భట్టి దీక్ష విరమణ.. నిమ్మరసం అందించిన ఉత్తమ్

batti vikramarka called off protest, భట్టి దీక్ష విరమణ.. నిమ్మరసం అందించిన ఉత్తమ్

కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత మల్లు భట్టి విక్రమార్క దీక్ష విరమించారు. కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆదేశాలతో ఆయన తన దీక్షను విరమించారు. టీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయనకు నిమ్స్‌లో నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. అంతకుముందు ఈ తెల్లవారు జామున 5 గంటలకు దీక్ష భగ్నం చేసిన పోలీసులు.. ఆయన్ను నిమ్స్‌కు తరలించారు. టీఆర్ఎస్‌లో సీఎల్పీని విలీనం చేయడాన్ని నిరసిస్తూ మూడురోజులుగా దీక్ష కొనసాగించారు భట్టి.

ఇందిరా పార్క్ ధర్నాచౌక్‌లో ఆయన శనివారం నుంచి నిరవధిక నిరసన దీక్షకు దిగారు. భట్టికి టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కుంతియా, టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం సహా పలువురు సంఘీభావం తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *