జైల్లోనే ఉంటారో.. బయటికొస్తారో..! భూమా అఖిలప్రియ బెయిల్ పిటిషన్‌పై తేలిది నేడే !

బోయిన్‌ పల్లి కిడ్నాప్‌ వ్యవహారంలో మాజీ మంత్రి అఖిల ప్రియ బెయిల్‌ వ్యవహారంపై సస్పెన్స్‌ కొనసాగుతూనే ఉంది. బుధవారం బెయిల్‌ పిటిషన్‌పై సికింద్రబాద్‌ సెషన్‌ కోర్టులో విచారణ..

జైల్లోనే ఉంటారో.. బయటికొస్తారో..! భూమా అఖిలప్రియ బెయిల్ పిటిషన్‌పై తేలిది నేడే !
Follow us

|

Updated on: Jan 21, 2021 | 6:15 AM

Bhuma Akhilapriya’s Bail Petition :  బోయిన్‌ పల్లి కిడ్నాప్‌ వ్యవహారంలో మాజీ మంత్రి అఖిల ప్రియ బెయిల్‌ వ్యవహారంపై సస్పెన్స్‌ కొనసాగుతూనే ఉంది. బుధవారం బెయిల్‌ పిటిషన్‌పై సికింద్రబాద్‌ సెషన్‌ కోర్టులో విచారణ జరగాల్సి ఉండగా.. కోర్టు విచారణను గురువారంకు  వాయిదా వేసింది. దీంతో అఖిల ప్రియ బెయిల్‌ విషయంపై సస్పెన్స్‌ ఇంకా వీడలేదు. ఇదిలా ఉంటే.. తన ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా అఖిల ప్రియ దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌ను కోర్టు ఇప్పటికే రెండు సార్లు కొట్టేసిన విషయం తెలిసిందే. అఖిల ప్రియ బయటకొస్తే సాక్షులను బెదిరించవచ్చని పోలీసులు వేసిన పిటిషన్‌తో ఏకీభవించిన కోర్టు అఖిల ప్రియ బెయిల్‌కు నిరాకరించింది.

అదనపు సెక్షన్లతో అఖిలప్రియ అండ్‌కో చుట్టూ ఉచ్చు మరింత బిగిసింది. బెయిల్‌ ఇస్తే సాక్ష్యాలు తారుమారవుతాయంటున్న పోలీసులు…కేసులో నిందితుల ప్రమేయంపై మరిన్ని ఆధారాలు సేకరించే పన్లో ఉన్నారు. బోయిన్‌పల్లి కిడ్నాప్‌ కేసులో మరో ఇద్దరు నిందితులను కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు. ఇదివరకే ఏవన్‌ అఖిలప్రియను మూడు రోజులపాటు విచారించిన పోలీసులు…తాజాగా అఖిలప్రియ పీఏ మల్లిఖార్జున్‌రెడ్డితో పాటు సంపత్‌లను కస్టడీలోకి తీసుకున్నారు.

మల్లికార్జున్‌రెడ్డి కేసులో కీలకంగా భావిస్తున్నారు పోలీసులు. బోయినపల్లిలో నవీన్‌రావుతో డాక్యుమెంట్‌పై సంతకం పెట్టించింది మల్లికార్జున్‌రెడ్డే. కస్టడీలోకి తీసుకున్న సమయంలో అఖిలప్రియ విచారణకు సహకరించకపోవటంతో ఈ ఇద్దరినుంచీ వివరాలు రాబట్టేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. చంచలగూడ జైలు నుంచి మూడురోజుల కస్టడీకి తీసుకున్న మల్లికార్జున్‌రెడ్డి, సంపత్‌లపై ప్రశ్నలవర్షం కురిపించారు పోలీసులు. గురువారం ఈ ఇద్దరు నిందితులతో సీన్‌ రీ కన్‌స్ర్టక్షన్‌ చేయనున్నారు.

మరోవైపు విచారణ మొత్తం వీడియో రికార్డ్‌ చేయిస్తున్నారు. మరోవైపు ఇప్పటికే కిడ్నాప్‌ కేసులో అఖిలప్రియ దంపతుల ప్రమేయంపై పక్కా ఆధారాలు ఉన్నాయని, వారికి బెయిల్‌ ఇవ్వొద్దని పోలీసులు కౌంటర్‌ దాఖలు చేశారు. వారికి బెయిల్‌ ఇవ్వొద్దని కోర్టుని కోరారు పోలీసులు. కిడ్నాప్‌ కేసులో పోలీసులు అఖిలప్రియ సహా 19 మందిపై కేసు నమోదుచేశారు.