అటు ఆర్థికరంగ ఒత్తిళ్లు.. ఇటు కరోనా సవాళ్లు..

–లాక్‌డౌన్‌పై రాష్ట్రాల్లో భిన్నస్వరాలు – కరోనా వ్యాప్తిపై కలవరపెడుతున్న రిపోర్టులు – జులైలో ముప్పుందన్న నివేదికలు –మోదీ ప్రభుత్వానికి అగ్నిపరీక్ష లాక్‌డౌన్‌ కొనసాగించలేరు.. అలాగని ఎత్తేయలేని పరిస్థితి. ఎన్డీయే నేతృత్వంలోని నరేంద్రమోదీ ప్రభుత్వానికి పెద్ద సవాలే విసురుతోంది కోవిడ్‌ 19. ప్రపంచదేశాల ముందు తన నాయకత్వ దక్షతను చాటుకున్న మోదీ కూడా మొదట్లో కరోనాను జయించినట్టే భావించారు. ఇంకొంతకాలం లాక్‌డౌన్‌ ఉంటే సరిపోతుందని నమ్మారు. కానీ పరిస్థితులు ఆయన చేతుల్లో లేవని కాలం గడుస్తున్న కొద్దీ అర్ధమవుతోంది. […]

అటు ఆర్థికరంగ ఒత్తిళ్లు..  ఇటు కరోనా సవాళ్లు..
Follow us

| Edited By:

Updated on: May 12, 2020 | 5:28 PM

లాక్‌డౌన్‌పై రాష్ట్రాల్లో భిన్నస్వరాలుకరోనా వ్యాప్తిపై కలవరపెడుతున్న రిపోర్టులుజులైలో ముప్పుందన్న నివేదికలుమోదీ ప్రభుత్వానికి అగ్నిపరీక్ష

లాక్‌డౌన్‌ కొనసాగించలేరు.. అలాగని ఎత్తేయలేని పరిస్థితి. ఎన్డీయే నేతృత్వంలోని నరేంద్రమోదీ ప్రభుత్వానికి పెద్ద సవాలే విసురుతోంది కోవిడ్‌ 19. ప్రపంచదేశాల ముందు తన నాయకత్వ దక్షతను చాటుకున్న మోదీ కూడా మొదట్లో కరోనాను జయించినట్టే భావించారు. ఇంకొంతకాలం లాక్‌డౌన్‌ ఉంటే సరిపోతుందని నమ్మారు. కానీ పరిస్థితులు ఆయన చేతుల్లో లేవని కాలం గడుస్తున్న కొద్దీ అర్ధమవుతోంది. లాక్‌డౌన్‌ 3.0 తర్వాత కూడా కరోనా తగ్గుతున్న ఛాయలు లేకపోగా.. మరింత సంక్షోభంలోకి తీసుకెళుతున్నట్టు చెబుతున్న నివేదికలు కలవరపెడుతున్నాయి.

దేశంలో కేసుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. మే 09 నుంచి 11 మధ్య 13శాతం కేసులు పెరిగాయి. 59వేల నుంచి 67వేలకు పెరిగిన కరోనా కేసులు ముందున్న ముప్పును తెలియజేస్తున్నాయి. రానున్న వారంరోజుల్లోనే కేసుల సంఖ్య లక్షకు చేరుతుందని జాన్‌ హాప్కిన్స్‌ విశ్వవిద్యాలయం రీసెర్చ్‌ రిపోర్ట్‌ అంచనా వేస్తోంది. యాక్టీవ్‌ ఇన్‌ఫెక్షన్‌ కేసులు భారీగా పెరుగుతున్నాయి. అడ్వాన్స్‌డ్‌ కంట్రీలో కేసులు రేషియో తగ్గుతుంటే.. ఇండియా, బ్రెజిల్‌ లాంటి దేశాల్లో భారీగా పెరుగుతున్నాయి. ఇది మనకు ఆందోళన కలిగించే అంశం. అటు ఇప్పటికే దేశంలో 2వేల 2వందలకు పైగా మరణాలు నమోదయ్యాయి. ముంబయిలో సోమవారం ఒక్కరోజే 20మంది మృతిచెందారు. గడిచిన పదిరోజుల్లో మరణాల సంఖ్య రెట్టింపు అయిన తీరు చూస్తుంటే పరిస్థితులు ఏ స్థాయిలో ఉన్నాయో అర్ధమవుతోంది.

పెరుగుతున్న కేసులు, మరణాలు భారతీయ హెల్త్‌ సిస్టమ్‌కు సవాల్‌ విసురుతున్నాయి. మే 11 వరకూ ప్రభుత్వ లెక్కల ప్రకారం 5 రాష్ట్రాల్లోనే 77శాతం కేసులు నమోదయ్యాయి. టాప్‌ 10 స్టేట్స్‌లో 94శాతం కేసులున్నాయి. వెస్ట్‌ బెంగాల్‌, యూపీ, గుజరాత్‌లో 46శాతం మరణాలు నమోదవడం అక్కడ పెరదేశంలో ఇప్పటికీ 531 జిల్లాల్లో కోవిడ్‌ 19 కేసులున్నాయి. అంటే రెడ్‌ జోన్‌ కొనసాగుతోంది. అలాగని లాక్‌డౌన్‌ కంటిన్యూ చేసే పరిస్థితి లేదు. సడలింపులు ఇవ్వకపోతే భవిష్యత్తులో ఆకలిచావులు తప్పవవంటున్నారు ఆర్ధిక వేత్తలు.

