రెండు బ్యాంక్ అకౌంట్లు ఉంటే ఎన్నో లాభాలు.. అవేంటంటే.?

ఇప్పుడున్న స్మార్ట్ యుగంలో యువతకు ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు ఉండటం అలవాటుగా మారింది. జాబ్, మరేదైనా పని నిమిత్తం.. ఒక బ్యాంక్‌లో అకౌంట్ ఉన్నా.. వేరొక బ్యాంక్‌లో ఖాతా తీసుకునే అవసరం పడుతోంది. ఇక కొందరు ఇలా అకౌంట్లు మెయింటైన్ చేయడం వల్ల నష్టాలు ఏర్పడుతాయని అంటుంటే.. మరికొందరు లాభాలు కూడా ఉన్నాయని అంటున్నారు. అనేక బ్యాంకులు.. అనేక రకాలైన సేవింగ్స్ అకౌంట్ల సౌకర్యాన్ని అందిస్తుండటంతో.. దాని వల్ల కస్టమర్లు ప్రయోజనాలు పొందవచ్చని వారి […]

రెండు బ్యాంక్ అకౌంట్లు ఉంటే ఎన్నో లాభాలు.. అవేంటంటే.?
Follow us

| Edited By: Srinu

Updated on: Nov 26, 2019 | 4:53 PM

ఇప్పుడున్న స్మార్ట్ యుగంలో యువతకు ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు ఉండటం అలవాటుగా మారింది. జాబ్, మరేదైనా పని నిమిత్తం.. ఒక బ్యాంక్‌లో అకౌంట్ ఉన్నా.. వేరొక బ్యాంక్‌లో ఖాతా తీసుకునే అవసరం పడుతోంది. ఇక కొందరు ఇలా అకౌంట్లు మెయింటైన్ చేయడం వల్ల నష్టాలు ఏర్పడుతాయని అంటుంటే.. మరికొందరు లాభాలు కూడా ఉన్నాయని అంటున్నారు. అనేక బ్యాంకులు.. అనేక రకాలైన సేవింగ్స్ అకౌంట్ల సౌకర్యాన్ని అందిస్తుండటంతో.. దాని వల్ల కస్టమర్లు ప్రయోజనాలు పొందవచ్చని వారి భావన.

కొన్ని బ్యాంకులు సేవింగ్స్ ఖాతాలపై అధిక వడ్డీ రేట్లు ఇస్తుంటారు. అందువల్ల కస్టమర్లు డబ్బును ఫిక్స్‌డ్ డిపాజిట్లలో పెట్టడం కంటే.. వీటికి ప్రాధాన్యత ఎక్కువ ఇస్తుంటారు. డబ్బులను అకౌంట్లలో దాచుకుంటే.. ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు. దీంతో ఒక బ్యాంక్‌లో సేవింగ్స్ అకౌంట్‌కు తక్కువ వడ్డీ వస్తున్నా.. వేరే బ్యాంక్‌ అకౌంట్‌లో అధిక వడ్డీ వస్తుంటే.. దాని వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి. ఇక సేవింగ్స్ అకౌంట్లతో డెబిట్ కార్డులు కూడా ఇస్తారు.

ఇదిలా ఉంటే ప్రీమియం కార్డుల వల్ల ఎన్నో ఉపయోగాలు ఉంటాయి. ఎక్కువ క్యాష్ విత్ డ్రా చేసుకోవచ్చు.. జీరో ట్రాన్సాక్షన్ కాస్ట్, రివార్డు పాయింట్లు, ఎక్స్‌క్లూజివ్ రివార్డు పాయింట్లు, ఫ్రీ లాంజ్ యాక్సెస్ వంటి అనేక సౌకర్యాలు ఉంటాయి. ఇక ఈ ప్రయోజనాలన్నీ ఒక అకౌంట్ ద్వారా పొందటం కష్టం.. ఇంకో బ్యాంక్ అకౌంట్ ఉంటేనే సాధ్యమవుతుంది.

ఇకపోతే ఒక బ్యాంక్ అకౌంట్‌ ఉన్నప్పుడు.. దాని నుంచి ఒక రోజులో తీసుకునే క్యాష్ లిమిట్ తక్కువగా ఉంటుంది. ఒకవేళ మనకు అత్యవసర పరిస్థితి ఏర్పడినప్పుడు.. మనకు వేరొక బ్యాంక్ అకౌంట్ ఉంటే.. రెండు ఏటీఎం కార్డుల నుంచి డబ్బులు తీసుకునే అవకాశం ఉంటుంది.

మరోవైపు చాలామందికి ఒకటో తేదీన వచ్చే శాలరీ తొందరగా ఖర్చు అయిపోతోంది. అలాంటప్పుడు రెండు అకౌంట్లు ఉంటే.. ఒకదానిలో ఈఎంఐలు, రోజూవారీ ఖర్చులకు ఉపయోగించుకునే డబ్బులు దాచుకోవచ్చు. మరొకదానిలో సేవింగ్స్ దాచుకోవచ్చు. ఇదంతా రెండు బ్యాంకు అకౌంట్లు ఉంటేనే కుదురుతుంది.

ఇది కాకుండా ఒకవేళ బ్యాంక్ బోర్డు తిప్పేస్తే.. మీకు లక్ష వరకు ఇన్సూరెన్స్ కవరేజ్ లభిస్తుంది. అదే రెండు బ్యాంక్ అకౌంట్లు ఉంటే డబ్బులు డబుల్ అవుతాయి. చూసారా రెండు బ్యాంక్ అకౌంట్లు ఉండటం వల్ల అనేక లాభాలు ఉంటాయి.