సీపీఐపై భగ్గుమన్న బీజేపీ.. టీవీ9 వేదికగా సవాల్..!

హుజూర్‌నగర్ పాలిటిక్స్.. మరింత హాట్ టాపిక్‌గా మారాయి. నామినేషన్ల పర్వం ముగియడంతో.. పార్టీల మధ్య ఆరోపణలు పీక్‌ స్టేజ్‌కు చేరుకున్నాయి. ముఖ్యంగా వామపక్ష పార్టీ అయిన సీపీఐ మద్దతు కోసం కాంగ్రెస్, టీఆకర్ఎస్ పార్టీలు రెండు వెంపర్లాడాయి. అయితే అనూహ్యంగా సీపీఐ అధికార పార్టీ టీఆర్ఎస్‌కే మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించింది. దీంతో హుజూర్‌నగర్ ఉపఎన్నిక మరింత రసవత్తరంగా మారింది. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఏడు వేల ఓట్ల తేడాతో టీఆర్ఎస్ ఓటమిపాలైంది. అయితే […]

సీపీఐపై భగ్గుమన్న బీజేపీ.. టీవీ9 వేదికగా సవాల్..!
Follow us

| Edited By:

Updated on: Oct 02, 2019 | 12:14 PM

హుజూర్‌నగర్ పాలిటిక్స్.. మరింత హాట్ టాపిక్‌గా మారాయి. నామినేషన్ల పర్వం ముగియడంతో.. పార్టీల మధ్య ఆరోపణలు పీక్‌ స్టేజ్‌కు చేరుకున్నాయి. ముఖ్యంగా వామపక్ష పార్టీ అయిన సీపీఐ మద్దతు కోసం కాంగ్రెస్, టీఆకర్ఎస్ పార్టీలు రెండు వెంపర్లాడాయి. అయితే అనూహ్యంగా సీపీఐ అధికార పార్టీ టీఆర్ఎస్‌కే మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించింది. దీంతో హుజూర్‌నగర్ ఉపఎన్నిక మరింత రసవత్తరంగా మారింది. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఏడు వేల ఓట్ల తేడాతో టీఆర్ఎస్ ఓటమిపాలైంది. అయితే అప్పుడు కాంగ్రెస్ మహాకూటమి భాగస్వామ్యంగా గెలుపోందింది. నియోజకవర్గంలో దాదాపు మూడు నుంచి నాలుగు వేల ఓటు బ్యాంకు కల్గిన సీపీఐ పార్టీ.. టీఆర్ఎస్‌కు మద్ధతు పలకడంతో టీఆర్ఎస్ గెలుపు ఖాయమంటూ వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సీపీఐపై బీజేపీ పార్టీ సంచలన ఆరోపణలు చేసింది. హుజూర్ నగర్ బైపోల్‌కి సంబంధించిన బిగ్ డిబెట్ టీవీ9 స్టూడియోలో జరిగింది. ఈ నేపథ్యంలో బీజేపీ సీనియర్ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్.. సీపీఐ పార్టీపై ఆరోపణలు చేశారు. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి ఇస్తామని టీఆర్ఎస్ హామీ ఇవ్వడంతోనే ఇప్పుడు సీపీఐ అవకాశ రాజకీయాలు చేస్తుందని అన్నారు. అయితే ప్రభాకర్ చేసిన ఆరోపణలను సీపీఐ నేత సాంబశివరావు ఖండించారు. ప్రభాకర్ ఆరోపణలను రుజువు చెయ్యాలని.. లేని పోని ఆరోపణలు చేయడం సబబు కాదని అన్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ నేత ప్రభాకర్, సీపీఐ నేత సాంబశివరావు మధ్య సవాళ్ల పర్వం సాగింది. ప్రభాకర్ ఆరోపణలను రుజువు చేయకపోతే రాజకీయ సన్యాసం తీసుకోడానికి సిద్ధమా అంటూ సీపీఐ నేత సాంబశివరావు సవాల్ విసిరారు.

ప్రపంచంలో బెస్ట్‌ ఎయిర్‌పోర్టులు ఏవో తెలుసా..?
ప్రపంచంలో బెస్ట్‌ ఎయిర్‌పోర్టులు ఏవో తెలుసా..?
మీ పిల్లల చదువుకు రూ.2 కోట్లు కావాలంటే నెలకు ఎంత SIP చేయాలి?
మీ పిల్లల చదువుకు రూ.2 కోట్లు కావాలంటే నెలకు ఎంత SIP చేయాలి?
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు