రైతు సంఘాల పోరు.. నవంబర్ 5న భారత్ బంద్..

ఇటీవలే కేంద్ర ప్రభుత్వం వ్యవసాయానికి సంబంధించిన కొత్తగా మూడు వ్యవసాయ చట్టాలను అమల్లోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అవి రైతు ప్రయోజనాలకు

  • Ravi Kiran
  • Publish Date - 3:34 pm, Tue, 27 October 20
New Agriculture Bills

New Agriculture Bills: ఇటీవలే కేంద్ర ప్రభుత్వం వ్యవసాయానికి సంబంధించిన కొత్తగా మూడు వ్యవసాయ చట్టాలను అమల్లోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అవి రైతు ప్రయోజనాలకు విరుద్ధమని గత కొన్ని రోజులుగా రైతు సంఘాలు ఆందోళనలను చేపట్టాయి. హర్యానా, పంజాబ్‌, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, కర్ణాటక సహా పలు రాష్ట్రాల్లో కేంద్ర వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు నిరసన చేస్తున్నారు.

ఈ క్రమంలోనే భారతీయ కిసాన్ యూనిట్ కేంద్రం తీరుకు నిరసనగా నవంబర్ 5వ తేదీన భారత్ బంద్‌కు పిలుపునిచ్చింది. మోదీ సర్కార్ తీరుకు నిరసనగా చేపట్టే ఈ బంద్‌ను విజయవంతం చేసేందుకు కృషి చేస్తామని.. ప్రజలంతా తమకు మద్దతు ఇవ్వాలని ఆ యూనియన్ కోరింది. అలాగే బంద్‌కు సన్నాహంగా త్వరలోనే 250 రైతు సంఘాలతో సమావేశం ఉంటుందని తెలిపింది.

Also Read:

ప్రభుత్వ ఉద్యోగులకు తీపికబురు.. డీఏల చెల్లింపుకు గ్రీన్ సిగ్నల్..

లాక్‌డౌన్‌లో బ్యాంకు ఈఎంఐలు చెల్లించారా? అయితే క్యాష్‌బ్యాక్‌ మీ సొంతం!