Breaking News
  • భద్రాద్రి: పాల్వంచ, బూర్గంపాడు మండలాల్లో భూప్రకంపనలు. టీచర్స్‌కాలనీ, బొడ్డుగూడెం, గట్టాయిగూడెం కాలనీల్లో భూప్రకంపనలు. అంజనాపురం, లక్ష్మీపురం, టేకులచెరువులో భూప్రకంపనలు. భయాందోళనలో స్థానికులు.
  • హైదరాబాద్‌: నగరంలో మంత్రి తలసాని పర్యటన. నిర్విరామంగా విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ్య కార్మికులు.. పోలీసులు, వైద్య సిబ్బందికి గులాబీ పూలు ఇచ్చి అభినందించిన తలసాని. ఎనర్జీ డ్రింక్‌, మంచినీళ్లు, శానిటైజర్లు అందజేసిన మంత్రి తలసాని. రోడ్లపైనే విధులు నిర్వహిస్తున్న సిబ్బందిని కలుసుకుంటూ.. హైదరాబాద్‌లో పర్యటిస్తున్న మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌.
  • కరోనా వైరస్‌ను ఏపీ ప్రభుత్వం లైట్‌గా తీసుకుంటుంది. విపత్తు సాయం, నిత్యావసర సరుకుల పంపిణీని.. రాజకీయ ప్రచారం కోసం వాడుకుంటున్నారు-విష్ణువర్ధన్‌రెడ్డి. వైసీపీ నేతలకు సహకరిస్తున్న అధికారులను తొలగించాలి. ఏపీలో కరోనా కేసులు పెరగడానికి కారణం అంజాద్‌బాషా, ముస్తాఫానే. తక్షణమే అంజాద్‌బాషా తన పదవికి రాజీనామా చేయాలి -ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి.c
  • కరోనాపై మనమంతా కలిసికట్టుగా పోరాటాన్ని కొనసాగిద్దాం. రా.9 గంటలకు దీపాలు వెలిగించి కరోనా చీకట్లను పారద్రోలడంతో పాటు.. భారతీయులమంతా ఏకతాటిపైకి వచ్చి పోరాటం చేస్తున్నామని చాటిచెబుదాం. ఈ ప్రయత్నం ద్వారా కరోనాపై పోరాటాన్ని ముందుండి నడిపిస్తున్న.. వైద్యులు, పారిశుద్ధ్య సిబ్బందికి సంఘీభావాన్ని తెలుపుదాం. వ్యక్తిగత శుభ్రత, సామాజిక దూరాన్ని పాటిస్తూ.. కరోనాపై పోరాటాన్ని ఇదే స్ఫూర్తితో కొనసాగిద్దాం -ట్విట్టర్‌లో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు.
  • రైతు చెంతకే వెళ్లి ధాన్యాన్ని కొనుగోలు చేస్తాం-కన్నబాబు. గ్రామ సచివాలయ వాలంటీర్లకు సమాచారం ఇస్తే.. ధాన్యం, మొక్కజొన్న కొనుగోలు చేస్తాం-మంత్రి కన్నబాబు. టమోటా, అరటిని మార్కెటింగ్‌ ద్వారా కొనుగోలు చేస్తున్నాం. ధర పడిపోయిన చోట్ల ప్రభుత్వమే కొనుగోలు చేయాలని సీఎం ఆదేశించారు. మామిడి ధరలు పడిపోకుండా చూడాలని అధికారులను ఆదేశించాం. పంట దిగుబడుల క్యాలెండర్‌ను రూపొందిస్తున్నాం-మంత్రి కన్నబాబు. టీడీపీ నేతలు కరోనాను కూడా రాజయకీయంగా వాడుకుంటున్నారు. ఇప్పటికైనా చౌకబారు విమర్శలు మానుకోండి-మంత్రి కన్నబాబు.

మహారాష్ట్రలో ఉద్దవ్ సర్కార్ దిగివచ్చినట్టే(నా) ?

