Breaking News
  • కర్నూలు: ప్రమాదంలో శ్రీశైలం డ్యామ్‌. పగుళ్లు వచ్చి డ్యామ్‌ ప్రమాదంలో ఉందని రాజేంద్రసింగ్‌ హెచ్చరిక. పగుళ్లతో వాటర్‌ లీకేజీలు ఎక్కువగా ఉన్నాయన్న రాజేంద్రసింగ్‌. గంగాజల్‌ సాక్షరత యాత్రలో భాగంగా శ్రీశైలం డ్యామ్‌ పరిశీలన. ప్రధాన డ్యామ్‌ ఎదురుగా భారీ గొయ్యి ఏర్పడింది. డ్యామ్‌ గేట్లు ఎత్తిన ప్రతీసారి మరింత పెద్దదవుతుంది. ఆ గొయ్యి విస్తరిస్తూ డ్యామ్‌ పునాదుల వరకు వెళ్తోంది. చాలా కాలం నుంచి లీకేజీలు వస్తున్నా పట్టించుకోలేదు. డ్యామ్‌ నిర్వహణ సరిగా లేకపోవడంతో ప్రమాదంగా మారింది.
  • శ్రీశైలం డ్యామ్‌కు పగుళ్లు వాస్తవమేనంటున్న అధికారులు. పరిస్థితిపై ప్రభుత్వానికి వివరించాం. డ్యామ్‌ కొట్టుకుపోయేంత ముప్పులేదంటున్న అధికారులు.
  • కాకినాడ: వైద్యం వికటించి యువకుడి పరిస్థితి విషమం. కడుపు నొప్పి రావడంతో ఫౌండేషన్‌ ఆస్పత్రిలో చేరిన యువకుడు. మూడు రకాల ఇంజెక్షన్‌లు చేసిన ఆస్పత్రి వైద్యులు. యువకుడి పరిస్థితి విషమించడంతో ట్రస్ట్‌ ఆస్పత్రికి తరలింపు.
  • కొలిక్కి రాని మహారాష్ట్ర పంచాయితీ. ముంబైలో నేడు వేర్వేరుగా కాంగ్రెస్‌, ఎన్సీపీ నేతల సమావేశం.
  • కొమురంభీంఆసిఫాబాద్‌: కాగజ్‌నగర్‌లో దారుణం. తల్లి సంధ్య గొంతు కోసిన కొడుకు. తల్లి పరిస్థితి విషమం, మంచిర్యాల ఆస్పత్రికి తరలింపు. అంగన్‌వాడీ టీచర్‌గా పనిచేస్తున్న సంధ్య.
  • ప్రకాశం: అద్దంకిలో రెండు ఇళ్లలో చోరీ. 7 సవర్ల బంగారం, రూ.10వేల నగదు, 2 సెల్‌ఫోన్లు అపహరణ.
  • నేడు జనగామ, మహబూబాద్‌ జిల్లాల్లో మంత్రి ఎర్రబెల్లి పర్యటన. పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొననున్న ఎర్రబెల్లి దయాకర్‌రావు.
  • చిత్తూరు: రామకుప్పం మండలం ననియాలతండాలో దారుణం. వేటగాళ్లు అమర్చిన విద్యుత్‌ తీగలు తగిలి రవి అనే వ్యక్తి మృతి. రవి మృతదేహాన్ని రహస్యంగా కాల్చివేసిన వేటగాళ్లు. రవిని హత్య చేశారంటున్న ననియాల గ్రామస్తులు. పలువురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్న పోలీసులు. ననియాల, ననియాలతండా గ్రామాలలో ఉద్రిక్తత.

వ్యాధుల కాలం – వానాకాలం

Rain season Diseases, వ్యాధుల కాలం – వానాకాలం

ఎండలతో అల్లాడిపోయిన జనానికి చినుకు పడేసరికి ప్రాణం లేచి వచ్చినట్టుగా అనిపిస్తుంది. ఎన్నాళ్లకు గుర్తొచ్చావే వాన అంటూ పాటలు పాడుకుంటూ ఉంటారు. కానీ ఈ వానలతో వ్యాధులు కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగానే ఉంటాయి. అందువల్ల ఈ సీజన్‌లో తగిన జాగ్రత్తలు తీసుకుంటే మంచిది.

