Breaking News
  • సినీ నటుడు నర్సింగ్‌ యాదవ్‌కు తీవ్ర అస్వస్థత. సోమాజిగూడ యశోధ ఆస్పత్రిలో చికిత్స. కొంతకాలంగా కిడ్నీ సంబంధ వ్యాధితో బాధపడుతున్న నర్సింగ్‌ యాదవ్‌.
  • తెలంగాణలో ఇవాళ కొత్తగా 18 కరోనా పాజిటివ్ కేసులు నమోదు. తెలంగాణ లో ఇప్పటి వరకు 471కరోనా పాజిటివ్ కేసులు . ఇప్పటి వరకు మొత్తం 12 మంది మృతి చెందారు. పాజిటివ్ కేసుల నుంచి 45 మందికోలుకుని..డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 412 యాక్టీవ్ పాజిటివ్ కేసులు ఉన్నాయి.
  • ఈ రోజుతో మార్కస్ కు వెళ్లిన వారితో పాటు 665 టెస్టులు చేస్తే 18 మాత్రమే . 385 మంది మార్కస్ కాంటాక్ట్స్. 45 మంది డిశ్చార్జ్. మొత్తం 414 మంది ట్రీట్మెంట్స్ పొందుతున్నారు. తెలంగాణలో 1ఒక్కరు మాత్రమే వెంటిలేటర్ పై ఉన్నారు. 22 కళ్ళ అందరూ డిశ్చార్జ్ అవుతారు.
  • లాక్‌డౌన్‌తో చుక్కేసుకుంటే కానీ చక్కగా ఉండలేని మందుబాబులకు చుక్కలు కనిపిస్తున్నాయి.. బ్లాక్‌లో వేలకు వేలు పోసి లిక్కర్‌ బాటిళ్లు కొనుక్కుంటున్నారు. అంత డబ్బు పెట్టలేని సామాన్యులు మాత్రం పిచ్చేక్కిపోతున్నారు. ఎప్పుడెప్పుడు వైన్‌షాపులు తెరచుకుంటాయా అని ఎదురుచూస్తున్నారు.
  • నిజామాబాద్‌లో కరోనా విజృంభిస్తోంది. రోజురోజుకూ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతున్నది. తాజాగా మరో ఎనిమిది కేసులు నమోదు అయ్యాయి. దీంతో అప్రమత్తమైన జిల్లా యంత్రాంగం.

టిక్‌టాక్ యూజర్లు.. వెంటనే ఈ పనిచేయండి.. లేదంటే ఇక మీపని అంతే..

TikTok security bug allowed hackers to take control of accounts: Should you worry..key details to note, టిక్‌టాక్ యూజర్లు.. వెంటనే ఈ పనిచేయండి.. లేదంటే ఇక మీపని అంతే..

టిక్ టాక్‌.. సోషల్ మీడియా యూజర్లు ఎక్కువగా అడిక్ట్ అయిన యాప్ ఇది. అంతేకాదు.. అతితక్కువ కాలంలోనే ఎక్కువ మందికి దగ్గరైంది కూడా ఇదే. మనదేశంలో స్మార్ట్‌ఫోన్ ఉపయోగిస్తున్న వారిలో దాదాపు 30 కోట్ల మందికి పైగా.. ఈ టిక్‌టాక్ యాప్ వాడుతున్నారు. ఈ యాప్‌‌లో వచ్చే.. షార్ట్ వీడియో మెసేజ్‌లను వీక్షిస్తూ.. చాలా మంది టైంపాస్ చేస్తున్నారు. అయితే ఇలా చేసే వారిలో చాలామందికి కనీసం ఈయాప్ ఎలా వాడాలో కూడా తెలియదు. కానీ తల్లిదండ్రుల ఫోన్లలో ఈ టిక్‌టాక్ యాప్‌ను ఇన్‌స్టాల్‌చేస్తూ.. ఈ యాప్‌లోని షార్ట్ వీడియోస్ చూస్తే ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఈ విషయం తెలియని పేరెంట్స్.. ఈ యాప్ గురించి ఎక్కువగా పట్టించుకోవడం లేదు.

ఇదే అదనుగా చేసుకున్న హ్యాకర్లు.. వారి బుర్రకుపనిచెప్తున్నారు. టిక్ టాక్‍‌ ద్వారా ఓ బగ్‌ని ప్రవేశపెట్టారు. దీంతో అది ఇప్పుడు చాలా మంది టిక్‌టాక్ యూజర్స్ యాప్స్‌లో చేరింది. ఇది సదరు యూజర్‌ కాంటాక్ట్ నంబర్లు, లాగిన్ ఐడీలు, పాస్‌వర్డ్‌లు, ఫొటోలూ, వీడియోలన్నింటినీ.. హ్యాక్ చేస్తూ.. హ్యాకర్లకు అందిస్తోంది ఈ బగ్. అన్నింటికన్నా ముఖ్యంగా.. ఈ బగ్ ద్వారా అమ్మాయిలు తీసుకునే సెల్ఫీ పిక్స్‌, వీడియోలను హ్యాకర్లు దోచేస్తున్నారు. అనంతరం వాటిని మార్ఫింగ్ చేస్తూ.. పోర్న్ వెబ్‌సైట్లకు అమ్మేస్తున్నారట. ఇలా చాలా మందికి సంబంధించిన పిక్స్‌.. ఆ సైట్లలో దర్శనమించినట్లు పోలీసుల దర్యాప్తులో కూడా వెల్లడైంది.

అయితే ఈ బగ్‌ను టిక్ టాక్ సంస్థ.. బైట్ డాన్స్ నవంబర్‌ మాసంలోనే గుర్తించింది. వెంటనే ఈ బగ్‌కు చెక్ పెట్టేందుకు.. డిసెంబర్‌లో యాప్ సెక్యూరిటీని పెంచింది. అయితే.. ఇప్పటికీ ఇంకా అనేక మంది ఫోన్లలో ఈ బగ్ అలానే ఉండిపోయింది. దీనికి కారణం ఎంటని వెతికితే.. వారంతా ఈ టిక్‌టాక్ యాప్‌కు సంబంధించిన లేటెస్ట్‌గా అప్‌డేట్ చేయకపోవడమేనని తేలింది. అంతేకాదు.. రీ లాగిన్ కూడా కాకపోవడం. అయితే ఈ బగ్‌కు పూర్తిగా చెక్ పెట్టాలన్న ఉద్దేశంతో.. టిక్ టాక్ సంస్థ యూజర్లందరికీ యాప్‌ను అప్‌డేట్‌ చేసుకుని.. ఓ సారి లాగ్ అవుట్ అయ్యి.. మళ్లీ లాగ్ ఇన్ కావాలని సూచిస్తోంది. ఇలా చేయడం ద్వారా ఆ బగ్ నుంచీ తప్పించుకున్నట్లేనని చెబుతోంది. ఇలా చెయ్యకపోతే మాత్రం.. అనవసరపు చిక్కుల్లో పడే ప్రమాదం ఉన్నట్లు సైబర్ నిపుణులు చెబుతున్నారు. సో వెంటనే మీ ఫోన్‌లో టిక్ టాక్ ఉంటే.. అప్‌డేట్ చేసుకుని.. లాగిన్ అవ్వండి.

Related Tags