అహోబిల స్వామివారికి విలువైన వజ్ర కిరీటం..

బెంగళూరుకు చెందిన ఓ భక్తుడు కర్నూలు అహోబిలం శ్రీ లక్ష్మినరసింహ స్వామికి విలువైన కిరీటాన్ని బహుకరించారు. స్వామివారి మీద భక్తితో అతడు..ఆ విలువైన కానుకను అందజేశాడు..అతడు సమర్పించిన కిరీటం విశేషం ఏంటంటే...

అహోబిల స్వామివారికి విలువైన వజ్ర కిరీటం..
Follow us

|

Updated on: Mar 03, 2020 | 12:18 PM

వజ్ర కీరిటంతో తన భక్తిని చాటుకున్నాడు ఓ భక్తుడు.. బెంగళూరుకు చెందిన ప్రముఖ ప్రబల వీణ విద్వాంసుడు శ్రీకాంత్‌ అయ్యంగార్‌.. కర్నూలు అహోబిలం శ్రీ లక్ష్మినరసింహ స్వామి వారిని దర్శించుకున్నాడు.. స్వామి మీద భక్తితో రెండు లక్షల విలువ చేసే వజ్ర కీరిటాన్ని బహుకరించాడు.. కీరిటానికి బంగారు, వెండి కోటింగ్‌తో వజ్రాల రాళ్లను అమర్చారు.. స్వామివారి దర్శనార్ధం వచ్చేవారికి ఈ కీరటం అందరీని ఆకట్టుకుంటుంది. అహోబిలం కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండంలో ఉంది. ఇది ఆళ్లగడ్డ నుంచి 22 కిలోమీటర్ల దూరంలో నంద్యాల నుంచి 60 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ క్షేత్రం నల్లమల అడవుల్లో సముద్ర మట్టానికి 2800 అడుగుల ఎత్తులో ఉంటుంది. హిరణ్య కసిపుడిని సంహరించడానికి నరసింహుడు ఉద్భవించిన ప్రదేశమే అహోబిలం. దీనిని అహోబలం అని కూడా అంటారు. నరసింహుడి బలాన్ని, శక్తిని దేవతలు ప్రశంసించడం వల్ల దీనికి ఆ పేరు వచ్చిందని చెబుతారు. ఈ క్షేత్రాన్నిభక్తులు ఎగువ అహోబిలం, దిగువ అహోబిలం అనే పేరుతో పిలుస్తారు.