Breaking News
  • రాష్ట్రాలు, జిల్లాల సరిహద్దులు తప్పనిసరిగా మూసివేయాలన్న కేంద్రం. సరుకు రవాణా మినహా ఎలాంటి రవాణాకు అనుమతి నిరాకరణ. కలెక్టర్లు, ఎస్పీలే బాధ్యత వహించాలన్న కేంద్రం. వలస కూలీలకు 14 రోజుల క్వారంటైన్‌. అద్దె డిమాండ్‌ చేసే ఇంటి యజమానులపై కఠిన చర్యలు. లాక్‌డౌన్‌ను మరింత కఠినం చేయాలని కేంద్రం ఆదేశాలు.
  • ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌. ప్రపంచవ్యాప్తంగా 7 లక్షలు దాటిన కరోనా పాజిటివ్‌ కేసులు. 7,21,412కు చేరిన కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య. ఇప్పటివరకు కోలుకున్న 1,51,004 మంది. ప్రపంచ వ్యాప్తంగా 33,956 మంది మృతి. స్పెయిన్‌లో నిన్న ఒక్కరోజే 838 మంది మృతి. నిన్న ఇటలీలో 756 మంది, ఫ్రాన్స్‌లో 292 మంది మృతి. నిన్న అమెరికాలో 237 మంది, బ్రిటన్‌లో 209 మంది మృతి. నిన్న ఒక్కరోజే అమెరికాలో కొత్తగా 17,600 కేసులు నమోదు. అమెరికాలో 1,41,812 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు. ఇటలీలో లక్షకు చేరువలో కరోనా బాధితుల సంఖ్య. చైనా-3,300, ఇరాన్‌-2,640, ఫ్రాన్స్‌-2,606 మంది మృతి. అమెరికా-2,475, ఇంగ్లాండ్‌-1,228 మంది మృతి.
  • కరోనాపై పోరుకు ఏపీ ఐఏఎస్‌ అధికారుల ఆర్థిక చేయూత. మూడు రోజుల జీతాన్ని సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు ఇవ్వాలని.. ఐఏఎస్‌ అధికారుల సంఘం నిర్ణయం.
  • ఛత్తీస్‌గఢ్‌: కాంగ్రెస్‌ ఎమ్మెల్యే శైలేష్‌ పాండేపై కేసు నమోదు. బిలాస్‌పూర్‌లో 144 సెక్షన్‌ ఉల్లంఘించారని ఎమ్మెల్యేపై కేసు నమోదు.
  • ఢిల్లీ ప్రభుత్వంలోని ఇద్దరు సీనియర్‌ అధికారుల సస్పెన్షన్‌. మరో ఇద్దరు అధికారులకు షోకాజ్‌ నోటీసులు జారీ చేసిన కేంద్రహోంశాఖ. కరోనా నివారణపై నిర్లక్ష్యం వహించినందుకు కేంద్రం చర్యలు.

Bheeshma Twitter Review : ‘భీష్మ’ ట్విట్టర్ రివ్యూ : నితిన్ మళ్లీ హిట్ ట్రాక్‌లోకి వచ్చాడు..!

Nithiin Rashmika Mandanna Starrer Bheeshma Audience Response And Public Talk, Bheeshma Twitter Review : ‘భీష్మ’ ట్విట్టర్ రివ్యూ : నితిన్ మళ్లీ హిట్ ట్రాక్‌లోకి వచ్చాడు..!

Bheeshma Twitter Review : ప్లాపుల పరంపర కొనసాగిస్తోన్న యంగ్ హీరో నితిన్ ప్రస్తుతం హిట్టు కోసం తెగ ట్రై చేస్తున్నాడు. డిఫరెంట్ కాంబోలు ట్రై చేస్తున్నాడు. ‘అ..ఆ’ హిట్టు తర్వాత ‘లై’, ‘ఛల్ మోహన్ రంగ’, ‘శ్రీనివాస కళ్యాణం’తో హ్యాట్రిక్ ప్లాపులు పడ్డాయి ఈ హీరోకి. ప్రస్తుతం ఇతగాడికి కమర్షియల్ హిట్ అత్యంత అవసరం. ఈ సమయంలో ఇటీవలే ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చి.. ‘ఛలో’తో హిట్ అందుకున్న త్రివిక్రమ్ శిష్యుడు వెంకి కుడుములతో జత కట్టాడు నితిన్. మరి వెంకి..నితిన్ పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టాడా..?. నితిన్ ఫ్యాన్స్ కాలర్ ఎగరేయబోతున్నారా..?. ‘భీష్మ’ నితిన్ మూవీ కెరీర్‌ను రీ ట్రాక్‌లోకి తీసుకురాబోతుందా..?.  నేడు(శుక్రవారం) రిలీజైన ఈ మూవీ రిపోర్ట్స్ ఎలా ఉన్నాయో ఓ లుక్ వేద్దాం.

నితిన్‌కి జోడిగా భీష్మ సినిమాలో రష్మిక మందన్న జోడి కట్టింది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు. టీజర్, ట్రైలర్ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేశాయి. ప్రి రిలీజ్ ఈవెంట్‌కు త్రివిక్రమ్ చీఫ్ గెస్ట్‌గా రావడంతో పాజిటివిటీ బాగా పెరిగింది. కాగా ఇప్పటికే యూఎస్‌లో ప్రీమియర్స్ కంప్లీట్ అయ్యాయి. అక్కడ నుంచి పాజిటీవ్ రిపోర్ట్స్ అందుతున్నాయి. కామెడీతో పాటు మెసేజ్ జోడించి వెంకీ కొత్త ప్రయత్నం చేసినట్టు తెలుస్తోంది. కొందరు నెటిజన్లు ట్విట్టర్ ద్వారా తమ ఒపెనియన్ వెల్లిబుచ్చుతున్నారు. ఇంటర్వెట్ ట్విస్ట్‌తో పాటు.. నితిన్, రష్మికల కెమిస్ట్రీలు మంచి ప్లస్ పాయింట్స్‌గా నిలిచాయట. సినిమాని ఎక్కడా బోర్ కొట్టించకుండా సేఫ్‌గా డ్రైవ్ చేసుకుంటూ వెళ్లాడట డైరెక్టర్. వెన్నెల కిశోర్, రఘుబాబు కామెడి సీన్లు కూడా అలరిస్తాయట. అగ్రికల్చర్ అందరికి కనెక్ట్ అయ్యే అంశం కావడంతో..అందుకు సంబంధించిన మెసేజ్ కూడా వర్కవుట్ అయినట్టు తెలుస్తోంది. మొత్తానికి ట్విట్టర్ రివ్యూస్ చూస్తుంటే..మూవీ హిట్టు కొట్టినట్టే కనిపిస్తోంది. లెట్స్ వెయిట్ అండ్ సి.

Related Tags