Bhima Koregaon Case Not Handed Over To NIA, మహారాష్ట్రలో ఉద్దవ్ సర్కార్ దిగివచ్చినట్టే(నా) ?

రెండు కేసుల విషయంలో మహారాష్ట్రలోని మూడు పార్టీల కూటమితో ఏర్పడిన ఉధ్ధవ్ థాక్రే ప్రభుత్వం.. భాగస్వామ్య పార్టీలతో తలెత్తిన విభేదాలను పరిష్కరించుకునే ప్రయత్నంలో పడింది. భీమా కోరేగావ్, ఎల్గార్ పరిషద్ కేసులు రెండూ వేర్వేరని, ‘భీమా కేసును’ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజన్సీకి అప్పగించే ప్రసక్తి లేదని సీఎం, శివసేన అధినేత ఉధ్ధవ్ థాక్రే మంగళవారం ప్రకటించారు. ముఖ్యంగా ఎల్గార్ పరిషద్ కేసును ఈ దర్యాప్తు సంస్థకు అప్పగించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని కాంగ్రెస్, ఎన్సీపీ తీవ్రంగా వ్యతిరేకించిన విషయం తెలిసిందే.

ఈ ప్రతిపాదనను ఎంతమాత్రం అంగీకరించబోమని ఎన్సీపీ  సీనియర్ నేత శరద్ పవార్ సోమవారం స్పష్టం చేశారు. దీనిపై తమ పార్టీ నేతలతో చర్చించి భవిష్యత్ కార్యాచరణను నిర్ణయిస్తామని  ఆయన చెప్పారు. ఈ సరికొత్త పరిణామంతో ఖంగు తిన్న ఉధ్ధవ్ థాక్రే.. తమ కూటమిలోని భాగస్వామ్య పార్టీలతో కలిసి వెళ్లాలనే నిశ్ఛయించుకున్నట్టు  కనబడుతోంది. భీమా-కోరేగావ్ కేసు దళితులకు సంబంధించినదని, ఈ రాష్ట్రంలోని దళితులకు అన్యాయం జరగకూడదని భావించే తాను ఎన్ ఐ ఏ కి అప్పగించకూడదని నిర్ణయం తీసుకున్నానని ఉధ్ధవ్ తెలిపారు. ‘భీమా కేసును’ దర్యాప్తు చేసేందుకు సిట్ ను ఏర్పాటు చేస్తామని ఎన్సీపీ నేత, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి నవాబ్ మాలిక్ ప్రకటించారు. దీంతో తెగేదాకా లాగడమెందుకని ఉధ్ధవ్ నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఇటీవల ఎల్గార్ పరిషద్ కేసును పూణే కోర్టు.. ముంబైలోని స్పెషల్ ఎన్‌ఐ‌ఏ కోర్టుకు బదలాయించింది.

సీఏఏ, ఎన్‌పీ‌ఆర్‌లకు శివసేన మద్దతు

వివాదాస్పదమైన సీఏఏ, ఎన్‌పీ‌ఆర్‌లకు శివసేన మద్దతు ఉంటుందని ఈ పార్టీ అధినేత ఉధ్ధవ్ థాక్రే ప్రకటించారు. సీఏఏ వల్ల ముప్పు లేదని ప్రకటించిన ఆయన.. రాష్ట్రంలో ఎన్‌పీ‌ఆర్‌ను అమలు చేస్తామని చెప్పారు. సీఏఏ అమలైనా ఎవరూ ఆందోళన చెందవలసిన అవసరం లేదన్నారు. ఇలా ఉండగా.. ఈ చట్టాల విషయంలో శివసేనను తాము ఒప్పిస్తామని ఎన్సీపీ నేత శరద్ పవార్ వెల్లడించారు. సీఏఏ, ఎన్నార్సీ, ఎన్‌పీ‌ఆర్‌లను తాము వ్యతిరేకిస్తున్న విషయం ఉధ్ధవ్ థాక్రేకి తెలుసునన్నారు.

 

 

 

 

Related Tags