ప్రభుత్వమే కావాలని కుట్ర చేస్తుంది

అటు ఉద్యమాలు.. ఇటు హైపవర్ కమిటీ భేటీలతో ఏపీలో క్యాపిటల్ ఫీవర్ పీక్‌కు చేరింది. అమరావతి నుంచి రాజధాని తరలింపును వ్యతిరేకిస్తూ అమరావతి రైతులు ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో మంగళవారం రైతుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. వేల ఎకరాల భూమిని రాజధాని కోసం త్యాగం చేస్తే.. ఇపుడు దాన్ని తరలిస్తారా అంటూ రోడ్డెక్కిన రైతన్నలు కనిపించిన ప్రతీ ప్రజాప్రతినిధినీ నిలదీస్తున్నారు. ఇందులో భాగంగా మంగళగిరి దగ్గరలోని హాయ్‌ల్యాండ్ ప్రాంతం మీదుగా వెళుతున్న మాచర్ల […]

ప్రభుత్వమే కావాలని కుట్ర చేస్తుంది
Follow us

| Edited By:

Updated on: Jan 07, 2020 | 11:48 PM

అటు ఉద్యమాలు.. ఇటు హైపవర్ కమిటీ భేటీలతో ఏపీలో క్యాపిటల్ ఫీవర్ పీక్‌కు చేరింది. అమరావతి నుంచి రాజధాని తరలింపును వ్యతిరేకిస్తూ అమరావతి రైతులు ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో మంగళవారం రైతుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. వేల ఎకరాల భూమిని రాజధాని కోసం త్యాగం చేస్తే.. ఇపుడు దాన్ని తరలిస్తారా అంటూ రోడ్డెక్కిన రైతన్నలు కనిపించిన ప్రతీ ప్రజాప్రతినిధినీ నిలదీస్తున్నారు. ఇందులో భాగంగా మంగళగిరి దగ్గరలోని హాయ్‌ల్యాండ్ ప్రాంతం మీదుగా వెళుతున్న మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కారుపై ఆందోళన చేస్తున్న రైతులు దాడికి దిగారు. పిన్నెల్లి కారుపై రాళ్ళు, కర్రలతో దాడి చేశారు.

దీంతో ఈ దాడి రాజకీయ రంగుపులుముకుంది. అదికాస్త పార్టీల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. రైతుల ముసుగులో టీడీపీ రౌడీలు రెచ్చిపోయారంటోంది వైసీపీ. అటు వైసీపీకి కౌంటర్‌ అటాక్ చేస్తూ.. టీడీపీ కూడా మాటల యుద్ధానికి తెరలేపింది. శాంతియుతంగా జరగుతున్న ఉద్యమాన్ని దారిమళ్లించేందుకు.. వైసీపీ ప్రభుత్వం కుట్రలు పన్నుతోందంటోంది.

అమరావతిలో రాజధాని కొనసాగించాలని జరుగుతున్న ఉద్యమంలో.. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కారుపై జరిగిన దాడి.. దాని చుట్టు జరుగుతున్న వివాదం.. దాంట్లో కుట్రలు ఉన్నాయంటూ పరస్పరం ఆరోపించుకుంటున్న తీరుపై టీవీ9 వేదికగా.. ఛానెల్ మేనేజింగ్ ఎడిటర్ రజినీకాంత్ ఆధ్వర్యంలో బిగ్ న్యూస్ బిగ్ డిబేట్ కార్యక్రమం జరిగింది. ఈ డిబేట్‌లో టీడీపీ నుంచి బాబూ రాజేంద్ర ప్రసాద్, సీపీఐ నుంచి రామకృష్ణ, వైసీపీ ఎమ్మెల్యే అమర్ నాథ్, భారతీయ జనతా పార్టీ నుంచి రఘురాం పాల్గొన్నారు. ఈ క్రమంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై జరిగిన దాడి ఘటనపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అవేంటో ఈ వీడియోలో చూడండి.