భద్రాద్రిలో ఉత్తర ద్వార దర్శనం..భారీగా ఏర్పాట్లు

వైకుంఠ ఏకాదశి ఉత్సవాలకు భద్రాద్రి ముస్తాభవుతోంది. ఈనెల 27 నుంచి జనవరి 16 వరకు భద్రాచలం సీతారామ చంద్రస్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఆలయ ఈవో, వేదపండితులు దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డిని ఆహ్వానించారు. మంత్రిని కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు. అనంతరం మంత్రి వైకుంఠ ఏకాదశి పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు మాట్లాడుతూ… భద్రాద్రి ముక్కోటి ఉత్సవాల్లో స్వామి వారు రోజుకో అవతారంలో దర్శనమిస్తారని తెలిపారు. జనవరి […]

భద్రాద్రిలో ఉత్తర ద్వార దర్శనం..భారీగా ఏర్పాట్లు
Follow us

|

Updated on: Dec 23, 2019 | 3:22 PM

వైకుంఠ ఏకాదశి ఉత్సవాలకు భద్రాద్రి ముస్తాభవుతోంది. ఈనెల 27 నుంచి జనవరి 16 వరకు భద్రాచలం సీతారామ చంద్రస్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఆలయ ఈవో, వేదపండితులు దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డిని ఆహ్వానించారు. మంత్రిని కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు. అనంతరం మంత్రి వైకుంఠ ఏకాదశి పోస్టర్లను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు మాట్లాడుతూ… భద్రాద్రి ముక్కోటి ఉత్సవాల్లో స్వామి వారు రోజుకో అవతారంలో దర్శనమిస్తారని తెలిపారు. జనవరి 5న తెప్పోత్సవం, 6న ఉత్తర ద్వార దర్శనం ఉంటుందని తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో నర్సింలు, వేద పండితులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. మరోవైపు ముక్కోటి ఏకాదశి ఉత్సవాలకు ఏర్పాట్లు శరవేగంగా కొనసాగతున్నాయి.. ఈ సందర్భంగా అక్కడ భద్రతా ఏర్పాట్లను జిల్లా ఎ ఎస్పీ రాజేష్ చంద్ర దగ్గరుండి పరిశీలించారు.. భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు.