‘రాక్షసుడు’ సెన్సార్ పూర్తి..!

Bellamkonda Srinivas Rakshasudu, ‘రాక్షసుడు’ సెన్సార్ పూర్తి..!

బెల్లంకొండ శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రల్లో దర్శకుడు రమేష్ వర్మ తెరకెక్కిస్తున్న చిత్రం ‘రాక్షసుడు’. తమిళం మూవీ ‘రాక్షసన్’కు రీమేక్‌గా రూపొందుతున్న ఈ సినిమా ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని… ‘U/A ‘ సర్టిఫికెట్ పొందింది. ఇకపోతే ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా ఆగస్టు 2న విడుదల కానుంది.

స్కూల్ కి వెళ్లే టీనేజ్ అమ్మాయిలను కిడ్నాప్ చేసి వారి ప్రాణాలు తీసే సైకో కిల్లర్ కథాంశంతో క్రైమ్ థ్రిల్లర్ గా ఈ సినిమాని తెరకెక్కించారు. రీసెంట్‌గా విడుదలైన ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. ఏ స్టూడియోస్, అభిషేక్ పిక్చర్స్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి జిబ్రాన్ సంగీతం అందిస్తున్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *