త‌న‌ బయోపిక్​లో అత‌డే హీరో అంటోన్న‌ భువి…

ప్రస్తుతం అక్క‌డా, ఇక్క‌డా అని తేడా లేదు. అన్నీ ఇండ‌స్ట్రీల‌లోనూ బయోపిక్​ల హవా నడుస్తోంది. ప్రముఖుల జీవితాల్లోని అన్ని కోణాలు తెలుసుకునేందుకు ప్రేక్ష‌కులు ఆస‌క్తి చూపిస్తున్నారు.

త‌న‌ బయోపిక్​లో అత‌డే హీరో అంటోన్న‌ భువి...
Follow us

|

Updated on: Jul 02, 2020 | 3:11 PM

ప్రస్తుతం అక్క‌డా, ఇక్క‌డా అని తేడా లేదు. అన్నీ ఇండ‌స్ట్రీల‌లోనూ బయోపిక్​ల హవా నడుస్తోంది. ప్రముఖుల జీవితాల్లోని అన్ని కోణాలు తెలుసుకునేందుకు ప్రేక్ష‌కులు ఆస‌క్తి చూపిస్తున్నారు. అందుకే బ‌యోపిక్స్ బాక్సాఫీస్ వద్ద కాసులు కురిపిస్తున్నాయి. తాజాగా భార‌త బౌల‌ర్ భువనేశ్వర్​ కుమార్​ కూడా తన బయోపిక్​పై స్పందించాడు.

ఒకవేళ తన లెఫ్ స్టోరీతో మూవీ తీస్తే.. అందులో బాలీవుడ్​ హీరో రాజ్​కుమార్ రావును క‌థానాయ‌కుడిగా పెడితే బాగుంటుందని తన మనసులోని మాట బ‌య‌ట‌కి చెప్పాడు. త‌న‌కు, బాలీవుడ్ హీరో రాజ్​కుమార్​ రావుకు మధ్య పోలికలు ఉన్నాయని చాలామంది చెప్పార‌ని, అందుకే త‌న బయోపిక్​లో అతడు నటిస్తే బాగుంటుందని భువనేశ్వర్ కుమార్ అభిప్రాయ‌ప‌డ్డాడు. ప్రస్తుతం క‌రోనా కారణంగా ఇంటికే పరిమితమైన భువనేశ్వర్ ఫ్యామిలీతో సరదాగా గడుపుతున్నాడు.

Bhuvneshwar Kumar: I want Rajkummar Rao to play my role in my biopic