బలగం తెచ్చిన బలంతో బరువైన నిర్ణయాలు

దశాబ్దాలుగా బీజేపీ ఆశయాలు మూడున్నాయి. ప్రతిసారి వారి మానిఫెస్టోలో కనిపిస్తుంటాయి. కానీ వచ్చే ఎన్నికల్లో ప్రకటించే సంకల్ప పత్రంలో అవి ఉండవన్నది కామలనాథుల లెక్క. ఇప్పటికే ఆర్టికల్..

బలగం తెచ్చిన బలంతో బరువైన నిర్ణయాలు
Follow us

| Edited By:

Updated on: Aug 07, 2020 | 10:01 PM

దశాబ్దాల హామీలకు మోక్షం సరికొత్త చట్టాలతో కొత్త మార్గం మోదీ పాలనలో అన్నీ సంచలనాలేనా?

దశాబ్దాలుగా బీజేపీ ఆశయాలు మూడున్నాయి. ప్రతిసారి వారి మానిఫెస్టోలో కనిపిస్తుంటాయి. కానీ వచ్చే ఎన్నికల్లో ప్రకటించే సంకల్ప పత్రంలో అవి ఉండవన్నది కామలనాథుల లెక్క. ఇప్పటికే ఆర్టికల్‌ 370 రద్దు చేశారు. రామాలయ నిర్మాణం కల సాకారం అవుతోంది. ఇక మిగిలింది కామన్ సివిల్‌ కోడ్‌. CAA, ట్రిపుల్‌ తలాక్‌ ద్వారా దాదాపు సగం రీచ్‌ అయ్యారు. ఇక టెక్నికల్‌గా కామన్ సివిల్‌ కోడ్‌ చట్టరూపం దాల్చడం ఒక్కటే మిగిలి ఉంది. దీనికి కూడా బీజేపీ డేట్‌ ఫిక్స్‌ చేసిందా?

దశాబ్ధాలుగా హామీలకే… 1996లో 13రోజులకే వాజ్‌పేయ్‌ నేతృత్వంలోని ప్రభుత్వం కుప్పకూలింది. అవిశ్వాసం సందర్భంగా ప్రసంగించిన నాటి ప్రధాని వాజ్‌ పేయ్‌ తమ ఎజెండా రామాలయం, ఆర్టికల్‌ 370 రద్దు, కామన్‌ సివిల్‌ కోడ్‌. ప్రభుత్వం పడిపోవడానికి కారణమని చెప్పారు.. కానీ సంకీర్ణంలో మాత్రం అవే మాకు ఆశయాలు కాదు. ఏదో రోజు ప్రజలు నమ్మి సంపూర్ణ మద్దతు ఇచ్చిన రోజున సాకారం చేస్తామన్నారు. నాడు వాజ్‌ పేయ్‌ అన్నట్టుగానే 25 ఏళ్ల తర్వాత నరేంద్రమోదీ సారధ్యంలో ఆ కల సాకారమవుతోంది. 2019 ఆగస్టు 5న ఆర్టికల్‌ 370 రద్దు చేశారు. సరిగ్గా సంవత్సరం తర్వాత ఆగస్టు 5నే అయోధ్యలో రామాలయానికి భూమిపూజ జరిగింది. ఇక మిగిలింది కామన్ సివిల్‌ కోడ్‌. 2017లో ఒకసారి ప్రజల నుంచి అబిప్రాయాలు సేకరించింది. త్వరలోనే దీనిపై పూర్తిస్థాయిలో దృష్టిపెట్టి.. వచ్చే ఏడాది నాటికి చట్టం చేయాలని చూస్తోందన్నది బీజేపీ వర్గాల అభిప్రాయం. ఇది కూడా అమల్లోకి వస్తే పరివారానికి తీరని కోరికలుగా ఉన్న ఆ మూడు ఆశయాలు నెరవేరినట్టే.

ఇక కీలక రిఫార్స్‌ ఈ మూడు అంశాలే కాదు.. చాలాకాలంగా ఆచరణకు నోచుకోని ఎన్నో వివాదాస్పద బిల్లులకు మోదీ ప్రభుత్వం చట్టరూపం ఇచ్చింది. ఇందులో ట్రిపుల్‌ తలాక్‌ ఒకటి. రెండోసారి అధికారంలోకి వచ్చిన వెంటనే దీనిపై బిల్లు చేసింది కేంద్రం. ఆ తర్వాత రాష్ట్రాలు వ్యతిరేకించినా CAA తీసుకోచ్చింది. త్వరలో దేశమంతా NRC తీసుకొచ్చేందుకు రెడీ అవుతోంది. జమిలీ ఎన్నికలు… సివిల్‌ సర్వీసెస్ లో సమూల మార్పులు వంటివి కూడా త్వరలో బిల్లు రూపం దాల్చనున్నాయి. ఇప్పటికే జమిలీ ఎన్నికలపై సంప్రదింపులు జరుపుతోంది. ఈసీ స్థాయిలో నివేదిక సిద్దమైంది. దీనిపై త్వరలోనే కేంద్రం నిర్ణయం తీసుకునే ఛాన్సుంది.

