Bhogi Celebrations : ఊరూరా, వాడ.. భోగభాగ్యాల భోగి మంటలు..సందడిగా మారిన తెలుగు లోగిళ్లు

భోగి.. భోగభాగ్యాల పర్వదినం. కొత్త వెలుగులు, కొత్త ఆనందాలు ప్రతి ఇంటా నిండాలని కోరుకుంటూ ఊరూరా, వాడ వాడల్లో జనం జనం భోగి మంటలు..

Bhogi Celebrations : ఊరూరా, వాడ.. భోగభాగ్యాల భోగి మంటలు..సందడిగా మారిన తెలుగు లోగిళ్లు
Follow us

|

Updated on: Jan 13, 2021 | 10:42 AM

Bhogi Celebrations : భోగి.. భోగభాగ్యాల పర్వదినం. కొత్త వెలుగులు, కొత్త ఆనందాలు ప్రతి ఇంటా నిండాలని కోరుకుంటూ ఊరూరా, వాడ వాడల్లో జనం జనం భోగి మంటలు వేశారు. మూలనున్న పాత వస్తువుల్ని భోగి మంటల్లో వేసి నూతన జీవితానికి స్వాగతం పలుకుతున్నారు. భోగి సందర్భంగా తెల్లవారు జామునే భోగి మంటలు వేశారు. పిల్లలు, పెద్దలు సంతోషంగా భోగి మంటల్లో పాత వస్తువులు వేసి నూతన ఇకపై అందరి జీవితాల్లో నూతన వెలుగులు నింపాలని కోరుకున్నారు. పాతదనం పోయి కొత్తదనం వస్తుందని సూర్యుడు మకర రాశిలో ప్రవేశించే సమయానికి భోగిని జరుపుకుంటారు. వేర్వేరు ప్రాంతాల్లో ఉద్యోగాలు చేసుకుంటున్న వాళ్లు , చదువుల కోసం విదేశాల్లో ఉంటున్న వారు సైతం సొంత ఊరికి వచ్చి పండుగ జరుపుకుంటున్నారు.

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు భోగి వేడుకల్ని జరుపుకున్నారు. సంక్రాంతి ఉత్సవాల్లో భాగంగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సతీమేతంగా గోవా రాజ్‌భవన్‌లో భోగి మంటలు వేసి వాటి చుట్టూ ప్రదక్షిణలు చేశారు. ఈ సంక్రాంతి నుంచి దేశ ప్రజలందరికి అంతా మంచి జరగాలాని వెంకయ్యనాయుడు కాంక్షించారు.

ఏపీలోని సంక్రాంతి సంబురాలు అంబరాన్ని అంటుతున్నాయి. తెల్లవారుజాము నుంచే అందరు భోగి వేడుకలు జరుపుకుంటున్నారు. కృష్ణా జిల్లా కంచికచర్లలో భోగి పండుగ కార్యక్రమాన్నికి టీడీపీ అధినేత నారా చంద్రబాబు హాజరయ్యారు. స్థానిక మహిళలతో కలిసి భోగి మంటలు వెలిగించారు. ఈ సంక్రాంతి నుంచి అందరికి మంచి జరగాలని చంద్రబాబు ఆకాంక్షించారు. తెలుగు ప్రజలందరికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.

నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా సంక్రాంతి పండుగను కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకుంటున్నారు. చిత్తూరు జిల్లా నగరిలోని తన ఇంటి దగ్గర భోగి మంటలు వేసారు. రాష్ట్ర ప్రజలంతా సుఖ, సంతోషాలతో గడపాలాని కోరారు. అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు రోజా. రైతులకు మంచి చేస్తున్న ప్రభుత్వంపై చంద్రబాబు పండుగ పూట కూడా విమర్శలు చేయడం ఆయన దిగజారుడు తనానికి నిదర్శనమన్నారు రోజా.

చిత్తూరు జిల్లాలో భోగి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. రంగంపేటలో మోహన్‌బాబు ఫ్యామిలీ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సంక్రాంతి నుంచి అందరికి జీవితాలు మెరుగుపడాలని మోహన్‌బాబు కోరారు.

ఇవి కూడా చూడండి :

కోడి పందేలకు సై అంటున్న ఉభయగోదావరి జిల్లాలు.. బరులు సిద్ధం చేస్తున్న పందెంరాయుళ్లు వేట మొదలైంది.. పులి రావడమే ఆలస్యం.. బెబ్బులిని బంధించేందుకు రెడీ అంటున్న ఫారెస్ట్ అధికారులు Sehwag Funny Comment : ఆస్ట్రేలియా వెళ్లేందుకు నేను రెడీ.. సెహ్వాగ్ బాబా మళ్లీ పేల్చాడు..