. జులై3 నుంచి రోజుకు 20వేల కేసులకు పైగా రిపోర్ట్‌ అవుతున్నాయి. గ్లోబల్‌గా ప్రతి10లక్షల్లో 1497 మందికి కరోనా వస్తే.. ఇండియాలో ఇది 538 మంది కావడం కాస్త ఊరటనిచ్చే అంశం. అయిటే టెస్టులు పెరుగుతున్న కొద్దీ కేసులు కూడా పెరుగుతున్నాయి. ఏప్రిల్‌లో 3.8% పాజిటివ్‌ రేటు ఇప్పుడు 6.4%గా ఉంది. ప్రతి 10లక్షలకు 6500 టెస్టులు చేస్తన్నారు. అయితే ఈ సంఖ్య పెంచాల్సిన అవసరం ఉంది.

దేశవ్యాప్తంగా 48జిల్లాల్లోనే 80శాతం, పది రాష్ట్రాల్లో 90% కేసులు రిపోర్ట్‌ అయ్యాయి. అయితే కొన్ని రాష్ట్రాల్లో రకవరీ ఎక్కువగా ఉంది. యావరేజ్‌గా ఇండియా రికవరీ రేటు 62.42%గా ఉంది. ఇక డెత్‌ రేటులోనూ ఇండియా బెటర్‌గానే ఉంది. ఇండియాలోనే 2.75%కాగా.. గ్లోబల్గా ఇది చాలా ఎక్కువగా ఉంది. గ్లోబల్‌గా 10లక్షల్లో 68.7 మంది మరణిస్తుంటే.. ఇండియాలో 15.31 మాత్రమే అని ICMR అంటోంది. మరణాల్లో 85% మంది 45ఏళ్ల పైబడినవారే. 45-74ఏళ్ల మధ్య వాళ్లు 71% కాగా, 44 ఏళ్ల లోపు మరణాలు 15% మాత్రమే. ఇది కాస్త ఊపిరిపీల్చుకునేలా ఉంది.

వాస్తవానికి ICMR గణాంకాలు కాస్త ఊరటనిస్తున్నా… వెలుగుచూస్తున్న అధ్యయనాలు మాత్రం ఆందోళన కలిగిస్తున్నాయి. వ్యాక్సిన్‌పై ఇండియా భవితవ్యం ఆధారపడి ఉందని.. కరోనా వరస్ట్‌ ఎఫెక్ట్‌ కంట్రీగా ఇండియా మారబోతుందని అమెరికాకు చెందిన ప్రముఖ సంస్థ MIT లేటెస్ట్‌ రిపోర్టులో వెల్లడించింది. 84దేశాల్లో అధ్యయనం చేసిన MIT … ఇండియాలో పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేసింది. ఫిబ్రవరి 2021లో రోజుకు 2లక్షల 87వేల కేసులు వచ్చే ప్రమాదం ఉందంటున్నాయి. అమెరికాలో రోజుకు 95వేలు ఉంటుందని అంచనా వేసింది. ప్రస్తుతం ఇక్కడ 65వేల కేసులు రిపోర్ట్‌ అవుతున్నాయి. సాతాఫ్రికాలో 21వేలు, ఇరాన్‌ 17వేల కేసులు వస్తాయని MIT అంచనా. గ్లోబల్‌గా 2021 మార్చి-మే మధ్య 60కోట్లమందికి కరోనా వస్తుందని చెబుతోంది. ఇది 130 కోట్లకు పెరగొచ్చని కూడా అంచనా వేసింది. ఇందులో ఇండియానే భారీగా ఎఫెక్ట్‌ అవుతుందని అంచనా..

