కరోనా తెచ్చిన అదృష్టం.. ఒక్క రాత్రిలో ఎంత మార్పు..!

అతడో కార్పెంటర్. పేరు ఇజారుల్. అతడు పశ్చిమ బెంగాల్ వాసి అయినప్పటికీ బతుకు తెరువు కోసం కేరళ బాట పట్టాడు. అతడిది పని దొరికితేనే కానీ పూట గడవని పరిస్థితి. బెంగాల్‌లొ అతడు రోజుకు 500 మాత్రమే సంపాదించేవాడు. కానీ

కరోనా తెచ్చిన అదృష్టం.. ఒక్క రాత్రిలో ఎంత మార్పు..!
Follow us

| Edited By:

Updated on: Mar 22, 2020 | 5:04 PM

అతడో కార్పెంటర్. పేరు ఇజారుల్. అతడు పశ్చిమ బెంగాల్ వాసి అయినప్పటికీ బతుకు తెరువు కోసం కేరళ బాట పట్టాడు. అతడిది పని దొరికితేనే కానీ పూట గడవని పరిస్థితి. బెంగాల్‌లొ అతడు రోజుకు 500 మాత్రమే సంపాదించేవాడు. కానీ కేరళలో దీనికి రెట్టింపు సంపాదన వస్తుందని తెలిసి అక్కడకు వెళ్లాడు. అయితే ఇటీవల కేరళలో కరోనా ప్రబలడంతో అతడు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని స్వరాష్ట్రానికి చేరుకున్నాడు. కానీ అతడికి ఇంటి దగ్గర పనిదొరకకపోవడంతో అప్పటి వరకూ కుడబెట్టుకున్న సంపాదన మీదే బతుకు ఈడుస్తున్నాడు.

కాగా.. చేతిలో డబ్బు క్రమంగా అయిపోతుండటంతో అతడిలో కంగారు మొదలైంది. ఏం చేయాలో తెలీక ఇటీవల అతడు ఓ లాటరీ టిక్కెట్టు కొన్నాడు. అంతే.. మరుసటి రోజు కల్లా అతడి జీవితం సమూలంగా మారిపోయింది. తెల్లారేసరి కల్లా తాను కోటీస్వరుడైపోయానని తెలిసి అతడి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. డబ్బు సంపాదన కోసం ఇక నుంచి కుటుంబానికి దూరంగా ఉండాల్సిన అవసరం లేదంటూ అతడు ఉబ్బితబ్బిబైపోయాడు.

ఈ నేపథ్యంలో.. మంచి ఇల్లు కట్టుకోవడంతో పాటూ సొంతంగా వ్యాపారాన్ని ప్రారంభిస్తానని, తన కుమారులను మంచి చదువులు చదివిస్తానని అతడు చెప్పాడు. అయితే గతంలో కేరళ వరదల సమయంలోనూ అతడు ఇలాగే ప్రాణాలు అరిచేత పెట్టుకుని స్వరాష్ట్రానికి తిరిగొచ్చాడు. ఈ ఏడాది కూడా అదే విధంగా జరిగినప్పటికీ కరోనా వైరస్ రూపంలో అతడికి అదృష్టం కలిసొచ్చింది. రాత్రికి రాత్రే అతడి జీవితం మారిపోయింది. స్థానిక మీడియాలో వచ్చిన ఈ కథనం ప్రస్తుతం తెగ సంచలనం సృష్టిస్తోంది.