Breaking News
  • చిత్తూరు: మదనపల్లెలో మహిళా సంఘాల ఆందోళన. నిందితుడిని ఉరి తీయాలంటూ చిన్నారి వర్షిత తల్లిదండ్రుల ధర్నా. తమకు న్యాయం చేయాలంటున్న వర్షిత తల్లిదండ్రులు. రఫీని బహిరంగంగా ఉరి తీయాలని డిమాండ్. విద్యుత్‌ టవర్‌ ఎక్కిన వర్షిత కుటుంబ సభ్యులు. కిందకు దించేందుకు పోలీసుల ప్రయత్నాలు.
  • వివాదంలో జార్జిరెడ్డి సినిమా. ఏబీవీపీ విద్యార్థులను రౌడీలుగా చూపెట్టే కుట్ర జరుగుతోందని ఆరోపణ. సినిమాలో జార్జిరెడ్డి రౌడీయిజాన్ని చూపెట్టాలన్న ఏబీవీపీ. ఇప్పటికే ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌కు అనుమతి నిరాకరించిన పోలీసులు. ఈ నెల 22న విడుదల కానున్న జార్జిరెడ్డి.
  • వరంగల్‌: ఏనుమాముల మార్కెట్ యార్ట్‌లో పత్తి కొనుగోళ్లు ప్రారంభం. ప్రభుత్వ హామీతో తిరిగి కొనుగోళ్లు ప్రారంభించిన కాటన్ వ్యాపారులు.
  • ఢిల్లీ చేరుకున్న ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌. సా.4గంటలకు సోనియాతో భేటీ కానున్న శరద్‌పవార్‌. మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు, ఉమ్మడి కార్యాచరణపై చర్చ.
  • హైదరాబాద్‌: హైకోర్టులో అగ్రిగోల్డ్ కేసు విచారణ. తాకట్టు పెట్టిన అగ్రిగోల్డ్ ఆస్తులను వేలం వేసిన బ్యాంకర్లు. సంవత్సరం గడిచినా కొనుగోలుదారులకు అందని కన్‌ఫర్మేషన్‌ ఆర్డర్. కన్‌ఫర్మేషన్‌ ఇవ్వాలని కోరిన బ్యాంకర్లు. డిసెంబర్‌ 5న మరోసారి విచారిస్తామన్న హైకోర్టు. తదుపరి విచారణ డిసెంబర్‌ 5కు వాయిదా.
  • లోక్‌సభలో కొనసాగుతున్న ప్రశ్నోత్తరాలు. ప్రాంతీయ భాషా పరిరక్షణపై కేశినేని నాని ప్రశ్న. త్రిభాషా విధానాన్ని అమలు చేయాలి-కేశినేని నాని. ప్రాంతీయ భాషలను రక్షించాల్సిన అవసరం ఉంది-కేశినేని నాని. పలు అంశాలపై చర్చకు పట్టుబడుతున్న విపక్షాలు. విపక్ష సభ్యుల నినాదాల మధ్య కొనసాగుతున్న సభ. తెలుగు భాష ఉన్నతికి చర్యలు తీసుకుంటున్నాం-మంత్రి పోఖ్రియాల్‌.
  • ఆగ్రా జిల్లా పేరు మార్చే యోచనలో యూపీ సర్కార్. ఆగ్రా పేరును ఆగ్రావన్‌గా మార్చాలని యూపీ సర్కార్‌ యోచన. కాషాయికరణలో భాగంగా పేరు మారుస్తున్నారని విపక్షాల విమర్శలు. గతంలో ఫైజాబాద్‌ను అయోధ్యగా.. అలహాబాద్‌ను ప్రయాగ్‌రాజ్‌గా మార్చిన యూపీ సర్కార్.

‘ క్లైమేట్ పిల్ల ‘ కు నోబెల్ శాంతి బహుమతి ? బెట్టింగుల జోరు !