అంతర్జాతీయ నివేదికలు కూడా కరోనా ఇప్పట్లో తగ్గే వ్యాధి కాదంటున్నాయి. వ్యాక్సిన్‌ ఎప్పుడొస్తుందో తెలియదు. మందు వస్తుందో రాదో అంతుచిక్కడం లేదు. ఎయిడ్స్‌కు ఇప్పటికీ మందులేదు.. అలాంటి జాబితాలో చేరుతుందన్న భయాలూ ఉన్నాయి. యూనివర్శిటీ ఆఫ్‌ మిన్నెసోటా కు చెందిన ఓస్టర్‌ హాల్‌ అనే శాస్త్రవేత్త ఆధ్వర్యంలో సెంటర్‌ ఫర్‌ ఇన్‌ఫెక్షియస్‌ డిసీజ్‌ రీసెర్చ్‌ అండ్‌ పాలసీ రీసెర్చ్‌ చేసింది. గతంలో ఆయన పలువురు అధ్యక్షులకు సలహాదారుగా పనిచేశారు. అంటువ్యాధులపై 50ఏళ్లుగా పరిశోధనలు చేస్తున్నారు. రానున్న నెలల్లో కరోనా వ్యాప్తిపై గురువారం లేటెస్ట్‌ రిపోర్ట్‌ ఇచ్చారాయన. 1918 స్పానిష్‌ ఫ్లూ వ్యాప్తి ఆధారంగా నివేదిక తయారుచేశారు. 18 నుంచి 24 నెలల వరకూ కరోనా ఉంటుందని రీసెర్చ్‌ రిపోర్ట్‌ చెబుతోంది. ప్రపంచ జనాభాలో 60-70శాతం ప్రజలకు ఈ వ్యాధి చేరేవరకు వదలదని నివేదిక సారాంశం. 1918లో స్పానిష్‌ ఫ్లూ 50కోట్ల మందికి సోకింది. స్పానిస్‌ ఫ్లూ కంటే స్పీడుతో కరోనా వ్యాపి చెందుతోంది. సాధారణ అంటువ్యాధులు ఒకరి నుంచి 1.3 రేషియాలో వ్యాప్తి చెందితే.. ఇది 2.5 శాతం వరకూ ఉంది. వ్యాక్సిన్‌ ఆధారంగా ఇది మూడు సినారియోల్లో చూపించారు. జులైలో కరోనా విజృంభిస్తుందంటోంది రిపోర్ట్‌.

మరోవైపు వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరం ఓ సర్వే చేసింది. వివిధ దేశాల్లోని ఆయా రంగాలు, ప్రజల నుంచి సమాచారం సేకరించింది. వారికి రెండు ప్రశ్నలు వేసింది.

1. ఆర్ధిక వ్యవస్థ తీవ్రంగా నష్టపోయినా ఫర్వాలేదు స్లోగా రికవరీ అవుతుంది… సాధ్యమైనంత మంది మనుషుల ప్రాణాలు కాపాడేందుకే ప్రభుత్వాలు ప్రాధాన్యత ఇవ్వాలి.

2. వ్యాప్తి చెందకుండా జాబ్స్‌ కాపాడుతూ, ఎకానమీ రిస్టార్ట్‌ చేయాలి. అని అడిగింది. గ్లోబల్‌గా ప్రజల ప్రాణాలు ముఖ్యమని 67శాతం మంది స్పష్టం చేశారు. ఆర్ధిక వ్యవస్థ, జాబ్స్‌ ముఖ్యమని 33శాతం మంది అభిప్రాయపడ్డారు. ఇండియాలో 64శాతం మంది ప్రాణాలు కాపాడాలని చెప్పారు. ప్రతి దేశంలోనూ 56శాతం కంటే ఎక్కువమందే ప్రజల ప్రాణాలే ముఖ్యమన్నారు. అమెరికాలో కూడా ఇండియా కంటే ఎక్కువమంది ప్రాణాలు కాపాడమని చెబుతున్నారు.

మొత్తానికి మోదీ ముందు పెద్ద సవాలే ఉంది.. అటు లాక్‌డౌన్‌ ఎత్తేసి ప్రజల ప్రాణాలతో చెలగాడమాడే పరిస్థితి లేదు. ఇటు కంటిన్యూ చేసి ముందుముందు ఆకలిచావులకు ఆస్కారం ఇవ్వలేరు. ఈ పరిస్థితుల్లో మోదీ తీసుకునే నిర్ణయంవైపే అందరిచూపూ ఉంది. ప్రజల ఆరోగ్యం కాపాడుతూనే… ఆర్ధిక వ్యవస్థను గాడిలో పెట్టాల్సిన బాధ్యత ఉంది. ప్రజలకు అవగాహన కల్పిస్తూ… వైద్య రంగాన్ని బలోపేతం చేస్తూ కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలి. మార్కెట్లో డిమాండ్‌ సృష్టించి.. పరిశ్రమలను ఆదుకోవడంతో పాటు… భవిష్యత్తులో ఆకలిచావులు లేకుండా చూడాలి. నివేదికలు ఓవైపు… రాష్ట్రాలు అభ్యర్ధనలు మరోవైపు… ముందుముందు పొంచి ఉన్న కరోనా ముప్పు ఇంకోవైపు ముప్పేట దాడి నుంచి మోదీ ఈ దేశాన్ని సురక్షితంగా ఒడ్డుకు చేర్చగలరా? చూడాలి.