Breaking News
  • చిత్తూరు: మదనపల్లెలో మహిళా సంఘాల ఆందోళన. నిందితుడిని ఉరి తీయాలంటూ చిన్నారి వర్షిత తల్లిదండ్రుల ధర్నా. తమకు న్యాయం చేయాలంటున్న వర్షిత తల్లిదండ్రులు. రఫీని బహిరంగంగా ఉరి తీయాలని డిమాండ్. విద్యుత్‌ టవర్‌ ఎక్కిన వర్షిత కుటుంబ సభ్యులు. కిందకు దించేందుకు పోలీసుల ప్రయత్నాలు.
  • వివాదంలో జార్జిరెడ్డి సినిమా. ఏబీవీపీ విద్యార్థులను రౌడీలుగా చూపెట్టే కుట్ర జరుగుతోందని ఆరోపణ. సినిమాలో జార్జిరెడ్డి రౌడీయిజాన్ని చూపెట్టాలన్న ఏబీవీపీ. ఇప్పటికే ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌కు అనుమతి నిరాకరించిన పోలీసులు. ఈ నెల 22న విడుదల కానున్న జార్జిరెడ్డి.
  • వరంగల్‌: ఏనుమాముల మార్కెట్ యార్ట్‌లో పత్తి కొనుగోళ్లు ప్రారంభం. ప్రభుత్వ హామీతో తిరిగి కొనుగోళ్లు ప్రారంభించిన కాటన్ వ్యాపారులు.
  • ఢిల్లీ చేరుకున్న ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌. సా.4గంటలకు సోనియాతో భేటీ కానున్న శరద్‌పవార్‌. మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు, ఉమ్మడి కార్యాచరణపై చర్చ.
  • హైదరాబాద్‌: హైకోర్టులో అగ్రిగోల్డ్ కేసు విచారణ. తాకట్టు పెట్టిన అగ్రిగోల్డ్ ఆస్తులను వేలం వేసిన బ్యాంకర్లు. సంవత్సరం గడిచినా కొనుగోలుదారులకు అందని కన్‌ఫర్మేషన్‌ ఆర్డర్. కన్‌ఫర్మేషన్‌ ఇవ్వాలని కోరిన బ్యాంకర్లు. డిసెంబర్‌ 5న మరోసారి విచారిస్తామన్న హైకోర్టు. తదుపరి విచారణ డిసెంబర్‌ 5కు వాయిదా.
  • లోక్‌సభలో కొనసాగుతున్న ప్రశ్నోత్తరాలు. ప్రాంతీయ భాషా పరిరక్షణపై కేశినేని నాని ప్రశ్న. త్రిభాషా విధానాన్ని అమలు చేయాలి-కేశినేని నాని. ప్రాంతీయ భాషలను రక్షించాల్సిన అవసరం ఉంది-కేశినేని నాని. పలు అంశాలపై చర్చకు పట్టుబడుతున్న విపక్షాలు. విపక్ష సభ్యుల నినాదాల మధ్య కొనసాగుతున్న సభ. తెలుగు భాష ఉన్నతికి చర్యలు తీసుకుంటున్నాం-మంత్రి పోఖ్రియాల్‌.
  • ఆగ్రా జిల్లా పేరు మార్చే యోచనలో యూపీ సర్కార్. ఆగ్రా పేరును ఆగ్రావన్‌గా మార్చాలని యూపీ సర్కార్‌ యోచన. కాషాయికరణలో భాగంగా పేరు మారుస్తున్నారని విపక్షాల విమర్శలు. గతంలో ఫైజాబాద్‌ను అయోధ్యగా.. అలహాబాద్‌ను ప్రయాగ్‌రాజ్‌గా మార్చిన యూపీ సర్కార్.

పానీపూరీ..ఆటో ఇండస్ట్రీ.. నిర్మల వ్యాఖ్యలపై సెటైర్లు !

Nirmala SitaRamman

దేశంలో ఆటోమొబైల్ రంగం తీవ్ర సంక్షోభంలో పడిందని, టూ , ఫోర్ వీలర్ల అమ్మకాలు విపరీతంగా తగ్గిపోయాయని ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం మీడియా సమావేశంలో పేర్కొన్న సంగతి తెలిసిందే. ఇందుకు 1980. 90, 2000 సంవత్సరాల్లో పుట్టిన ఈ దేశంలోని ‘ యంగ్ ఎడల్ట్ యువత ‘ తమ పర్సనల్ వెహికల్ కొనడానికి నెలవారీ ఈ ఎం ఐ చెల్లించే బదులు.. ఓలా , ఉబెర్ వంటి క్యాబ్ సర్వీసులను ఆశ్రయించడమే కారణమని ఆమె వ్యాఖ్యానించారు. అంటే వారి మైండ్ సెట్ మారడమేనన్నారు. ఏది..ఏమైనా ఆటోమొబైల్ రంగానికి తలెత్తిన సంక్షోభ పరిష్కారానికి కేంద్రం ప్రయత్నిస్తుందని ఆమె చెప్పారు. అయితే ఈ ‘ నవతరం యువత ‘ అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. ఈ యువత ‘ పానీపూరీ ‘ ని ప్రిఫర్ చేస్తోందని, అందువల్లే వారిని ‘ బాయ్ కాట్ ‘ చేయాలని నెటిజన్లు వ్యంగ్య ‘ బాణాలు ‘ విసురుతున్నారు.
‘ ఈ యువత ఉదయంపూట ఎక్కువగా ఆక్సిజన్ పీలుస్తుంటారు కనుక ఆక్సిజన్ సంక్షోభం తలెత్తుతుందని ‘ ఒకరంటే.. ‘ వీళ్ళు పానీపూరీయే కావాలంటారని, ఈ కారణంగానే బీ హెచ్ ఈ ఎల్ పరిస్థితి ఈ 15 ఏళ్లలో దిగజారిపోయిందని ‘ మరొకరు పేర్కొన్నారు. అలాగే… ‘ రొట్టె, పప్పు బదులుగా వీరు పిజ్జాను ప్రిఫర్ చేయడం వల్లే వ్యవసాయోత్పత్తులు తగ్గిపోతున్నాయని ‘ ఇంకొక నెటిజనుడు వ్యాఖ్యానించాడు.
ఇక కాంగ్రెస్ పార్టీ ఇదే అదనని నిర్మలా సీతారామన్ పై విరుచుకుపడింది. తనవంతు సెటైర్లు వేసింది. అసలు ఆటోమొబైల్ రంగం ఇంత సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి బీజేపీయే కారణమని ఆరోపించింది.’ మీరు చెబుతున్నది నిజమే ! నవ యువతను.. అంటే ఓటర్లను మీరు తప్పు పట్టండి.. అందరినీ బ్లేమ్ చేయండి.. కానీ మీ పార్టీ (బీజేపీ) ఈ రంగాన్ని ఎలా హ్యాండిల్ చేస్తోందో అన్నదాన్ని మాత్రం తప్పు పట్టకండి ‘ అని కాంగ్రెస్ నేత అభిషేక్ మను సింఘ్వి ట్వీట్ చేశారు. బస్సులు, ట్రక్కుల అమ్మకాలు కూడా తగ్గాయంటే.. ఈ వాహనాలను వినియోగించే యువత వీటిని కొనడాన్ని ఆపేశారా అని వ్యంగ్యంగా ఆయన ప్రశ్నించారు. ఇలాంటి పరిస్థితుల్లో దేశ ఎకానమీని 5 ట్రిలియన్ డాలర్ల స్థాయికి ఎలా చేరుస్తారని కూడా ఆయన ట్వీటించారు.