లష్కర్ బోనాల కీలక ఘట్టం..‘భవిష్యవాణి’నోట.. కరోనా నివారణ మాట

తెలంగాణలో అత్యంత ప్రముఖ్యతతో కూడుకున్న పండగ లష్కర్ బోనాలు. ప్రతి ఏడాది సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారి బోనాల జాతరను అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఈ యేడు భవిష్యవాణిలో స్వర్ణలత కొన్ని కీలక విషయాలు చెప్పారు.

లష్కర్ బోనాల కీలక ఘట్టం..‘భవిష్యవాణి’నోట.. కరోనా నివారణ మాట
Follow us

|

Updated on: Jul 13, 2020 | 2:14 PM

తెలంగాణలో అత్యంత ప్రముఖ్యతతో కూడుకున్న పండగ లష్కర్ బోనాలు. ప్రతి ఏడాది సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారి బోనాల జాతరను అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. కానీ, ఈ యేడు కరోనా కాటుతో ఉత్సవాలు కళతప్పాయి. నగర వీధుల్లో ఎక్కడా అమ్మవారి ఊరేగింపులు, ఘటాలు లేకుండా నిర్మానుష్యంగా దర్శనమిచ్చింది.

ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా విజృంభిస్తున్ననేపథ్యంలో ఈ ఏడాది బోనాల వేడుక భక్తుల సందడి లేక బోసిపోయింది. భక్తులు ఇళ్లలోనే అమ్మవారిని పూజించుకుని బోనాలు సమర్పించుకున్నారు. ఇక మహంకాళి బోనాల జాతరలో కీలక ఘట్టంగా చెప్పుకునే రంగం భవిష్యవాణి కార్యక్రమం సోమవారం ఉదయం జరిగింది. భవిష్యవాణిలో స్వర్ణలత కొన్ని కీలక విషయాలు చెప్పారు. ఇక భవిష్యవాణిలో స్వర్ణలత ఏం చెబుతారో తెలుసుకునేందుకు రాష్ట్ర వ్యాప్తంగా భక్తులు, నగర ప్రజలు ఆసక్తి చూపారు.

సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి బోనాల సందర్భంగా.. రంగం కార్యక్రమంలో స్వర్ణలత పచ్చికుండపై నిలబడి భవిష్యవాణి వినిపించారు. రాబోయే రోజుల్లో మరిన్ని కష్టాలు తప్పవని, ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ఎవరు చేసుకున్న దానికి వాళ్లు అనుభవించక తప్పదు అని అన్నారు. ఈ యేడు నాకు సంతోషంగా లేదన్నారు. ఐదు వారాలు తప్పనిసరిగా సాకలు పోసి యజ్ఞహోమాలు చేయాలని ఆజ్ఞాపించారు. మహమ్మారిని తప్పకుండా తొలగిస్తానని భవిష్యవాణిలో స్వర్ణలత చెప్పారు.