బాలయ్యతో జత కట్టనున్న టాలీవుడ్ మిస్సమ్మ.. !

Bhumika Chawla in Nandamuri Balakrishna film, బాలయ్యతో జత కట్టనున్న  టాలీవుడ్ మిస్సమ్మ.. !

నందమూరి నటసింహం బాలకృష్ణతో టాలీవుడ్ మిస్సమ్మ భూమిక జతకట్టబోతుంది. పంజాబీ ఫ్యామిలో పుట్టి తెలుగు సినిమా ఆడియన్స్‌కి బాగా కనెక్ట్ అయిన భూమిక.. ఇంతకాలానికి బాలయ్య సరసన నటించనుంది. పవన్ కళ్యాణ్‌తో చేసిన ఖుషీ మూవీ ఆమె కెరీర్‌లో పెద్ద టర్నింగ్ పాయింట్. తర్వాత మహేష్‌బాబుతో ఒక్కడు.. జూనియర్ ఎన్టీయార్‌తో సింహాద్రి సినిమాల్లో నటించి.. గ్లామర్ ప్రపంచంలో గట్టిగా నిలబడింది భూమిక. తర్వాత గ్లామర్ పాత్రలకు ఫుల్‌స్టాప్ పడిపోయింది. ధోని బయోపిక్‌లో హీరో చెల్లి క్యారెక్టర్‌లో భూమిక నిటించి మెప్పించింది. తర్వాత తెలుగులో ఎమ్‌సీఏతో మళ్లీ రీఎంట్రీ ఇచ్చింది. ఇందులో నానీకి వదిన పాత్రలో బాగా ఇమిడిపోయింది.

భూమిక చావ్లా సెకెండ్ ఇన్నింగ్స్‌లో పెద్ద ఊపయితే కనిపించలేదు. యూటర్న్ మూవీతో సమంతాతో కలిసి నటించినా చెప్పుకోదగ్గ రికగ్నైజేషన్ రాలేదు. ఏదైనా పెద్ద సినిమాలో కీ రోల్ దక్కకపోతుందా అని చూస్తున్న భూమిక ఇప్పడు బాలయ్య మూవీలో ఛాన్స్ దక్కించుకోవడం ఇంట్రస్టింగ్ పాయింటే మరి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *