అభివృద్ది సాధించిన జడ్పీలకు 10 కోట్ల నజరానా: కేసీఆర్

గ్రామాల అభివృద్దికి పాటుపడిన జిల్లా పరిషత్‌లకు పది కోట్ల రూపాయల ప్రోత్సాహక బహుమతి ప్రకటించారు తెలంగాణ సీఎం కేసీఆర్. ఇటీవల ఎన్నికైన జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌లు, వైస్ చైర్‌పర్సన్‌లతో సీఎం సమావేశయ్యారు. ఈనేపథ్యంలోనే కొత్తగా ఎన్నికైన సభ్యులకు దిశానిర్దేశం చేశారు. పంచాయితీ రాజ్ ఉద్యమ స్ఫూర్తితో గ్రామాల అభివృద్దికి పాటు పడాలని సీఎం సూచించారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో ఇప్పటికే అభివృద్ది చెందిన గంగదేవిపల్లె, ముల్కనూరు, అంకాపూర్ వంటి ఆదర్శ గ్రామాలుగా రాష్ట్రంలోని ఇతర గ్రామాలను తీర్చిదిద్దాలని […]

అభివృద్ది సాధించిన జడ్పీలకు 10 కోట్ల నజరానా: కేసీఆర్
Follow us

| Edited By:

Updated on: Jun 12, 2019 | 10:43 AM

గ్రామాల అభివృద్దికి పాటుపడిన జిల్లా పరిషత్‌లకు పది కోట్ల రూపాయల ప్రోత్సాహక బహుమతి ప్రకటించారు తెలంగాణ సీఎం కేసీఆర్. ఇటీవల ఎన్నికైన జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌లు, వైస్ చైర్‌పర్సన్‌లతో సీఎం సమావేశయ్యారు. ఈనేపథ్యంలోనే కొత్తగా ఎన్నికైన సభ్యులకు దిశానిర్దేశం చేశారు. పంచాయితీ రాజ్ ఉద్యమ స్ఫూర్తితో గ్రామాల అభివృద్దికి పాటు పడాలని సీఎం సూచించారు.

ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో ఇప్పటికే అభివృద్ది చెందిన గంగదేవిపల్లె, ముల్కనూరు, అంకాపూర్ వంటి ఆదర్శ గ్రామాలుగా రాష్ట్రంలోని ఇతర గ్రామాలను తీర్చిదిద్దాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా రానున్న ఆరు నెలల్లో పల్లెల్లో అభివృద్ది కనిపించాలని ఆయన తెలిపారు. ఇందుకోసం ప్రజా ప్రతినిధులకు శిక్షణ కార్యక్రమాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు.

కాగా గెలిచిన ప్రజా ప్రతినిధులు గర్వంతో పని చేయవద్దని సూచించారు. పంచాయితీ రాజ్ చట్టంలో భాగంగా పంచాయితీ వ్యవస్థలను బలోపేతం చేయాలని పేర్కొన్నారు. గ్రామీణ అభివృద్దికి పూర్వ వైభవం తీసుకురావాలని అన్నారు. ఇలా గ్రామాల్లో నిర్ధేశించిన లక్ష్యాలను పూర్తి చేసిన జిల్లా పరిషత్‌లకు ప్రత్యేక నిధి ద్వారా రూ.10 కోట్లను మంజూరు చేస్తామని ప్రకటించారు. ఇక కొత్తగా ఎన్నికైన చైర్మన్లకు కొత్త వాహనాలను అందుబాటులోకి తీసుకువస్తామని స్పష్టం చేశారు.