Big News Big Debate: CRDA రద్దు చేయబోతున్నారా?

అమరావతిలో ప్రజాభిప్రాయ సేకరణకు సిద్ధమైంది హైపవర్‌ కమిటీ. 29 గ్రామాల్లోని రైతులతోపాటు ఎవరైనా తమ అభిప్రాయాలను చెప్పాలని విజ్ఞప్తి చేసింది. ఈ నెల 17వ తేదీ సాయంత్రం లోపు CRDA కమిషనర్‌కు ఏ రూపంలోనైనా విజ్ఞప్తులు చేయాలని సూచించింది. మూడోసారి భేటీ అయిన హైపవర్‌ కమిటీ ప్రధానంగా అమరావతి రైతుల అంశంపైనే చర్చించింది. రైతుల అభిప్రాయాలు సేకరించిన తర్వాత 17వ తేదీన మరోసారి భేటీ కావాలని నిర్ణయించింది. విజయవాడ ఆర్టీసీ కాంప్లెక్స్‌లో మూడోసారి భేటీ అయిన హైపవర్‌ […]

Big News Big Debate: CRDA రద్దు చేయబోతున్నారా?
Follow us

| Edited By:

Updated on: Jan 13, 2020 | 9:45 PM

అమరావతిలో ప్రజాభిప్రాయ సేకరణకు సిద్ధమైంది హైపవర్‌ కమిటీ. 29 గ్రామాల్లోని రైతులతోపాటు ఎవరైనా తమ అభిప్రాయాలను చెప్పాలని విజ్ఞప్తి చేసింది. ఈ నెల 17వ తేదీ సాయంత్రం లోపు CRDA కమిషనర్‌కు ఏ రూపంలోనైనా విజ్ఞప్తులు చేయాలని సూచించింది. మూడోసారి భేటీ అయిన హైపవర్‌ కమిటీ ప్రధానంగా అమరావతి రైతుల అంశంపైనే చర్చించింది. రైతుల అభిప్రాయాలు సేకరించిన తర్వాత 17వ తేదీన మరోసారి భేటీ కావాలని నిర్ణయించింది. విజయవాడ ఆర్టీసీ కాంప్లెక్స్‌లో మూడోసారి భేటీ అయిన హైపవర్‌ కమిటీ అమరావతి రైతుల అంశంపైనే ప్రధానంగా చర్చించింది. చర్చలకు రావాలని ఇప్పటికే మంత్రులు విజ్ఞప్తి చేసినా ఎలాంటి రియాక్షన్‌ రాలేదు. అసలు ఆ ప్రస్తావనే తేవడం లేదు రైతులు. ఈ నేపథ్యంలో CRDA కమిషనర్‌కు సూచనలు ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది హైపవర్‌ కమిటీ.

ఒక ప్లాన్డ్‌గా చంద్రబాబు ఆందోళనలు చేయిస్తున్నారని విమర్శించారు మంత్రి పేర్ని నాని. కొందరు రైతులతో ఇప్పటికే తమతో చర్చలు జరిపారని, ఇంకా ఏమైనా అభిప్రాయాలు ఉంటే 17వ తేదీ లోపు చెప్పొచ్చని సూచించారు పేర్ని నాని. మరోవైపు CRDA పరిధి తగ్గింపుపైనా కమిటీలో చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఎందుకంటే… మచిలీపట్నం పార్లమెంట్‌ పరిధిలో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాలను CRDA నుంచి తొలగించాలని కోరారు మంత్రి కొడాలి నాని. గ్రీన్‌ జోన్‌ వల్ల వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు రావడం లేదని, కాబట్టి పరిధి తగ్గించాలని సూచించారాయన. లేని ఉద్యమాన్ని క్రియేట్‌ చేసి తన బాధను ప్రపంచం బాధగా చిత్రీకరిస్తున్నారని చంద్రబాబుపై విమర్శలు చేశారు మరో మంత్రి కన్నబాబు.