Breaking News
  • ఉదయం నుంచి రెస్క్యూ ఆపరేషన్‌ నిర్వహించాం. శేఖర్‌ ఆరోగ్యం నిలకడగానే ఉంది. బోగీలను క్రేన్‌ సాయంతో ఈ రాత్రికి తొలగిస్తాం -రైల్వే రెస్క్యూ అధికారి భార్గవ్‌
  • విజయవాడ: రేపు ఉ.11:45కు గవర్నర్‌ను కలవనున్న టీడీపీ నేతలు. అఖిలప్రియ కుటుంబంపై అక్రమ కేసులు ప్రభుత్వ వేధింపులపై ఫిర్యాదు చేయనున్న టీడీపీ నేతలు
  • నిందితుడు ప్రకాష్‌ భార్య సునీత సంచలన వ్యాఖ్యలు. మా ఆయనకు గతంలో కూడా ఇలాంటి అనుభవం ఉంది. గతంలో మా ఆయనను ఊరి నుంచి తరిమికొట్టారు. మా ఆయన ఎదురైతే నేనే చంపేస్తా-ప్రకాష్ భార్య సునీత ప్రకాష్‌ను చట్టపరంగా కఠినంగా శిక్షించాలి-సునీత
  • వరంగల్‌: ఫోర్ట్‌ రోడ్డులో కారు బీభత్సం. ఒక ఆటో, 6 బైక్‌లను ఢీకొట్టిన కారు. 8 మందికి గాయాలు, ఆస్పత్రికి తరలింపు. కారు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • ఆర్టికల్ 370రద్దుపై సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన కేంద్రం. జమ్ముకశ్మీర్ అభివృద్ధికి ఆర్టికల్ 370 ఆటంకంగా మారిందన్న కేంద్రం. ఆర్టికల్ 370తో వేర్పాటువాదులు, ఉగ్రవాదులు ప్రయోజనం పొందారు ఆర్టికల్‌ 370 రద్దుపై ఈ నెల 14న విచారణ చేపట్టనున్న సుప్రీంకోర్టు
  • మహారాష్ట్రలో గవర్నర్‌ సంచలన నిర్ణయం. ఎన్సీపీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించిన గవర్నర్‌. మహారాష్ట్ర అసెంబ్లీలో బలాలు. బీజేపీ-105, శివసేన-56, ఎన్సీపీ-54, కాంగ్రెస్‌-44, ఇతరులు -29 బలనిరూపణ చేసుకోని తొలి రెండు స్థానాల్లో ఉన్న బీజేపీ, శివసేన. మూడో స్థానంలో ఉన్న ఎన్సీపీని ఆహ్వానించిన గవర్నర్‌
  • ప్రకాశం: 2017 భూకుంభకోణంలో రెవెన్యూ సిబ్బంది అరెస్ట్‌. రిటైర్డ్ తహశీల్దార్‌ మెర్సీకుమారి, గుడ్లూరు వీఆర్వో నాగరాజు, ఆపరేటర్‌ సురేష్‌ అరెస్ట్. అక్రమంగా పాస్‌బుక్‌లు పొందిన మరో నలుగురి అరెస్ట్‌, రిమాండ్‌కు తరలింపు

‘ఆపరేషన్ ఆకర్ష్’.. వంశీ బాటలోనే మరో టీడీపీ నేత.. షాకిచ్చిన బీజేపీ!

గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రాజీనామా ఎపిసోడ్ రాజకీయంగా పెద్ద చర్చనీయాంశం అయింది. వంశీ రాజీనామా ప్రస్తుతం ఓ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాను తలపిస్తూ ఎన్నో మలుపులు తిరుగుతోంది. ఆయన వైసీపీలోకి వెళ్తారా.? లేదా బాబు బుజ్జగింపులతో తిరిగి టీడీపీలోనే ఉంటారా.? లేదా బీజేపీలోకి వెళ్తారా? అనేది తెలియాల్సి ఉంది.  ఇలాంటి తరుణంలో బీజేపీ నేత రఘురాం చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

వల్లభనేని వంశీతో పాటు టీడీపీకి చెందిన మరో నేత గంటా శ్రీనివాసరావు కూడా బీజేపీ, వైసీపీ నేతలతో మంతనాలు సాగిస్తున్నారని రఘురాం బాంబ్ పేల్చారు. బీజేపీలో చేరాలనుకునే నేతలు ధైర్యంగా చేరవచ్చని.. వైసీపీ బెదిరింపులకు భయపడాల్సిన అవసరం లేదని.. తాము రక్షణగా ఉంటామని రఘురాం చెప్పారు. టీడీపీ పరిస్థితి అగమ్యగోచరంగా ఉందన్న రఘురాం.. ప్రస్తుతం వైసీపీ అధికారంలో ఉన్నప్పటికీ.. భవిష్యత్తు మాత్రం బీజేపీదేనని జోస్యం చెప్పారు. మరి ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మోదీకి చంద్రబాబు ఫిర్యాదు చేస్తారో లేదో చూడాల్సి ఉంది.