Breaking News
  • హైదరాబాద్: జర్నలిస్టులందరికీ హెల్త్‌ కార్డులు అందించాలి, అన్ని ఆస్పత్రుల్లో సేవలు అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి, ఈనెల 20 నుంచి 25 వరకు రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు, ఎమ్మెల్యేలకు టీయూడబ్ల్యూజే వినతి పత్రాలు-టీయూడబ్ల్యూజే ప్రధాన కార్యదర్శి విరాహత్‌ అలీ.
  • ఆసియాలోనే లైఫ్‌ సైన్సెస్‌కు ప్రధాన కేంద్రంగా హైదరాబాద్‌ మారింది. ప్రపంచ వ్యాక్సిన్‌ ఉత్పత్తిలో మూడో వంతు హైదరాబాద్‌ సరఫరా చేస్తోంది. జాతీయ ఫార్మా ఉత్పత్తిలో హైదరాబాద్‌ వాటా 35శాతం-మంత్రి కేటీఆర్‌.
  • యాదాద్రి: గుండాల మండలం సుద్దాల దగ్గర ప్రమాదం, కారు, బైక్‌ ఢీకొని ఇద్దరు మృతి, ఒకరికి తీవ్రగాయాలు.
  • విజయవాడ: ఎమ్మార్వో వనజాక్షిపై టూటౌన్ పీఎస్‌లో ఫిర్యాదు, తమను కులం పేరుతో దూషించిందని ఫిర్యాదు చేసిన మహిళా రైతులు.
  • మహబూబాబాద్: పోడు భూముల ఆక్రమణదారులకు కలెక్టర్‌ హెచ్చరిక. 10 ఎకరాలకు మించి పోడు భూములు ఆక్రమించిన 119 మంది. ఆక్రమణదారుల్లో ప్రభుత్వ ఉద్యోగులు, నేతలు, కుల సంఘాల నేతలు. భూములు వెంటనే తిరిగి అప్పగించాలని కలెక్టర్ ఆదేశం. లేదంటే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరిక.
  • ప్రాణం తీసిన సెల్ఫీ. కృష్ణాజిల్లా: నూజివీడులో విషాదం. సూరంపల్లి కాలువ దగ్గర సెల్ఫీ దిగేందుకు యువకుడు యత్నం. ప్రమాదవశాత్తు కాలువలో పడి యువకుడు మృతి. బీటెక్‌ ఫైనల్‌ ఇయర్‌ చదువుతున్న పవన్‌.

దేశంలో పెరుగుతున్న ఆర్ధిక మాంద్యం… మోదీ విధానాలే కారణమా?

Big News Big Debate : Indian economic slowdown Rajinikanth TV9, దేశంలో పెరుగుతున్న ఆర్ధిక మాంద్యం… మోదీ విధానాలే కారణమా?

దేశంలో ఆర్ధిక మాంద్యం పెరిగిపోయిందని ఆర్ధిక రంగ నిపుణులు చెబుతుంటే.. ప్రధాని మోదీ పాలనలో దేశంలో ఎన్నో రకాల సంస్కరణలు జరిగాయని బీజేపీ మంత్రులు, నేతలు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితిలో ఇటీవల నోబెల్ పురస్కార గ్రహీత అభిజిత్ బెనర్జీ స్వయంగా చెబుతున్న బీజేపీ మాత్రం ససేమిరా అంటోంది. ఇంతకీ దేశంలో నిజంగా ఆర్ధిక మాంద్యం పెరిగిపోయిందా? ఇదే అంశంపై టీవీ9 ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ రజనీకాంత్ నిర్వహించిన బిగ్ న్యూస్ బిగ్‌ డిబేట్‌ లైవ్‌లో చర్చ జరిగింది. ప్రపంచ వ్యాప్తంగా ఆర్ధిక మాంద్యం ఉన్న నేపథ్యంలో ప్రధాని మోదీ దాన్ని తగ్గించడానికి ఎన్నో చర్యలు తీసుకుంటున్నారని బీజేపీ నేత సత్యమూర్తి చెప్పుకొచ్చారు. ప్రస్తుతం అభిజిత్ బెనర్జీ మాత్రమే కాకుండా గతంలో అమర్త్య సేన్ కూడా చెప్పారని.. వీరంతా కుహనా మేధావులని విమర్శించారు. 2008లో కూడా ఆర్దిక మాంద్యం వచ్చిందని, అప్పడు యూపీఏ ప్రభుత్వం తమ మద్దతుతో మాంద్యాన్ని తగ్గించారని సీపీఐ జాతీయ నేత నారాయణ తెలిపారు. దేశంలో కార్మికులంతా ఉద్యమాలు చేస్తున్నారని, స్వయంగా ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ భర్త పరకాల ప్రభాకర్ చెప్పిన విషయాలు వాస్తవమేనన్నారు. మోదీ ప్రభుత్వం ప్రైవేటు సెక్టార్, కార్పొరేట్ కంపెనీలను పెంచి పోషిస్తూ.. ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేస్తోందని నారాయణ విమర్శించారు. ప్రభుత్వ విధానాలు కాకులను కొట్టి గద్దలకు వేస్తూ.. కార్పొరేట్ కంపెనీలకు దోచిపెడుతున్నారంటూ ఆయన దుయ్యబట్టారు. ఈ దేశానికి ప్రమాదం ఏదైనా వచ్చిందంటే అది కేవలం మోదీ వల్ల మాత్రమేనంటూ ఆరోపించారు సీపీఐ నేత నారాయణ. దేశంలో ప్రస్తుతం ఆర్ధిక మాంద్యం ఉన్నవిషయాన్ని స్వయంగా 20 రోజుల క్రితం ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారని, దీనికి జీఎస్టీ వసూళ్లకు సంబంధించిన పట్టికను గమనిస్తే దీన్ని అర్ధం చేసుకోచ్చన్నారు. అత్యధికంగా ఏప్రిల్‌లో వసూలు కాగా.. అది సెప్టెంబర్ వచ్చే సరికి 20 శాతం తగ్గిపోయిందన్నారు ఆర్ధిక రంగ నిపుణులు సాయిబాబా. ఇలా తగ్గిపోడానికి ప్రధాన కారణం ప్రజల్లో కొనుగోలుశక్తి తగ్గిపోవడమేనన్నారు. దేశంలో మొత్తం ఆర్ధిక మాంద్యం పెరిగిపోవడంపై ఆర్టిక వేత్తలు హెచ్చరికలు చేస్తున్నారు. ఈ విధంగా ఆర్ధిక మాంధ్యం పెరగడం వల్ల నిత్యావసరాల ధరలు ఆకాశాన్నితాకడం సామన్యుడికి పెనుభారంగా మారింది. అయితే కార్పొరేట్ సెక్టార్‌కు బలాన్నిస్తున్న ప్రభుత్వం సామాన్యుడిని కూడా పట్టించుకోవాలని ఆర్ధిక వేత్తలు కోరుతున్నారు.