Breaking News
  • ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్‌ కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. రాష్ట్ర నోడల్‌ ఆఫీసర్‌ రాంబాబు టీవీ9 గుడ్‌మార్నింగ్ ఇండియాలో చెప్పినట్టుగానే పాజిటివ్‌ కేసులు బాగా పెరుగుతున్నాయి.
  • ప్రభుత్వ ఉద్యోగుల జీతాలలో కోత పెట్టి కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వడం కరెక్ట్‌ కాదంటున్నారు తెలుగుదేశంపార్టీ అధినేత చంద్రబాబునాయుడు. అధికారం ఉందని ఇష్ట ప్రకారం చేస్తామనడం సబబు కాదన్నారు.
  • కరోనా భూతాన్ని తరిమికొట్టేందుకు కేంద్ర ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంటోంది.. . ఇవాళ భేటి అయిన కేంద్ర కేబినెట్‌ ఇందుకు సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. కరోనా మహమ్మారిపై యుద్ధం చేయడానికి నిధుల కొరత ఉండకూడదన్న ఉద్దేశంతో పార్లమెంట్‌ సభ్యుల వేతనాల్లో 30 శాతం కోత విధించారు.. ఏడాది పాటు కోత ఉంటుంది.
  • కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టడానికి ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా కొన్నిచోట్ల ప్రభుత్వ ఆదేశాలను అధికారులు బేఖాతరు చేస్తున్నారు. విజయవాడ రూరల్ మండలం రామవరప్పాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తిరునాళ్లను తలపిస్తోంది.
  • ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలలో అకాలవర్షం భయపెడుతోంది. కర్నూలు, మహబూబ్‌నగర్‌ పరిధిలోని నల్లమల అటవీ ప్రాంతాల్లో జోరుగా వానపడింది. ఇటు వికారాబాద్‌ జిల్లా పర్గితో పాటు రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లోనూ వర్షం కురిసింది. వేసవి కాలంలో పడుతున్న ఈ అకాలవర్షంతో జనం బెంబేలెత్తారు.
  • కరోనా వైరస్‌ నియంత్రణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఏపీ ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. కర్నూలు జిల్లాలో కరోనా ల్యాబ్‌ ఏర్పాటు చేయబోతున్నట్లు వెల్లడించారు. టెలీ మెడిసిన్‌ అందుబాటులోకి తెస్తున్నామన్నారు. లాక్‌డౌన్‌ సడలింపు కేంద్రమే నిర్ణయించాలంటున్నారు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి.

సరిగ్గా ఉడకని మాంసం తింటున్నారా..? ప్రాణానికే ప్రమాదం

Risks of Undercooked Meat, సరిగ్గా ఉడకని మాంసం తింటున్నారా..? ప్రాణానికే ప్రమాదం

మీకు తలనొప్పి రెగ్యులర్‌గా వస్తోందా?..ఎంతమంది డాక్టర్ల దగ్గరికి వెళ్లినా..ఎన్ని రకాల మందులు వేసుకున్నా ఫలితం శూన్యంమా..? అయితే బీ అలర్ట్..వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్లి బ్రెయిన్‌కి సంబంధించిన అడ్వాన్స్‌డ్ టెస్ట్‌లు చేయించుకోండి. ఎందుకంటే బ్రెయిన్‌లో ‘టేప్ వార్మ్‌’ లు తిష్ట వేసి ఉండవచ్చు. ఇంకా కుదిరితే గుడ్లు కూడా పెట్టొచ్చు.

సరిగ్గా ఉడకని లేదా పచ్చి మాంసం తినడం ద్వారా మన శరీరంలోకి టేప్ వార్మ్‌లు వెళ్లే అవకాశం ఉందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ఇక ఆ టేప్ వార్మ్ శరీరంలో చాల ఫ్రీగా, ఉత్సాహంగా తిరుగే అవకాశం ఉందట. ఇక టైం బాగలేకపోతే ఆ జీవి బ్రెయిన్ వరకు చేరడానికి పెద్దగా టైం పట్టకపోవచ్చు. అలా జరిగితే వెన్నుపూస నుంచి స్పైనల్ ప్లూయిడ్ బ్రెయిన్ వరకు చేరడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. ఈ సమయంలో వివిధ రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ప్రాణలకే ముప్పు వాటిల్లే అవకాశం కూడా ఉంది. చైనా, అమెరికా లాంటి కంట్రీస్‌లో ఇటువంటి కేసులు చాలా నమోదయ్యాయి.

ఇక గర్బివతులు.. మాంసం తినే విషయంలో అత్యంత జాగ్రత్త వహించాలి. సరిగ్గా ఉడకని మాంసం తినడం వల్ల  టోక్సోప్లాస్మోసిస్‌ అనే ఇన్ఫెక్షన్‌ వచ్చి బేబీ మెదడు పెరుగుదలను దెబ్బతీస్తుంది. పిల్లలకు అంధత్వం కలిగే అవకాశం ఉంది. ఇక సరిగ్గా ఉడికి, ఉడకని చికెన్ తినడం వలన పక్షవాతం వచ్చే అవకాశాల ఎక్కువగా ఉన్నాయి. సో మాంసం తినే విషయంలో ప్రతి ఒక్కరు జాగ్రత్తలు పాటించడం అవసరం.

Related Tags