Covaxin Vaccine evacuation : దేశవ్యాప్తంగా కరోనా టీకా పంపిణీకి రెడీ.. ఢీల్లీ చేరిన భారత్ బయోటెక్ వారి కొవాగ్జిన్..

భారత్‌ బయోటెక్‌ కంపెనీ తయారు చేసిన కొవిడ్‌ వ్యాక్సిన్‌ తరలింపు మొదలైంది.

Covaxin Vaccine evacuation : దేశవ్యాప్తంగా కరోనా టీకా పంపిణీకి రెడీ.. ఢీల్లీ చేరిన భారత్ బయోటెక్ వారి కొవాగ్జిన్..
Follow us

|

Updated on: Jan 13, 2021 | 2:11 PM

తొలి స్వదేశీ వ్యాక్సిన్ కొవాగ్జిన్ హైదరాబాద్‌లో అభివృద్ధి కావడంతో.. ప్రపంచవ్యాప్తంగా మన నగరం పేరు మార్మోగిపోతోంది. ఇప్పటికే మన దేశంలో కొవాగ్జిన్ వినియోగానికి డీసీజీఐ షరతులతో అనుమతులు ఇచ్చింది. దీంతో భారత్‌ బయోటెక్‌ కంపెనీ తయారు చేసిన కొవిడ్‌ వ్యాక్సిన్‌ తరలింపు మొదలైంది. కొవాగ్జిన్‌ను వ్యాక్సిన్‌ను బుధవారం శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి అధికారులు దేశ రాజధాని ఢిల్లీకి తరలించారు. అలాగే దేశంలోని వివిధ ప్రాంతాలకు వ్యాక్సిన్‌ను తరలించారు.

మరోవైపు, దేశవ్యాప్తంగా ఈ నెల 16నుంచి మెగా వ్యాక్సినేషన్ ప్రక్రియ చేపట్టాలని కేంద్రం నిర్ణయించింది. మొదటి విడతలో ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌లో భాగంగా ఆరోగ్య సిబ్బందితో పాటు వృద్ధులకు టీకా ఇవ్వనున్నారు. ఇందుకోసం డీసీజీఐ ద్వారా అత్యవసర వినియోగానికి అనుమతి పొందిన భారత్‌ బయోటెక్‌ ‘కొవాగ్జిన్’‌, సీరం ఇనిస్టిట్యూట్‌ ‘కొవిషీల్డ్‌’కు కేంద్రం ఆర్డర్‌ ఇచ్చింది.

భారత్ బయోటెక్ 55 లక్షల కోవాగ్జిన్ మోతాదులను సరఫరా చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. 38.5 లక్షల మోతాదుకు రూ .295 చొప్పున చెల్లించేలా మిగిలిన 16.5 లక్షలు ఉచితంగా సరఫరా చేయడానికి భారత బయోటెక్ కేంద్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం కోవాగ్జిన్ మొదటి సరుకును ఎయిర్ ఇండియా ఫ్లైట్ AI 559 నుండి విమానంలో పంపించారు. రవాణాలో 80.5 కిలోల బరవు ఉన్న 20,000 మోతాదులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. యి. దేశ రాజధాని ఢిల్లీకి 35 బాక్స్‌ల కొవాగ్జిన్.. అక్కడి నుంచి దేశంలోని 11 గమ్యస్థానాలకు పంపించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఢిల్లీతో పాటు చెన్నై, బెంగళూరు, జైపూర్, విజయవాడ, గౌహతి, లక్నో, కురుక్షేత్ర, పూణేతో సహా 11 గమ్యస్థానాలకు సగటున 26 కిలోల బరువున్న 35 బాక్సుల జిఎంఆర్ హైదరాబాద్ ఎయిర్ కార్గో కోవాగ్జిన్ రవాణా చేసినట్లు జిఎంఆర్ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం అధికారులు తెలిపారు.కార్గో ఉష్ణోగ్రత 2-8 డిగ్రీల సెల్సియస్ మధ్య వ్యాక్సిన్లను తరలిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

అలాగే, గురువారం నాటికి సీరం ఇనిస్టిట్యూట్‌ 1.1కోట్ల డోసులు, భారత్‌ బయోటెక్‌ 55లక్షల డోసులను అందించనున్నాయి. ఇప్పటికే సీరం ఇనిస్టిట్యూట్‌ నుంచి దేశవ్యాప్తంగా 13 నగరాలకు 54.72లక్షల డోసులను కేంద్రం తరలించింది. ఢిల్లీ, అహ్మదాబాద్‌, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, కర్నాల్‌, హైదరాబాద్‌, విజయవాడ, గౌహతి, లక్నో, చండీగఢ్‌, భువనేశ్వర్‌కు చేరగా.. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు పంపిణీ కేంద్రాలకు వ్యాక్సిన్‌ను తరలిస్తున్నారు. ఇప్పటికే అధికారులు టీకాల పంపిణీకి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశారు.

Read Also… National Coronavirus Updates : దేశవ్యాప్తంగా కొనసాగుతున్న కరోనా తీవ్రత.. కొత్తగా 15,968 మందికి కోవిడ్ పాజిటివ్

దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?