జో బైడెన్ వైట్ హౌస్ లో కాలు మోపుతారా ?

అమెరికా ఎన్నికల్లో డెమొక్రాట్ అభ్యర్థి జో బైడెన్ వైట్ హౌస్ లో కాలు మోపుతారా ? ప్రపంచ వ్యాప్తంగా కోట్లాదిప్రజలను వేధిస్తున్న మిలియన్ డాలర్ల ప్రశ్న ఇది.. డొనాల్డ్ ట్రంప్ కన్నాబైడెన్  చాలా ఆధిక్యంలో ఉన్నప్పటికీ...

జో బైడెన్ వైట్ హౌస్ లో కాలు మోపుతారా ?
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Nov 07, 2020 | 10:25 AM

అమెరికా ఎన్నికల్లో డెమొక్రాట్ అభ్యర్థి జో బైడెన్ వైట్ హౌస్ లో కాలు మోపుతారా ? ప్రపంచ వ్యాప్తంగా కోట్లాదిప్రజలను వేధిస్తున్న మిలియన్ డాలర్ల ప్రశ్న ఇది.. డొనాల్డ్ ట్రంప్ కన్నాబైడెన్  చాలా ఆధిక్యంలో ఉన్నప్పటికీ… సారుగారు  కోర్టు పేరు చెబుతూ అడ్డుపుల్లలు వేస్తుండడంతో బైడెన్ ఇంకా నేను విజయానికి కాస్తంత దూరంలోనే ఉన్నానని రెండు రోజులుగా చెబుతూ వస్తున్నారు. తను 253 ఎలెక్టోరల్ ఓట్లు సాధించినట్టు బైడెన్ ప్రకటించారు., పెన్సిల్వేనియాలో మరో 20 ఓట్లు పడితే ఇక ఆయన వైట్ హౌస్ కి దారి చూసుకోవచ్ఛు . జార్జియా, ఆరిజోనా, నెవాడా రాష్ట్రాల్లో ట్రంప్ కన్నా జో బైడెన్ స్వల్ప ఆధిక్యంలోకొనసాగుతుండగా.. జార్జియా ఓట్లకు సంబంధించి లెక్కింపు  తుదిదశకు చేరుకోవాలంటే ఈ నెల 20 వరకు ఆగాల్సిందేనని ఓ అధికారి వ్యాఖ్యానించారు. ఇక శుక్రవారం రాత్రి బైడెన్ తన విజయోత్సవ ప్రసంగం చేయాలనుకున్నారు. కానీ ఓట్ల లెక్కింపు ఇంకా కొనసాగుతుండడంతో ఆయన తన యోచన విరమించుకున్నారు. దేశవ్యాప్తంగా ట్రంప్ కన్నా ఆయన 4.1 మిలియన్ ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఏమైనా-ట్రంప్ మాత్రం తన ఓటమిని ఒప్పుకునేలా లేరు.