పాకిస్థాన్‌తో భారత్ నీటి యుద్ధం

న్యూఢిల్లీ: పుల్వామాలో జరిగిన ఉగ్రదాడి రెండు దేశఆల మధ్య ఉన్న వైరాన్ని మరింత రెట్టింపు చేసింది. ఇప్పటికే దాయాదులుగా ఉన్న ఈరెండు దేశాల మధ్య పుల్వామా దాడి అగ్నికి ఆజ్యం పోసింది. ఉగ్రదాడిలో 40 మంది జవాన్లు అమరులు కావడంతో దేశం యావత్తు కన్నీరు పెట్టింది. అమరులైన సైనికులకు నివాళులర్పించింది. మరోపక్క అదే స్థాయిలో పాకిస్థాన్‌పై కోపం తారాస్థాయికి చేరింది. దీంతో పాకిస్థాన్‌తో ఉన్న సంబంధాలను ఒక్కొక్కటిగా భారత్ వదులుకుంటోంది. తాజాగా పాకిస్థాన్‌పై వాటర్ యుద్ధాన్ని ప్రకటించింది. […]

  • Vijay K
  • Publish Date - 7:57 pm, Thu, 21 February 19

న్యూఢిల్లీ: పుల్వామాలో జరిగిన ఉగ్రదాడి రెండు దేశఆల మధ్య ఉన్న వైరాన్ని మరింత రెట్టింపు చేసింది. ఇప్పటికే దాయాదులుగా ఉన్న ఈరెండు దేశాల మధ్య పుల్వామా దాడి అగ్నికి ఆజ్యం పోసింది. ఉగ్రదాడిలో 40 మంది జవాన్లు అమరులు కావడంతో దేశం యావత్తు కన్నీరు పెట్టింది. అమరులైన సైనికులకు నివాళులర్పించింది. మరోపక్క అదే స్థాయిలో పాకిస్థాన్‌పై కోపం తారాస్థాయికి చేరింది. దీంతో పాకిస్థాన్‌తో ఉన్న సంబంధాలను ఒక్కొక్కటిగా భారత్ వదులుకుంటోంది.

తాజాగా పాకిస్థాన్‌పై వాటర్ యుద్ధాన్ని ప్రకటించింది. పాకిస్థాన్‌కు వెళ్లే సింధు జలాలను మళ్లించింది. ఆ నీటిని కశ్మీర్, పంజాబ్ వైపు పంపించింది. సట్లేజ్, బియాస్ నదీ జలాలను కూడా భారత్ మళ్లించింది. ఈ మేరకు ప్రధాని మోడీ నిర్ణయం తీసుకున్నారని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. అయితే ఈ నిర్ణయం పాకిస్థాన్‌పై తీవ్ర ప్రభావం చూపనుంది.