బిగ్ న్యూస్ బిగ్ డిబేట్: రాజధాని రాత

రాజధానిపై కేంద్ర హోంశాఖ ఇచ్చిన సమాధానంపై ఏపీలో ఎవరిలెక్కలు వారేసుకుంటున్నారు. రాష్ట్రాలకుండే హక్కులనే కేంద్రం ప్రస్తావించిందని చెబుతోంది వైసీపీ. క్యాపిటల్‌ ఏర్పాటుపైనే హక్కులుంటాయని… మార్చడానికి అధికారాలు లేవంటోంది టీడీపీ. లేటెస్ట్‌ ఈక్వేషన్స్‌తో ఏపీ బీజేపీ లీడర్స్‌ను అయోమయంలో పడ్డారు. అమరావతిపై జనసేనతో కలిసి ఉద్యమించాలా? ప్రస్తుతానికి సైలెంట్‌గా ఉండాలా అంటూ కన్ఫ్యూజన్‌లో ఉంది కమలదళం. క్యాపిటల్‌పై కేంద్రహోంశాఖ రాతపూర్వక సమాధానంపై ఏపీలో రాజకీయ ప్రకంపనలు కొనసాగుతున్నాయి. దీనిపై ఎవరికి వారు సొంత నిర్వచనాలు ఇచ్చుకుంటున్నారు. తమకు అనుకూలంగా […]

బిగ్ న్యూస్ బిగ్ డిబేట్: రాజధాని రాత
Follow us

| Edited By:

Updated on: Feb 06, 2020 | 12:06 AM

రాజధానిపై కేంద్ర హోంశాఖ ఇచ్చిన సమాధానంపై ఏపీలో ఎవరిలెక్కలు వారేసుకుంటున్నారు. రాష్ట్రాలకుండే హక్కులనే కేంద్రం ప్రస్తావించిందని చెబుతోంది వైసీపీ. క్యాపిటల్‌ ఏర్పాటుపైనే హక్కులుంటాయని… మార్చడానికి అధికారాలు లేవంటోంది టీడీపీ. లేటెస్ట్‌ ఈక్వేషన్స్‌తో ఏపీ బీజేపీ లీడర్స్‌ను అయోమయంలో పడ్డారు. అమరావతిపై జనసేనతో కలిసి ఉద్యమించాలా? ప్రస్తుతానికి సైలెంట్‌గా ఉండాలా అంటూ కన్ఫ్యూజన్‌లో ఉంది కమలదళం.

క్యాపిటల్‌పై కేంద్రహోంశాఖ రాతపూర్వక సమాధానంపై ఏపీలో రాజకీయ ప్రకంపనలు కొనసాగుతున్నాయి. దీనిపై ఎవరికి వారు సొంత నిర్వచనాలు ఇచ్చుకుంటున్నారు. తమకు అనుకూలంగా ఉండేలా కొత్తగా లా పాయింట్లు వెతుక్కుంటున్నారు. అయితే రాష్ట్రాల హక్కులను కేంద్రం మరోసారి గుర్తు చేసిందని దీనిపై చర్చే అనవసరమంటోంది వైసీపీ. రాష్ట్రాభివృద్దికోసం నిర్ణయాలు తీసుకుంటే కేంద్రం జోక్యం ఉండదంటున్నారు మంత్రులు.

రాజధాని ఏర్పాటు చేయడానికి మాత్రమే అధికారం ఉంటుందని.. మార్చడానికి ఎవరిచ్చారని ప్రశ్నించారు టీడీపీ అధినేత చంద్రబాబు. అమరావతి రాజధాని అని కేంద్రమే గుర్తించిన తర్వాతే మార్చే హక్కు ఎక్కడుందన్నారు. కేంద్రం ఇచ్చిన లేఖలో కూడా ఏర్పాటుపైనే ఉందని.. మార్పు ప్రస్తావన లేదన్నారు. చంద్రబాబు వ్యాఖ్యలపై బీజేపీ జాతీయ నాయకత్వం భిన్నంగా స్పందించింది. జీవోలు వందలు వస్తుంటాయి.. ఎప్పుడైనా మార్చుకునే వెసులుబాటు ఉందంటున్నారుజీవీఎల్. అంతేకాదు.. చంద్రబాబు ఇచ్చిన నోటిఫికేషన్ శిలాశాసనం కాదన్నారు. రాజధానిపై రాష్ట్రానిదే తుది నిర్ణయమని.. ఏపీలో పార్టీలు రైతులను మభ్యపెట్టే మాటలు మానుకోవాలన్నారు. రాజధాని రైతులు ఢిల్లీ రావడం కంటే… అమరావతిలో తేల్చుకోవడం మంచిదని సలహా కూడా ఇచ్చింది బీజేపీ.