ఉన్నతాధికారుల వేధింపులు.. బీహెచ్ఈఎల్ ఉద్యోగిని ఆత్మహత్య

కాలేజీల్లోనే కాదు.. ఉద్యోగాలు చేసే చోట కూడా మహిళలపై వేధింపులు ఆగడం లేదు. ఉన్నతాధికారులు చేస్తున్న వేధింపులతో అమాయక మహిళలు ఎవరికీ చెప్పుకోలేక ప్రాణాలు విడుస్తున్నారు. ఈ సమస్య చిన్న స్థాయి ఉద్యోగినుల నుంచి ఉన్నత స్థాయి ఉద్యోగినుల వరకు ఎదుర్కొంటున్నారు. తాజాగా హైదరాబాద్‌లోని బీహెచ్ఈఎల్‌కి చెందిన ఉద్యోగిని నేహ ఆత్మహత్య కలకలం రేపుతోంది. ఆఫీస్‌లో తన ఉన్నతాధికారుల వేధింపులు భరించలేక ఫ్యాన్‌కు ఉరివేసుకుని తన ప్రాణాలను విడిచింది. ఈ ఘటన మియాపూర్ బీహెచ్‌ఈఎల్ కాలనీలో చోటు […]

  • Tv9 Telugu
  • Publish Date - 10:43 am, Fri, 18 October 19

కాలేజీల్లోనే కాదు.. ఉద్యోగాలు చేసే చోట కూడా మహిళలపై వేధింపులు ఆగడం లేదు. ఉన్నతాధికారులు చేస్తున్న వేధింపులతో అమాయక మహిళలు ఎవరికీ చెప్పుకోలేక ప్రాణాలు విడుస్తున్నారు. ఈ సమస్య చిన్న స్థాయి ఉద్యోగినుల నుంచి ఉన్నత స్థాయి ఉద్యోగినుల వరకు ఎదుర్కొంటున్నారు. తాజాగా హైదరాబాద్‌లోని బీహెచ్ఈఎల్‌కి చెందిన ఉద్యోగిని నేహ ఆత్మహత్య కలకలం రేపుతోంది. ఆఫీస్‌లో తన ఉన్నతాధికారుల వేధింపులు భరించలేక ఫ్యాన్‌కు ఉరివేసుకుని తన ప్రాణాలను విడిచింది. ఈ ఘటన మియాపూర్ బీహెచ్‌ఈఎల్ కాలనీలో చోటు చేసుకుంది. ఆత్మహత్యకు ముందు తనను వేధింపులకు గురి చేసిన ఉన్నతాధికారి, తోటి ఉద్యోగుల పేర్లను సూసైడ్ నోట్‌లో పేర్కొంది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజస్థాన్‌కు చెందిన నేహా చౌక్సే అనే మహిళ.. హైదరాబాద్‌లోని బీహెచ్ఈఎల్‌ అకౌంట్స్ విభాగంలో పని చేస్తోంది. ఇటీవల 6 నెలల కిందటే బదిలీపై భూపాల్ నుండి బదిలీపై హైదరాబాద్‌ నగరానికి వచ్చింది. అయితే గత కొద్ది రోజులు తనను ఆఫీసులోని పై స్థాయి అధికారు వేధింపులకు పాల్పుడుతున్నారని.. సూసైడ్ లేఖ రాసి.. ఇంట్లోని ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఉన్నతాధికారి (డీజీఎం) కిషోర్ తనను వేధించాడంటూ సూసైడ్ లేఖలో పేర్కొంది. అంతేకాదు మరో 10మంది సహచర ఉద్యోగుల పేర్లు కూడా లేఖలో పేర్కొంది. గతంలో భూపాల్‌లో పనిచేస్తున్న సమయంలో కూడా కొందరు ఇబ్బందులకు గురిచేశారంటూ లేఖలో రాసింది. నేహ భర్త ఇచ్చిన పిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సూసైడ్ లేఖ ఆధారంగా దర్యాప్తు చేపడుతున్నారు. తన భార్యను వేధింపులకు గురిచేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.