ప్రధాని మోదీ చేతుల మీదుగా.. తొలి ‘వెండి’ శ్రీరామ ఇటుక

అయోధ్య రామాలయం భూమి పూజకు ప్రధాని మోడీ రానున్నారు. ఆయన చేతులు మీదుగా రాముడి గుడికి శంకుస్థాపన జరగనుంది. ఆగస్టు 5వ తేదీన భూమి పూజా కార్యక్రమం ఉంటుందని శ్రీ రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు...

ప్రధాని మోదీ చేతుల మీదుగా.. తొలి 'వెండి' శ్రీరామ ఇటుక
Follow us

|

Updated on: Jul 20, 2020 | 2:52 PM

అయోధ్య రామాలయం భూమి పూజకు ప్రధాని మోడీ రానున్నారు. ఆయన చేతులు మీదుగా రాముడి గుడికి శంకుస్థాపన జరగనుంది. ఆగస్టు 5వ తేదీన భూమి పూజా కార్యక్రమం ఉంటుందని శ్రీ రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే భూమి పూజ సందర్భంగా ప్రధాని మోడీ ప్రత్యేక పూజలు నిర్వహించి.. తొలి శ్రీరామ ఇటుకను అక్కడ పేర్చనున్నారు.

రామాలయం భూమి పూజలో మొత్తం ఐదు వెండి ఇటుకలను ఏర్పాటు చేయనున్నారు. తొలి 40 కిలోల వెండి ఇటుకను మోడీ పేర్చ‌నున్నారు. హిందూ పురాణాల ప్ర‌కారం.. అయిదు గ్ర‌హాల‌కు సూచ‌కంగా అయిదు వెండి ఇటుక‌ల‌ను వాడ‌నున్నారు.

విశ్వ‌హిందూ ప‌రిష‌త్‌ ఇచ్చిన డిజైన్ ప్ర‌కార‌మే ఆల‌యాన్ని నిర్మిస్తున్నారు. విష్ణు ఆల‌యం శైలిలో ఆల‌యాన్ని రూపొందించారు. అష్ట‌భుజ ఆకారంలో గ‌ర్భాల‌యం ఉండనుంది. గ‌తంలో ఇచ్చిన మోడ‌ల్ క‌న్నా.. ఇప్పుడు శ్రీరామాలయం ఎత్తు, వైశాల్యం, పొడుగును కొంత పెంచారు. ముందుగా అనుకున్న మూడు గోపురాల స్థానంలో.. అయిదు గోపురాల‌ను ఏర్పాటు చేయనున్నారు. ఆల‌య విస్తీర్ణం సుమారు 76 వేల చ‌ద‌ర‌పు గ‌జాల నుంచి 84వేల చ‌ద‌ర‌పు గ‌జాలు ఉంటుంది. గతంలో కేవ‌లం 38వేల చ‌ద‌ర‌పు గ‌జాల విస్తీర్ణంలో ఆల‌యాన్ని నిర్మించాల‌నుకున్నారు. అయితే భక్తుల తాకిడి ఎక్కువగా ఉండనుండటంతోపాటు ఇప్పుడు బాలరాముడు ఎక్కడైతే పూజలు అందుకుంటున్నాడో అక్కడి నుంచే ఆలయం మొదలు కానుంది.

మోకాళ్ల మధ్య దిండు పెట్టుకుని పడుకుంటున్నారా.. ఈ విషయాలు మీకోసమే!
మోకాళ్ల మధ్య దిండు పెట్టుకుని పడుకుంటున్నారా.. ఈ విషయాలు మీకోసమే!
యూత్‌ని చెవిటివారిగా చేసిన డీజే సౌండ్.. పలువురిపై కేసు నమోదు
యూత్‌ని చెవిటివారిగా చేసిన డీజే సౌండ్.. పలువురిపై కేసు నమోదు
మిర్చిబండి వద్ద స్నాక్స్‌ తిని యూపీఐ చెల్లింపు చేసిన కేంద్రమంత్రి
మిర్చిబండి వద్ద స్నాక్స్‌ తిని యూపీఐ చెల్లింపు చేసిన కేంద్రమంత్రి
కాలేజ్ ఫెస్ట్‏లో సాయి పల్లవి మాస్ డాన్స్.
కాలేజ్ ఫెస్ట్‏లో సాయి పల్లవి మాస్ డాన్స్.
నయా ట్రెండ్ సినిమాటిక్ యూనివర్స్.. ఆ బాటలో ఎవరున్నారంటే.?
నయా ట్రెండ్ సినిమాటిక్ యూనివర్స్.. ఆ బాటలో ఎవరున్నారంటే.?
ఈ ఆప్టికల్ ఇల్యూషన్‌లో 264 నెంబర్‌ని కనిపెట్టండి చూద్దాం..
ఈ ఆప్టికల్ ఇల్యూషన్‌లో 264 నెంబర్‌ని కనిపెట్టండి చూద్దాం..
వ్యాపారం మీ లక్ష్యం అయితే.. పెట్టుబడి ప్రభుత్వమే ఇస్తుంది.. అదెలా
వ్యాపారం మీ లక్ష్యం అయితే.. పెట్టుబడి ప్రభుత్వమే ఇస్తుంది.. అదెలా
కేసీఆర్ ఇంటి పక్కనే క్షుద్రపూజలు.. రాత్రివేళ ఏం జరిగింది..?
కేసీఆర్ ఇంటి పక్కనే క్షుద్రపూజలు.. రాత్రివేళ ఏం జరిగింది..?
గుండెపోటుకు చెక్‌ పెట్టి రక్త ప్రసరణను మెరుగుపరిచే ఆహారాలు
గుండెపోటుకు చెక్‌ పెట్టి రక్త ప్రసరణను మెరుగుపరిచే ఆహారాలు
అనుకూలంగా శుక్ర గ్రహం.. ఈ రాశులకు చెందిన మహిళలకు మహా యోగాలు!
అనుకూలంగా శుక్ర గ్రహం.. ఈ రాశులకు చెందిన మహిళలకు మహా యోగాలు!