Big News Big Debate : MP కాలర్ పట్టుకున్నారా? లేదా? విజువల్స్ లో ఏముంది?

ఏపీలో మూడు రాజధానుల అంశం తెరపైకి వచ్చినప్పటి నుంచి.. అమరావతి ప్రాంతంలో రైతుల ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ ఆందోళనలు నెమ్మదిగా వైసీపీ వర్సెస్ టీడీపీలా మారాయి. తాజాగా వైసీపీ ఎంపీ తనపై రైతుల ముసుగులో టీడీపీ కార్యకర్తలు దాడి చేశారని నందిగం సురేష్ ఆరోపించారు. తాను దళితుడైనందుకే ఈ దాడి జరిగిందని ఆరోపణలు చేయడంతో.. ఒక్క సారిగా క్యాస్ట్ పాలిటిక్స్‌కు తెరమీదకొచ్చాయి. అమరావతి మండలంలో రథోత్సవానికి వెళ్లి వస్తుంటే… కారం ప్యాకెట్లు, కర్రలతో తనపై హత్యాయత్నం […]

Big News Big Debate : MP కాలర్ పట్టుకున్నారా? లేదా? విజువల్స్ లో ఏముంది?
Follow us

| Edited By:

Updated on: Feb 25, 2020 | 6:17 AM

ఏపీలో మూడు రాజధానుల అంశం తెరపైకి వచ్చినప్పటి నుంచి.. అమరావతి ప్రాంతంలో రైతుల ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ ఆందోళనలు నెమ్మదిగా వైసీపీ వర్సెస్ టీడీపీలా మారాయి. తాజాగా వైసీపీ ఎంపీ తనపై రైతుల ముసుగులో టీడీపీ కార్యకర్తలు దాడి చేశారని నందిగం సురేష్ ఆరోపించారు. తాను దళితుడైనందుకే ఈ దాడి జరిగిందని ఆరోపణలు చేయడంతో.. ఒక్క సారిగా క్యాస్ట్ పాలిటిక్స్‌కు తెరమీదకొచ్చాయి. అమరావతి మండలంలో రథోత్సవానికి వెళ్లి వస్తుంటే… కారం ప్యాకెట్లు, కర్రలతో తనపై హత్యాయత్నం జరిగిందంటూ నందిగం సురేష్‌ సంచలన ఆరోపణలు చేశారు. తనకు ఏం జరిగినా చంద్రబాబు, లోకేష్‌లదే బాధ్యతని.. ఈ కుట్ర వెనక ఆలపాటి రాజా, గల్లా జయదేవ్‌ కూడా ఉన్నారంటూ ఆరోపణలు చేశారు. ఇక ఇదే అంశంపై టీవీ9 మేనేజింగ్ ఎడిటర్ రజినీకాంత్ ఆధ్వర్యంలో బిగ్ న్యూస్ బిగ్ డిబేట్ జరిగింది.

ఈ డిబేట్‌లో వైసీపీ తరఫున ఎంపీ నందిగం సురేష్‌.. టీడీపీ తరఫున ఎమ్మెల్సీ బాబు రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమరావతి మండలంలో రథోత్సవానికి వెళ్లి వస్తుంటే… కారం ప్యాకెట్లు, కర్రలతో హత్యాయత్నం జరిగిందంటూ.. దానికి సంబంధించిన వీడియోను ఎంపీ మీడియాకు విడుదల చేశారు. మహిళలు అనరాని మాటలు అంటూ తనపై దాడి చేశారని.. PA గల్లా పట్టుకుని లాగారన్నారు. అంతేకాదు.. కారం జల్లడంతో తన PAతో పాటు.. మరికొందరి కళ్లలో పడిందన్నారు. అటు రైతులు కూడా కొన్ని వీడియోలు విడుదల చేశారు.. ఎంపీ అనుచరులే తమపై దాడి చేశారన్నారు. తమ బస్‌ను అడ్డుకుని ఎవరూ కిందకు దిగకుండా.. వాటర్‌ ట్యాంకులు అడ్డుగా పెట్టిన విజువల్స్ విడుదల చేశారు. ఇదే అంశం బిగ్ న్యూస్ బిగ్ డిబేట్‌లో చర్చకు రావడంతో.. MP కాలర్ పెట్టుకున్నారా? లేదా? విజువల్స్ లో ఏముంది? అన్న దానిపై వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటలయుద్ధం జరిగింది. దీనికి సంబంధించిన వీడియోను కింద లింక్‌లో చూడండి.