2014లోనే పూర్తి మెజార్టీతో అధికారంలోకి వచ్చినా.. మిత్రపక్షాల సూచనలతో కీలక బిల్లులపై ఆచితూచి అడుగులువేసింది. ప్రణాళికా సంఘార్చి మార్చి… నీతీ ఆయోగ్‌ పెట్టడం, GST, పెద్ద నోట్ల రద్దు వంటి పారిపాలనా పరమైన అంశాలకే పరిమితం అయ్యారు. రెండోసారి 2019లో 3వందలకుపైగా సీట్లతో ప్రజలు పట్టం కట్టడంతో ఇక పరివారం ఎజెండాకు దుమ్ము దులిపారు.

సాకారం అయిన హామీలు 1. ట్రిపుల్‌ తలాక్‌ 2019 మానిఫెస్టోలో పెట్టిన బీజేపీ 2019 జులైలో ట్రిపుల్‌ తలాక్‌ బిల్లు 2017లోనే ట్రిపుల్‌ తలాక్‌ రాజ్యాంగ విరుద్దమన్న సుప్రీం

2. ఆర్టికల్‌ 370: 2019 ఆగస్టు6 ఆర్టికల్‌ 370 రద్దు జనసంఘ్‌ ఆవిర్భావం నుంచే డిమాండ్‌ 1998 నుంచి 2019 వరకు మానిఫెస్టోలో అంశం

3. అయోధ్య రామాలయం: 2020 ఆగస్టు 5న శంకుస్థాపన 9 నవంబర్‌ 2019న సుప్రీం తీర్పు దశాబ్ధాల హామీ నిలబెట్టుకున్న బీజేపీ

4. సిటిజన్‌ షిప్‌ అమాండ్‌మెంట్‌ యాక్ట్‌: సిటిజన్‌ అమాండ్‌మెంట్‌ యాక్‌ చేసిన కేంద్రం రాష్ట్రాలు వ్యతిరేకించిన పంతంపట్టిన కేంద్రం అమల్లోకి వచ్చిన CAA

ఇంకా నెరవేర్చాల్సిన హామీలు 1. కామన్ సివిల్‌ కోడ్‌: దశంలో ఇప్పటికీ సమానత్వం లేదంటున్న బీజేపీ ఆర్టికల్‌ 44 ప్రకారం తీసుకొస్తామన్న BJP విభిన్న సంస్కృతులు, ఆచారాలు కనుమరుగంటూ వ్యతిరేకత

2. దేశవ్యాప్తంగా NRC ఇల్లీగల్‌ మైగ్రేషన్‌తో సంస్కృతి పోతుంది NRC ద్వారా కాపాడుకోవాలన్నది బీజేపీ వాదన అసోంలో అమలు.. వివాదాస్పదంగా మారిన NRC దేశవ్యాప్తంగా అమలుకు నిర్ణయం

3. జమిలీ ఎన్నికలు బీజేపీ విధానంలో ఒకటి జమిలీ ఎన్నికలు కేంద్ర, రాష్ట్రాలకు ఒకేసారి ఎన్నికలు జరగాలి పదేపదే ఎన్నికలో ఖర్చు .. అభివృద్ధి కార్యకలాపాలకు అటంకం దీనిపై చర్చ మొదలుపెట్టిన ప్రభుత్వం ఇప్పటికే పార్టీల నుంచి అభిప్రాయాల సేకరణ పూర్తి 2024లో జమిలీ ఎన్నికలు జరిగే అవకాశం

4. సివిల్‌ సర్వీసెస్‌ అండ్‌ గవర్నెన్స్ రిఫామ్స్‌ దేశంలో చాలా శాఖల విలీనం తక్కువ ప్రభుత్వం.. ఎక్కువ పాలన లక్ష్యం అధికారులపై ఒత్తిడి తగ్గించి ఈ గవర్నెన్స్‌కు ప్రాధాన్యం

లాభాలు… కుల, మత, ప్రాంతాలకు అతీతంగా అందరికీ ఈక్వల్‌ స్టేటస్ స్త్రీ, పురుష సమానత్వం జాతీయస్థాయిలో యువకులకు సమాన అవకాశాలు కల్పించడం దేశ పౌరులంతా న్యాయం ముందు సమానమే. క్రిమినల్‌ మాత్రమే కాదు.. సివిల్‌ లాస్‌ విషయంలో అమలు జాతీయ సమగ్రత పెంచే విధంగా కామన్ సివిల్‌ కోడ్ మత, ప్రాంత, జాతిపరంగా సివిల్‌ లాస్‌ అమలు చేయకూడదు