అటు వ్యాక్సిన్‌పై ప్రభుత్వం ధీమాగా ఉంది. ఆగస్టులో ఇస్తామని చెబుతోంది. సాధ్యాసాధ్యాలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి అనేక సందేహాలున్నాయి. దీనిపై టీవీ9లో జరిగిన చర్చలో ఛానల్‌ మేనేజింగ్‌ ఎడిటర్‌ రజనీకాంత్‌ కొన్ని ప్రశ్నలు ప్రజలముందంచడం జరిగింది… 1. 6నెలలు అయినా వైరస్‌ స్వరూపంపైనే స్పష్టత రాలేదు. అంతుచిక్కని అంశాలెన్నో ఉన్నాయి.. దీనికి వ్యాక్సిన్‌ కనిపెట్టడం సాధ్యమవుతుందా? 2. తెలంగాణలో మొదట్లో A3i అన్నారు.. ఇప్పుడు A2A అంటున్నారు మొత్తం 6 రకాలుగా ఉందంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా 2వందల మ్యుటేషన్స్‌ గుర్తించారు. మరి ఇప్పుడు హ్యూమన్‌ ట్రయల్స్‌లో ఉన్న వ్యాక్సిన్‌ దేనికి పనిచేస్తుంది? 3. జీవశాస్త్రంలో అత్యుత్తమ సంస్థ అయిన CCMB వ్యాక్సిన్‌పై అనుమానాలు వ్యక్తం చేయడం నిజంకాదా? 4. కరోనాపై పోరాటం ఇప్పుడు ముగిసేది కాదని ప్రధాని మోదీ అంటున్నారు.. అంటే భవిష్యత్తులో పెను విపత్తు పొంచి ఉందా? 5. రకరకాల లక్షణాలు కనిపిస్తున్న వైరస్‌కు ఇప్పుడు మార్కెట్లో ఉన్న మందులు పనిచేస్తాయా? ఇలా అనేక సందేహాలున్నాయి… అయితే వ్యాక్సిన్‌ వస్తే కానీ వీటికి సమాధానం దొరకదు.

ఇప్పటిదాకా ఏయే రూపాల్లో కరోనా వ్యాపిస్తుందో లేటెస్ట్‌ జర్నల్‌ ప్రచురించింది WHO. గతంలో చెప్పినట్టు 1. కాంటాక్ట్‌, 2. తుంపర్లు, 3. ఫోమైట్, 4. ముఖం దగ్గరగా ఉంచడం, 5. రక్తం ద్వారా, 6. తల్లి నుంచి పిల్లలకు, 7.జంతువుల నుంచి మనుషులకు వస్తుందని గతంలో చెప్పింది. ఇప్పుడు కొత్తగా సైంటిస్టులు ఇచ్చిన అధ్యయనం రిపోర్టులు ఆధారంగా గాలిద్వారా కూడా వ్యాపిస్తుందని చెప్పి ఆందోళన మరింత పెంచింది. అటు ఈ వైరస్‌ వల్ల కూడా కొత్త కొత్త ఆరోగ్య సమస్యలు బయటపడుతున్నాయి. ఇప్పటివరకూ శ్వాస సంబంధ, హార్ట్‌ సమస్యలు వచ్చినట్టు తెలుసు. కొత్తగా న్యూరో సమస్యలు వస్తాయంటున్నారు సైంటిస్టులు. యూనివర్శిటీ ఆఫ్‌ లండన్‌ అధ్యయనం ప్రకారం వాసన, రుచి పోవడానికి కారణం న్యూరో డిజార్డర్‌ కారణమంటున్నారు. కోవిడ్‌ 19 రోగుల్లో బ్రెయిన్‌ డ్యామేజ్‌, బ్రెయిన్‌ క్లాట్స్‌, స్ట్రోక్‌ సమస్యలు వచ్చినట్టు గుర్తించామంటున్నారు లండన్‌ యూనిర్శిటీ నిపుణులు. మొత్తానికి గడుస్తున్న కొద్దీ కరోనా కొత్త కొత్త ప్రమాదాలను మోసుకొస్తుంది.. దీనికి విరుగుడు విషయంలో మాత్రం ఆశాజనకంగా పరిస్థితులు కనిపించడం లేదు.

ఇదే అంశంపై టీవీ9 బిగ్‌ న్యూస్‌ బిగ్‌ డిబేట్‌ లో చర్చ జరిగింది.. వీడియో కోసం లింక్‌ క్లిక్‌ చేయండి.

మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‎పై ప్రధాని మోదీ చురకలు..
మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‎పై ప్రధాని మోదీ చురకలు..
కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  
కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  
Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..
Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
డార్లింగ్ అభిమానులకు ‘రాజాసాబ్’ పై గుడ్ న్యూస్ చెప్పిన తేజ సజ్జా.
డార్లింగ్ అభిమానులకు ‘రాజాసాబ్’ పై గుడ్ న్యూస్ చెప్పిన తేజ సజ్జా.
కడుపులో బిడ్డతో షూటింగ్‌లో స్టార్ హీరోయిన్.! వీడియో వైరల్.
కడుపులో బిడ్డతో షూటింగ్‌లో స్టార్ హీరోయిన్.! వీడియో వైరల్.
నభా నటేష్‌తో ట్విట్టర్ లొల్లి.. కానీ దొరికిపోయిన ప్రియదర్శి.!
నభా నటేష్‌తో ట్విట్టర్ లొల్లి.. కానీ దొరికిపోయిన ప్రియదర్శి.!