Breaking News
  • అనంతపురం: ఎస్‌ఆర్‌ఎస్‌ ట్రావెల్స్‌ నిర్వాకం. పెనుకొండ దగ్గర నిలిచిపోయిన ఎస్‌ఆర్‌ఎస్‌ ట్రావెల్స్‌ బస్సు. రాత్రి నుంచి బస్సులోనే ప్రయాణికుల పడిగాపులు. బస్సును రోడ్డుపై వదిలి పరారైన డ్రైవర్‌, క్లీనర్‌. బెంగళూరు నుంచి హైదరాబాద్‌ వెళ్తున్న బస్సు. మార్గం మధ్యలో బస్సుకు ఆరుసార్లు మరమ్మతులు. పట్టించుకోని ఎస్‌ఆర్‌ఎస్‌ ట్రావెల్స్‌ యాజమాన్యం. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చూపాలంటున్న ప్రయాణికులు.
  • చెన్నై ఐఐటీలో మరో వివాదం. ప్రాజెక్ట్ మేనేజర్‌ బెనర్జీపై విద్యార్థినుల ఫిర్యాదు. మొబైల్‌ఫోన్‌తో బాత్‌రూమ్‌లో వీడియోలు తీస్తున్నాడని ఆరోపణ. పోలీసులకు ఫిర్యాదు చేసిన విద్యార్థినులు. బెనర్జీ ఫోన్‌ను ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపిన పోలీసులు. కేసునమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు.
  • నెల్లూరు: మర్రిపాడు మండలం అల్లంపాడులో ముగ్గురు అరెస్ట్‌. గుప్తనిధులు తవ్వకాలు చేస్తున్నారన్న అనుమానంతో అరెస్ట్‌. పరారీలో మరో ఇద్దరు, కారు స్వాధీనం.
  • ప్రధాని అధ్యక్షతన 2016లో జరిగిన సమావేశంలో.. అన్నిరాష్ట్రాల్లో టెలీహెల్త్‌ సర్వీస్‌ ప్రారంభించాలని ఆదేశించారు. ఏపీ కార్మికశాఖ ఆధ్వర్యంలో ఈఎస్‌ఐ అధికారులతో సమావేశం నిర్వహించాం. తెలంగాణలో అమలులో ఉన్నందున అదే విధానాన్ని అమలు చేయమని చెప్పా. తెలంగాణ ఈఎస్‌ఐ అధికారులు టెలీ హెల్త్ సర్వీస్‌తో.. ఎంవోయూ చేసుకోమనడంతో నేను లెటర్‌ రాశా. నామినేషన్‌ పద్ధతిలో కాకుండా టెండర్ల పద్ధతి ద్వారా.. మందులు కొనుగోలు చేయాలని మంత్రిగా ఆదేశించా-అచ్చెన్నాయుడు.
  • కార్మికుల సొమ్ముదోచుకున్న అచ్చెన్నాయుడును వెంటనే అరెస్ట్‌ చేయాలి. ఈఎస్‌ఐ కుంభకోణాన్ని వెలికి తీయాలి-వైసీపీటీయూసీ నేత గౌతమ్‌రెడ్డి. ఇందులో ఎవరెవరు భాగస్వాములో కూడా వెల్లడించాలి. అచ్చెన్నాయుడును అన్ని వాస్తవాలు బయటకు వస్తాయి-గౌతమ్‌రెడ్డి.

భూమా వారసుడెవరు ? ఫ్యామిలీలో రచ్చకిదేనా కారణం ?

political heir row in bhuma family, భూమా వారసుడెవరు ? ఫ్యామిలీలో రచ్చకిదేనా కారణం ?

రాయలసీమను భూమా నాగిరెడ్డి ఫ్యామిలీని వేరువేరుగా చూడలేం. సీమ పాలిటిక్స్‌పై అంతగా చెరగని ముద్ర వేసిన ఫ్యామిలీ అది. కానీ ఫ్యామిలీలో ఇద్దరి హఠాన్మరణం ఇప్పుడు కుటుంబంలో కొత్త చిచ్చు రేపినట్లుంది. 2014 ఎన్నికల సందర్భంలో మాజీ మంత్రి భూమా శోభానాగిరెడ్డి రోడ్డు ప్రమాదంలో మరణించడం.. ఆ తర్వాత నాలుగేళ్ళకు భూమా నాగిరెడ్డి గుండెపోటుతో హఠాన్మరణం పాలవడం భూమా ఫ్యామిలీని అఘాధంలోకి నెట్టేసింది. దానికి తోడు వైసీపీ, టిడిపి అంటూ తరచూ పార్టీలు మారడం భూమా ఫ్యామిలీ ప్రాభవం కోల్పోవడానికి కారణమైంది.

వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఫ్యామిలీతో వియ్యమందిన భూమా ఫ్యామిలీ అప్పట్లో వైసీపీవైపునకు మొగ్గు చూపింది. ఆ తర్వాత అఖిలప్రియ విడాకుల పర్వం తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరడంతోపాటు ఏకంగా ఏపీ మంత్రివర్గంలో చోటు కూడా సంపాదించారు. నాగిరెడ్డి మరణం తర్వాత ఉప ఎన్నికల్లో ఎవరు బరిలోకి దిగాలన్న అంశంపై తీవ్రస్థాయిలో చర్చ జరిగింది. అయితే ఇప్పుడు పరిస్థితి మారింది.

నాగిరెడ్డి మరణం తర్వాత అఖిలప్రియ సెంట్రిక్‌గా భూమా ఫ్యామిలీ పాలిటిక్స్ నడిచినా.. ఇప్పుడు మరో ఇంటి కోడలైన భూమా అఖిలప్రియ… భూమా ఫ్యామిలీ తరపున రాజకీయ వారసురాలు ఎలా అవుతుందన్న ప్రశ్నలు ఫ్యామిలీ నుంచి గట్టిగానే వినిపిస్తున్నాయి. దానికి తోడు అఖిలప్రియ భర్త భార్గవరామ్ వ్యవహార శైలి.. ఆయనపై నమోదైన కేసులు.. ఇలా పలు అంశాలు అఖిలప్రియకు ఇబ్బందికరంగా మారిన సంకేతాలు కనిపిస్తున్నాయి.

political heir row in bhuma family, భూమా వారసుడెవరు ? ఫ్యామిలీలో రచ్చకిదేనా కారణం ?

మంత్రిగా వున్నప్పుడు తన సొంత అనుచరుల ఇళ్ళపై పోలీసులు పలు దఫాలుగా కార్డన్ సెర్చులు నిర్వహించడం.. కొందరిపై పిడి యాక్టు ప్రకారం కేసులు నమోదు చేయడంతో అసహనానికి గురైన అఖిల ప్రియ అప్పట్లో మంత్రిగా తనకు రక్షణ కల్పించిన గన్ మెన్‌లను తిప్పి పంపింది. దాంతో కర్నూలు జిల్లా ఎస్పీకి… అఖిలప్రియకు మధ్య వార్ మొదలైంది. ఆ తర్వాత ప్రభుత్వం మారిన నేపథ్యంలో ఎస్పీ ఉద్దేశపూర్వకంగానే తనపైనా.. తన భర్తపైనా కేసులు నమోదు చేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారని అఖిలప్రియ ఆరోపిస్తున్నారు. అందుకే బెయిల్ దొరికినప్పటికీ భార్గవ్ రామ్ ఇంకా రహస్య జీవితమే గడుపుతున్నారని సమాచారం.

ఇదేసమయంలో ముసురుకున్న వివాదాలు.. జరుగుతున్న రచ్చ అసలు భూమా వారసులెవరు ? అన్న చర్చకు తెరలేపింది. భూమా ఫ్యామిలీలో వున్న మిగిలినవారంతా మరో ఇంటి కోడలైన అఖిలప్రియ భూమా ఫ్యామిలీకి రాజకీయ వారసురాలెలా అవుతుందని ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలోనే తెరమీదికి నాగిరెడ్డి కుమారుడు భూమా జగత్ విఖ్యాత రెడ్డి వచ్చారు. ప్రత్యక్ష రాజకీయాలకు తాను సిద్దమని ప్రకటించారు. అదే సమయంలో అఖిలప్రియకు తనకు వారసత్వ పోరు లేదని.. అలాంటి విభేదాలు తనకు, తన సోదరికి మధ్య తీసుకురావద్దని ఆల్ మోస్ట్‌ మీడియాకు వార్నింగిచ్చారు జగత్ విఖ్యాత్ రెడ్డి.

political heir row in bhuma family, భూమా వారసుడెవరు ? ఫ్యామిలీలో రచ్చకిదేనా కారణం ?

ఈ క్రమంలో భూమా ఫ్యామిలీలో రగులుతున్న చిచ్చు ఏ దిశకు మళ్ళుతుందీ అన్నది ఆసక్తికరంగా మారింది. టిడిపి అధినేత చంద్రబాబు సైతం ఆళ్ళగడ్డ రాజకీయాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. సరైన సమయంలో జోక్యానికి బాబు యాక్షన్ ప్లాన్ సిద్దం చేసినట్లు విశ్వసనీయ సమాచారం.

Related Tags