Breaking News
  • అన్ని రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు. నగరాల ప్రజలు బయటకు వెళ్లకుండా కట్టడి చేయాలి. వలస కూలీలకు వసతులు, సకాలంలో వేతనాలు చెల్లించేలా చూడాలి. విద్యార్థులు, కార్మికులను ఖాళీ చేయాలని కోరినవారిపై చర్యలు-కేంద్రం.
  • దేశవ్యాప్తంగా ఆల్కహాల్‌ విత్‌డ్రాల్‌ సిండ్రోమ్‌ . కేరళలో మద్యానికి బానిసై ఆరుగురు ఆత్మహత్య. ఆల్కహాల్‌ లేదన్న బాధతో షేవింగ్‌ లోషన్‌ తాగిన ఓ వ్యక్తి. తెలంగాణలో మద్యం దొరకడంలేదని ప్రాణం తీసుకున్న ఓ వ్యక్తి. తెలంగాణలో కల్లు దొరకక ఓ వ్యక్తి వింత ప్రవర్తన. ట్రాన్స్‌ఫార్మర్‌ను పట్టుకోవడంతో మృతి.v
  • తూ.గో: ఉ.6 నుంచి 10 వరకు నిత్యావసరాల కొనుగోలుకు అనుమతి. జిల్లాలో ఐదు ఐసోలేషన్‌ పడకలు సిద్ధం-మంత్రి పిల్లి సుభాష్‌. 15 వేల మంది ఉండేలా క్వారంటైన్‌ కేంద్రాలు. అక్వా రైతులను అన్ని విధాలా ఆదుకుంటాం-మంత్రి పిల్లి సుభాష్‌.
  • ప్రధాని మోదీకి రాహుల్‌ లేఖ. మన దేశం పెద్ద సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ప్రభుత్వ చర్యలకు సహకరించడానికి సిద్ధం-రాహుల్‌. లక్షల సంఖ్యలో రోజువారీ కూలీలు ఉన్నారు. లాక్‌డౌన్‌తో చాలామంది ప్రజలు చనిపోయే పరిస్థితి. లక్షలాది మంది యువత సొంత గ్రామాలకు వెళ్తున్నారు. వారిలో కరోనా ఉంటే తల్లిదండ్రులు, వృద్ధులకు సోకే అవకాశం. కొత్త ఆస్పత్రుల నిర్మాణం వెంటనే చేపట్టాలి-రాహుల్‌.
  • స్పైస్‌ జెట్‌ పైలట్‌కు కరోనా పాజిటివ్‌. మార్చి 21న చెన్నై నుంచి ఢిల్లీకి విమానాన్ని నడిపిన పైలట్‌. స్వీయ నిర్బంధంలోనే పైలట్‌.

విడాకుల బాటలో సల్మాన్ ఖాన్ హీరోయిన్..

సినీ జీవుల పెళ్లిళ్లు సినీమా వివాహాలుగానే మిగిలిపోతున్నాయి… ఎంతో అన్యోన్యంగా కనిపించే బాలీవుడ్ జంటలు ఆకస్మికంగా విడాకులు తీసుకుంటూ అభిమానులకు షాక్ ఇస్తున్నారు.. తాజాగా మరో బాలీవుడ్ నటి కూడా తన వైవాహిక జీవితం బ్రేకప్ అయింది..అంటూ ప్రకటించింది.
bhagyashree separated husband himalaya, విడాకుల బాటలో సల్మాన్ ఖాన్ హీరోయిన్..

సినీ జీవుల పెళ్లిళ్లు సినీమా వివాహాలుగానే మిగిలిపోతున్నాయి… ఎంతో అన్యోన్యంగా కనిపించే బాలీవుడ్ జంటలు ఆకస్మికంగా విడాకులు తీసుకుంటూ అభిమానులకు షాక్ ఇస్తున్నారు.. బాలీవుడ్‌ నటి, రచయిత్రి, దర్శకురాలు కొంకణా సేన్‌ శర్మ ఆమె భర్త రణ్‌వీర్‌ షోరే విడాకులకు అప్లై చేశారు. 5 సంవత్సరాలుగా విడివిడిగా ఉంటున్న ఈ జంట పరస్పర అంగీకారం మేరకు విడిపోవాలని నిశ్చయించుకున్నారు. తాజాగా మరో బాలీవుడ్ నటి భాగ్యశ్రీ కూడా తన వైవాహిక జీవితం బ్రేకప్ అయింది..

‘కబూతర్‌ జా..జా..జా..’ అంటూ…‘మైనే ప్యార్‌ కియా’ వంటి ఎవర్‌గ్రీన్ క్లాసిక్ మూవీతో బాలీవుడ్‌లో హీరోయిన్‌‌గా ఎంట్రీ ఇచ్చింది భాగ్యశ్రీ. ఈ సినిమా తో కుర్రాళ్లకు కంటికిమీద కునుకు లేకుండా చేసిన భాగ్యశ్రీ, 1990లో వ్యాపారవేత్త హిమాలయా దస్సానీని వివాహం చేసుకుంది. ఆ తర్వాత అడపాదడపా చిత్రాల్లో మాత్రమే ఆమె నటించింది. తెలుగులో నందమూరి బాలకృష్ణ సరసన ‘యువరత్న రాణా’ సినిమాలో నటించింది. భాగ్యశ్రీ తెలుగులో చేసిన ఏకైక చిత్రం ఇదే. ఇక భర్తే తన లోకమనుకుని సినిమా ప్రపంచంవైపు కన్నెత్తి కూడా చూడలేదామె. అయితే తాజాగా భర్త నుంచి విడిపోయినట్లు ప్రకటించడం విశేషం.

‘అవును, నాకు తొలిసారిగా ప్రేమ పుట్టింది హిమాలయా పైనే. అతణ్ణే పెళ్లాడాను కూడా. కానీ ఒకానొక సందర్భంలో మేం విడిపోవాల్సిన పరిస్థితి ఎదురైంది. అప్పుడు నా మనసు కుంగిపోయింది. అంటే నా జీవితంలో అతనికి ఇంక చోటు లేదా? నేను మరొకరిని పెళ్లి చేసుకోవాల్సిందేనా? అని ఊహించుకుంటే చాలు.. ఇప్పటికీ భయంతో వెన్నులో వణుకుపుడుతోంది.. ఎందుకంటే, మేం విడిపోయి ఏడాదిన్నర కాలం గడిచిపోయింది’ అని ఆమె చెప్పుకొచ్చింది. భాగ్యశ్రీకి కూతురు, కొడుకు ఉన్నారు. కొడుకు అభిమన్యు దస్సానీ గతేడాది ‘మర్ద్ కో దర్ద్ నహీ హోతా’ చిత్రంతో కథానాయకుడిగా హిందీ చిత్రపరిశ్రమకు పరిచయమయ్యాడు. కాగా, భాగ్యశ్రీ తన రెండో ఇన్నింగ్స్ ను టాలీవుడ్ మూవీ తో ప్రారంభిస్తున్న విషయం తెలిసిందే. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న సినిమాలో ప్రభాస్ తల్లిగా కనిపించనుంది భాగ్యశ్రీ..

Related Tags