అడ్డంకులు భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశం.. రకరకాల జాతలు,మతాలు, భిన్న ఆచారాలు ఉన్నా దేశం కొన్ని మైనార్టీ సంస్థలు వ్యతిరేకిస్తున్నాయి.. తమ ఆచారాలకు పూర్తి భిన్నమన్న వాదన విపనిపిస్తున్నాయి మత స్వేచ్ఛ రాజ్యాంగం ఇచ్చింది. ఎవరి ఆచారాలు వారికుంటాయి.. దీనికి విరుద్దమని ఆయా సంస్థలు సూచిస్తున్నాయి కామన్ సివిల్‌ కోడ్‌ తీసుకరావడం అంతసులభం కాదన్నది ప్రధానంగా జరుగుతున్న చర్చ

అయోధ్య విషయంలో ఎప్పుడు ఏం జరిగింది.. 1528: బాబ్రీ మసీద్‌ నిర్మించిన మొఘల్‌ రాజు బాబర్‌ 1885: ఫైజాబాద్‌ కోర్టులో రామాలయ నిర్మాణానికి అనుమతి కోరుతూ రఘుబీర్‌ దాస్‌ మహంత్‌ పిటిషన్‌, తిరస్కరించిన కోర్టు డిసెంబర్ 22-23, 1949: మసీదులో వెలుగుచూసిన రాముడి విగ్రహం 1950: రాముడి విగ్రహాలకు పూజలకు అనుమతి ఇవ్వాలని గోపాల్‌ విశ్రాద్‌, రామచంద్రదాస్‌ ఫైజాబాద్‌ కోర్టులో పిటిషన్‌ 1959: వివాదాస్పద భూమి తమకు అప్పగించాలని నిర్మోహి అఖోరా పిటిషన్‌ 1961: మసీదులో విగ్రహాలు తొలిగించి తమకే చెందేలా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును ఆశ్రయించిన సెంట్రల్‌ సున్నీ వక్ఫ్‌బోర్డ్‌ 1986 ఫిబ్రవరి : హిందువులను అనుమతించిన ఫైజాబాద్‌ కోర్టు 1989 ఆగస్టు : అలహాబాద్‌ కోర్టుకు చేరిన కేసు.. యథాతథస్థితికి ఆదేశం 1989 నవంబర్‌: విశ్వహిందూపరిషత్‌ పూజలు చేయడానికి అనుమతించిన రాజీవ్‌ గాంధీ ప్రభుత్వం 1990 సెప్టెంబర్: బీజేపీ నాయకులు ఎల్‌.కె. అద్వానీ రథయాత్ర 1992 డిసెంబర్‌6: కరసేవకులు బాబ్రీ మసీదు కూల్చివేత. విచారణకు జస్టిస్‌ లిబర్హన్‌ కమిషన్‌ 1993: వివాదాస్పద స్థలానికి ఆనుకుని ఉన్న 67ఎకరాలు సేకరించిన పీవీ ప్రభుత్వం. 2002 ఏప్రిల్‌: అలహాబాద్‌ హైకోర్టులో టైటిల్‌ సూట్‌ విచారణ 2003 మార్చి: సేకరించిన 67 ఎకరాల స్ధలంలో మతపరమైన కార్యకలాపాలకు నిలిపివేస్తే ఆదేశించిన సుప్రీంకోర్టు 2009: జస్టిస్ లిబర్హన్‌ కమిటీ నివేదిక సమర్పించింది 30, 2010 సెప్టెంబర్‌: వివాదాస్పద స్థలాన్ని మూడు విభాగాలు చేసిన హైకోర్టు. అఖోరా, మసీదు, హిందువులకు సమంగా భూమి 2011మే : హైకోర్టు తీర్పుపై స్టే ఇచ్చిన సుప్రీంకోర్టు 2017 ఆగస్టు: జస్టిస్‌ దీపక్‌ మిశ్రా నేతృత్వంలో త్రిసభ్య ధర్మాసనం విచారణ ప్రారంభం. 2019 జనవరి: రాజ్యాంగ ధర్మాసనం వద్దకు చేరిన కేసు. 6 ఆగస్టు 2019: జస్టిస్‌ కలీఫుల్లా నేతృత్వంలోని మధ్యవర్తిత్వ కమిటీ విఫలం 16 అక్టోబర్‌ 2019: 40రోజుల సుదీర్ఘ విచారణ తర్వాత తీర్పు రిజర్వు చేసిన ధర్మాసనం 9 నవంబర్‌ 2019: వివాదస్పద స్థలం రామాలయానికి ఇస్తూ.. అయోధ్య ముస్లింలోకు సరైన ప్లేసులో5 ఎకరాల స్థలం ఇవ్వాలని తీర్పు 05-08-2020న అయోధ్య రామాలయానికి శంకుస్థాపన