రాజధాని మార్పు ఎందుకో…? వైసీపీకి టీడీపీ నేత ప్రశ్న

ఏపీ రాజధాని అంశం మరింత హీటెక్కింది. రాజధానిపై నిర్ణయం ప్రకటించడానికి గ్రౌండ్‌ ప్రిపేర్‌ చేస్తున్న జగన్‌ సర్కార్‌కి.. బోస్టన్‌ కన్సల్టింగ్‌ గ్రూప్‌ నివేదిక చేతికి అందింది. రాజధాని కార్యకలాపాల వికేంద్రీకణకి తీసుకోవాల్సిన చర్యలను ఈ నివేదిక ఫోకస్‌ పెట్టింది. రాజధాని, రాష్ట్ర సమగ్రాభివృద్ది ఎలా సాధ్యమవుతోంది అన్న అంశాలపై బీసీబీ గ్రూప్ ప్రభుత్వానికి పలు కీలక సూచనలు చేసింది. దీంతో పాటు.. అమరావతి అభివృద్ధి వ్యూహాలను ప్రస్తావించింది. రాష్ట్రాన్ని ఆరు రీజియన్లుగా పరిగణిస్తూ.. రాజధాని కోసం రెండు […]

రాజధాని మార్పు ఎందుకో...? వైసీపీకి టీడీపీ నేత ప్రశ్న
Follow us

| Edited By:

Updated on: Jan 03, 2020 | 11:28 PM

ఏపీ రాజధాని అంశం మరింత హీటెక్కింది. రాజధానిపై నిర్ణయం ప్రకటించడానికి గ్రౌండ్‌ ప్రిపేర్‌ చేస్తున్న జగన్‌ సర్కార్‌కి.. బోస్టన్‌ కన్సల్టింగ్‌ గ్రూప్‌ నివేదిక చేతికి అందింది. రాజధాని కార్యకలాపాల వికేంద్రీకణకి తీసుకోవాల్సిన చర్యలను ఈ నివేదిక ఫోకస్‌ పెట్టింది. రాజధాని, రాష్ట్ర సమగ్రాభివృద్ది ఎలా సాధ్యమవుతోంది అన్న అంశాలపై బీసీబీ గ్రూప్ ప్రభుత్వానికి పలు కీలక సూచనలు చేసింది. దీంతో పాటు.. అమరావతి అభివృద్ధి వ్యూహాలను ప్రస్తావించింది.

రాష్ట్రాన్ని ఆరు రీజియన్లుగా పరిగణిస్తూ.. రాజధాని కోసం రెండు ఆప్షన్లను ఇచ్చింది బోస్టన్ గ్రూప్ రిపోర్ట్. తొలి ఆప్షన్‌‌గా.. వైజాగ్‌లో సెక్రటేరియట్, ప్రజలతో నేరుగా సంబంధం లేని శాఖల కార్యాలయాలు, అత్యవసర అసెంబ్లీ సమావేశాలను, హైకోర్టు బెంచ్‌ను పెట్టుకోవచ్చునని సూచించింది. ఇక అమరావతిలో హెచ్‌ఓడీల కార్యాలయాలు, అసెంబ్లీ, హైకోర్టు బెంచ్.. కర్నూలులో హైకోర్టు, స్టేట్ కమిషన్, అప్పిలేట్ బాడీలను ఏర్పాటు చేయెచ్చని తెలిపింది. ఇక సెకండ్ ఆప్షన్‌గా… విశాఖలో సెక్రటేరియట్, సీఎం, గవర్నర్ ఆఫీసులు, అన్ని శాఖల కార్యాలయాలు, అత్యవసర సమావేశాల కోసం అసెంబ్లీ, హైకోర్టు బెంచ్.. అమరావతిలో హైకోర్టు బెంచ్, అసెంబ్లీ.. కర్నూలులో హైకోర్టు, అప్పిలేట్ బాడీలను ఏర్పాటు చేసుకోవచ్చని సూచించింది. ఇక దీనిపై హైపవర్‌ కమిటీ నివేదిక మాత్రమే మిగిలి ఉంది.

వికేంద్రీకరణపై ఇప్పటికే మనసులో మాట చెప్పిన సీఎం జగన్‌, మరోసారి పరోక్ష వ్యాఖ్యలు చేశారు. గతంలోని అన్యాయాలను సరిదిద్దుతామనీ జగన్‌ చెప్పడం ప్రాధాన్యం సంతరించుకుంది. బీజేపీ మినహా ఈ వికేంద్రీకరణను మిగతా విపక్షాలన్నీ వ్యతిరేకిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో విపక్షాలను వైసీపీ ప్రభుత్వం ఎలా నచ్చజెబుతుందన్నదానిపై టీవీ9 మేనేజింగ్ ఎడిటర్ రజినీకాంత్ ఆధ్వర్యంలో బిగ్‌న్యూస్ బిగ్‌డిబేట్ కార్యక్రమం జరిగింది. దీనిలో వైసీపీ నుంచి ఎమ్మెల్యే ప్రకాశ్ రెడ్డి, టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు, బీజేపీ నుంచి రఘునాథ్ బాబు పాల్గొన్నారు. చర్చ కొనసాగుతున్న వేళ బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ ఇచ్చిన నివేదికపై టీడీపీ నేత అశోక్ బాబు స్పందించారు. జగన్ అనుకున్నట్లుగానే రిపోర్ట్ వచ్చిందని.. ఇలాంటి రిపోర్ట్ వస్తుందని ముందే ఊహించామని అన్నారు. అసలు అమరావతి నుంచి రాజధానిని ఎందుకు మారుస్తున్నారన్నది ప్రభుత్వం.. రైతులకు చెప్పాలని అశోక్ బాబు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన విశాఖ, కర్నూల్ గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మీరే చూడండి.