జలుబు: వర్షంలో తడిస్తే ముందుగా వచ్చేది జలుబు దీంతో జ్వరం,దగ్గు కూడా కామన్‌గానే వచ్చేస్తాయి. జలుబు అంటువ్యాధి కూడా. శరీరంలో తగినంత వ్యాధినిరోధక శక్తి లేకపోవడంతో కొంతమందిలో వర్షంలో తడిసినా తడవకున్నా సరే జలుబు వస్తూనే ఉంటుంది. అది తగ్గడానికి కూడా చాల సమయం కూడా పడుతుంది. అయితే జలుబును పూర్తిగా తగ్గించే మందులు లేవనే విషయాన్ని వైద్యులు కూడా ఒప్పుకుంటారు. కేవలం దాన్నుంచి ఉపశమనం కలిగించే మందులు మాత్రమే ఉన్నాయి. జలుబు సమస్య ముఖ్యంగా చిన్నపిల్లల్లో వస్తే మరింత జాగ్రత్త అవసరం.

ఇక ఈ సీజన్‌లో సాధారణంగా జలుబుతోపాటు జ్వరం, మలేరియా, టైఫాయిడ్‌, అతిసార వ్యాధులు కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగానే ఉంటాయి. ఇవి ఒక్కోసారి ప్రాణాంతకం కూడా కావచ్చు.

డయేరియా : ఈ వ్యాధి ముఖ్యంగా కలుషితమైన ఆహారం,నీళ్లు తాగడం వల్ల ప్రబలే ప్రమాదం ఉంది. అందువల్ల ఈ సీజన్‌లో సాధ్యమైనంత వరకు వేడిగా ఉన్న పధార్ధాలనే తీసుకోవాలి. అలాగే ఈగలు ముసిరే పదార్ధాలను దరిచేరనివ్వకూడదు. ఎప్పుడూ పరిసరాలు పారిశుధ్యలోపం లేకుండా ఉంచుకోవాలి.

మలేరియా : ప్లాస్మోడియం అనే దోమకుట్టడం వల్ల వచ్చే ఈ వ్యాధి సోకుతుంది. వర్షకాలంలో అపరిశుభ్ర పరిసరాల వల్ల ఈదోమలువిపరీతంగా వ్యా ప్తి చెందుతాయి.దీంతో దోమల వల్లే ఈ వ్యాధి వ్యాపిస్తుంది.

డెంగ్యూ : వర్షకాలంలోఅతి వేగంగా వ్యాపించే మరో ప్రమాదకరమైన వ్యాది డెంగ్యూ. గతకొన్నేండ్లలో ఈ వ్యాధితో జిల్లాలో వందలాదిమంది ప్రాణాలు కోల్పోయారు. ఎడిస్‌ ఈజిప్టీ అనే దోమకాటు వల్ల ఈ వ్యాధి వ్యాపిస్తుంది. విపరీతమైన జ్వరం ప్లేట్‌లెట్స్‌ పడిపోవడం, తలనొప్పి, కీళ్లనొప్పులు, శరీరంపై దద్దుర్లు, జలుబు, దగ్గు ఈ వ్యాధి లక్ష ణాలు. జ్వరం వస్తూ, పోతూ ఉంటుంది. సకా లంలో చికిత్స అందకపోతే ఈవ్యాధి ప్రాణాలకే ముప్పుగా పరిణమించే అవకాశాలున్నాయి. ఇంటి పరిసరాల్లో ఉండే గుంతల్లో నీరు ఎక్కువ కాలం నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. సాధ్యమైనంత వరకు పొడిగా ఉండేలా చూసుకోవాలి.

వర్షాకాలంలో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోకపోతే పలు వ్యాధులతో ప్రమాదం పొంచిఉందనే విషయాన్ని అస్సలు మర్చిపోకూడదు. అదేవిధంగా బయటికి వెళ్లే ముందు వర్షంలో తడవకుండా గొడుగు, టోపీలవంటివి ఎప్పుడు వెంట తీసుకెళ్లడం కూడా అవసరంగానే భావించాలి.