స్వీడిష్ టీనేజర్, క్లైమేట్ ఛేంజ్ పై ప్రపంచ వ్యాప్త ఉద్యమం ప్రారంభించిన 16 ఏళ్ళ గ్రెటా థన్ బెర్గ్ కి నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలన్న డిమాండ్ ఊపందుకుంటోంది. ఈ ప్రతిష్టాత్మకమైన ప్రైజ్ ఆమెకు తప్పక లభిస్తుందని బుక్ మేకర్స్ (పందెం రాయుళ్లు కొందరు) విశ్వాసం ప్రకటిస్తున్నారు. కానీ మరికొంతమంది వారితో విభేదిస్తున్నారు. గ్రెటాకు ఇదివరకే ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ అవార్డు, రైట్ లైవ్ లీ అవార్డు వచ్చాయని, మళ్ళీ నోబెల్ శాంతి బహుమతి ఎందుకని వారు ప్రశ్నిస్తున్నారు. రైట్ లైవ్ లీ అవార్డు అన్నది ఒకవిధంగా నోబెల్ బహుమతి లాంటిదే అన్నది వారి వాదన. (నార్వేలో ఈ వారంలోనే నోబెల్ శాంతి బహుమతిని ప్రకటించనున్నారు). ప్రపంచంలోనే మోస్ట్ ప్రెస్టీజియస్ అవార్డు అయిన ఇది గ్రెటాకే లభిస్తుందని ‘ ల్యాడ్ బ్రోక్స్ ‘ వంటి ఆన్ లైన్ బెట్టింగ్ సైట్స్ లో బెట్టింగులు కాస్తున్నారు చాలామంది. ఆమె ఇందుకు అన్ని విధాలా అర్హురాలన్నది వారి నమ్మకం.
గత ఆగస్టులో గ్రెటా .. ఓ స్విస్ బ్రాడ్ కాస్టర్ కు ఇఛ్చిన ఇంటర్వ్యూలో .. ఈ అవార్డు తనకు వస్తే అది తాను లాంచ్ చేసిన ఉద్యమానికి గుర్తింపునిచ్చినట్టే అని పేర్కొంది. తాము ఇలాంటి అవార్డులకోసం ఉద్యమం చేయడంలేదని గ్రెటాతో బాటు ఆమె ఫ్రెండ్స్ కూడా నిక్కచ్చిగా చెబుతున్నారు.

క్లైమేట్ ఛేంజ్ పై గత ఏడాది ఈమె స్వీడన్ పార్లమెంట్ ముందు ప్రతి శుక్రవారం ఆందోళన ప్రారంభించింది. ‘ స్కూల్ స్ట్రైక్ ఫర్ ది క్లైమేట్ ‘ అని రాసి ఉన్న సైన్ బోర్డు పట్టుకుని తన ఉద్యమానికి నాంది పలికింది. పర్యావరణ పరిరక్షణ కోసం ఉద్యమించిన ఈ అమ్మాయి కొద్దికాలంలోనే ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది యువతను ఆకట్టుకోగలిగింది. గ్రెటా ఆందోళనకు పెద్ద సంఖ్యలో ప్రజలు మద్దతు పలికారు. వివిధ నగరాల్లో ప్రదర్శనలు చేశారు. గత సెప్టెంబరులో న్యూయార్క్ లోని ఐక్యరాజ్యసమిత్జిలో క్లైమేట్ ఛేంజ్ పై జరిగిన సదస్సులో ఈమె ప్రపంచ నేతలను సైతం వణికించింది. ట్రంప్ వంటి అగ్రరాజ్యాధినేతను కూడా ఈ చిన్నది చెమటలు పట్టించింది.

కాగా-గ్రెటా థన్ బెర్గ్ కు నోబెల్ బహుమతి రాకపోవచ్ఛునని ఓస్లో లోని పీస్ రీసెర్చ్ ఇన్స్ టి ట్యూట్ డైరెక్టర్ హెన్రిక్ ఉర్దల్ అభిప్రాయపడ్డారు. వాతావరణ మార్పులు సాయుధ ఘర్షణకు కారణమవుతాయన్నదానిపై ఇంకా ఏకాభిప్రాయం రాలేదని ఆయన తెలిపారు. పైగా ఈ అమ్మాయిది చిన్న వయస్సు.. ఆమెకు రివార్డు కన్నా ఇది ఎక్కువ భారం (బర్డెన్) కావచ్ఛు ‘ అని వ్యాఖ్యానించారు.
నార్వేకు చెందిన చరిత్రకారుడు యాస్లే స్వీన్ కూడా ఇదే విధమైన అభిప్రాయం వ్యక్తం చేశారు. కానీ.. గ్రెటా ఈ అవార్డుకు అర్హురాలేనని స్టాక్ హామ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్ టి ట్యూట్ డైరెక్టర్ డాన్ స్మిత్ పేర్కొన్నారు. ఏమైనా-ఈ 16 ఏళ్ళ బాలికకు నోబెల్ పీస్ ప్రైజ్ వస్తే అది అంతర్జాతీయంగా ‘ బాలల ప్రపంచానికి ‘ గర్వకారణమే !