సినీ నటికి బలవంతంగా విడాకులు.. పోలీసులకు ఫిర్యాదు

Bhojpuri actress complains against hasbad for divocing her through stamp paper, సినీ నటికి బలవంతంగా విడాకులు.. పోలీసులకు ఫిర్యాదు

తన భర్త తనకు బలవంతంగా విడాకులిచ్చాడని ఆవేదన వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది ఓ సినీ నటి.  భోజ్‌పురి సినిమాల్లో హీరోయిన్‌గా మంచిపేరున్న  అలీనా షేక్‌ను ఆమె భర్త ముదస్సిర్ బేగ్ 2016లో వివాహమాడాడు. కాగా రెండు నెలల క్రితం అలీనా, బేగ్ దంపతులకు ఒక బాబు కూడా జన్మించాడు. అప్పటినుంచి తన భర్త ఇంటికి తిరిగి రాలేదని, భర్త అదృశ్యంపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్టుగా చెప్పుకొచ్చింది అలీనా. అయితే ఆయన క్షేమంగానే ఉన్నారని, అయితే పదిరోజుల క్రితం తనకు స్టాంప్ పేపర్లపై సంతకాలు చేయించుకుని  బేగ్ విడాకులు ఇచ్చినట్టుగా తన ఫిర్యాదులో పేర్కొంది. ఈ పరిస్థితిలో అత్తింటివారు తనపై దాడిచేశారని ఆరోపించింది.

అలీనా ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇరువురికీ కౌన్సిలింగ్ ఇస్తామని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *